పిల్లలు మందకొడిగా ఉంటున్నారా?
హెల్త్‌టిప్స్
చిన్నపిల్లలు రోజులో చాలాసేపు నిద్రపోతూనే ఉంటారు. ఒకటి రెండు గంటలు మాత్రమే మెలకువతో ఉంటారు. ఇలాంటప్పుడు పాలు బాగా తాగుతూ, మూత్రవిసర్జన బాగానే చేస్తూ ఉంటే రోజులో ఎక్కువ భాగం నిద్రపోతున్నా అది సాధారణమే. దాన్ని సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు. అయితే ఆకలి వేసినప్పుడు తనంతట తానే నిద్రలేవకుండా ఉండటం, ఆహారం తీసుకోడానికి ఆనాసక్తి ప్రదర్శిస్తూ ఉండటం, మెలకువగా ఉన్న సమయంలో కూడా చురుగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పక పిల్లల డాక్టర్‌కు చూపించాలి. ఎందుకంటే అది బిడ్డలో ఏదైనా లోపానికి సూచన కావచ్చు.
హనీ టీ తాగితే ఆరోగ్యం పెరిగి వార్ధక్యం దూరమవుతుం ది. దీని తయారీకిæ నాలుగు స్పూన్ల తేనె, ఒక స్పూను దాల్చిన చెక్క పొడి, మూడు కప్పుల నీటిని తీసుకోవాలి. నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి దించిన తర్వాత తేనె కలిపి తాగాలి(తేనెను మరిగిస్తే పోషకాలు నశిస్తాయి కాబట్టి చివరగా కలుపుకోవాలి). ఒకసారికి పావు కప్పు చొప్పున రోజుకు మూడు–నాలుగు సార్లు ఈ టీ తాగుతుంటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. చర్మం తాజాగా, మృదువుగా ఉంటుంది కాబట్టి వార్ధక్య లక్షణాలు దరిచేరవు. వయసు పెరిగినా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉత్సాహంగా ఉండగలగడం సాధ్యమవుతుంది.
బ్రేక్‌ఫాస్ట్‌లో చపాతీ లేదా బ్రెడ్ మీద జామ్, జెల్లీలకు బదులుగా తేనె, దాల్చినచెక్కపొడి మిశ్రమాన్ని రాసుకుని తింటే గుండె సంబంధ వ్యాధులు రావు. ఇది రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు కూడా దీనిని పాటిస్తే రెండవ స్ట్రోక్‌కు దూరంగా ఉంటారు. దాల్చిన చెక్క పొడి, తేనెల కాంబినేషన్ రక్తనాళాలను ఆరోగ్యవంతం చేసి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఒక మోతాదు తేనెలో రెండు మోతాదుల నీటిని, ఒక స్పూను దాల్చిన చెక్క పొడిని కలిపి ఆ మిశ్రమంతో కీళ్లనొప్పులున్న చోట మర్దన చేస్తే రెండు – మూడు నిమిషాలలోనే బాధ తగ్గుతుంది.