Sluggish
-
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ద్రవ్యోల్బణం షాక్! అక్కడ డిమాండ్ ఢమాల్!
ముంబై: ఎఫ్ఎంసీజీ కంపెనీలు వ్యాపారంలో స్తబ్దతను చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సన్నగిల్లడం, అధిక ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఆదాయాల్లో పెద్దగా వృద్ధి కనిపించదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే పరిమితం కాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. 2022-23లో 7-9 శాతం మధ్య ఆదాయంలో వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాను వెల్లడించింది. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.5 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘రూ.4.7 లక్షల కోట్ల మొత్తం ఆదాయంలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం, తగ్గిన వేతనాలు, కరోనాతో ఉపాధి నష్టం పరిస్థితులు నెలకొన్నట్టు’’ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఎఫ్ఎంసీజీ రంగంపై ఓ నివేదికను విడుదల చేసింది. తయారీ వ్యయాలు పెరగడంతో, మార్జిన్లను కాపాడుకునేందుకు కరోనా అనంతరం విడతల వారీగా రేట్లను ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచాయి. దీని ప్రభావం కూడా వృద్ధిపై ఉన్నట్టు ఈ నివేదిక వివరించింది. (టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్) ధరలు తగ్గితే అనుకూలం.. ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం సైతం ఆదాయంలో వృద్ధి ఇప్పటి మాదిరే ఉండొచ్చని, ఒకవేళ ధరలు దిగొస్తే పరిస్థితి మెరుగుపడొచ్చన్నది క్రిసిల్ విశ్లేషణ. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 1-1.5 శాతం తగ్గి 18-19 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాలు (గోధుమ, పాలు, మొక్కజొన్న, బియ్యం, చమురు), మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇవి గత నాలుగైదు త్రైమాసికాలుగా పెంచిన ధరల అనుకూలతను తగ్గించినట్టు వివరించింది. ఇక వంట నూనెలు, చక్కెర ధరలు తగ్గినందున కొంత అనుకూలిస్తుందని పేర్కొంది. రూ.4.7 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 35 శాతం వాటా కలిగిన 76 కంపెనీల వివరాలను క్రిసిల్ విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 0.50–0.70 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. ధరల ప్రభావం.. పట్టణ వినియోగంపై ద్రవ్యోల్బణం (రేట్ల పెరుగుదల) ప్రభావం తక్కువగానే ఉందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. 2020-2021లో మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ స్తబ్ధుగానే ఉంటుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత్లాలో చిన్న ప్యాకెట్లకు డిమాండ్ పెరగడాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. పంటలకు అధిక కనీస మద్దతు ధరలు, సాగు దిగుబడి మెరుగ్గా ఉండడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ వచ్చే ఆర్థిక సంత్సరంలో పుంజుకుంటుందని చెప్పడానికి సంకేతాలుగా తెలియజేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం పట్టణాల్లో డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇక ఫుడ్ అండ్ బెవరేజెస్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరగొచ్చని పేర్కొంది. గృహ సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ అమ్మకాల్లో 6-8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. -
పంక్చువాలిటీ పాటిస్తున్నారా?
అందరూ పనులు చేస్తారు, కొందరు అన్నీ అనుకున్న టైమ్‌కే జరగాలనుకుంటారు. అలా తమను మలచుకుంటారు. కొంతమంది ఇష్టమైనవి, అయిష్టమైనవి అన్న తేడా లేకుండా ఏ పనినైనా సరే తమకు మూడ్ ఉంటేనే చేస్తారు. పంక్చువాలిటీ, టైమ్ మేనేజ్మెంట్ అన్న పదాలను ఇష్టపడరు. ఇంతకీ మనం ఎలా ఉంటున్నాం? 1. మీ స్కూలు, కాలేజ్‌లకి టైమ్‌కి వెళ్లడానికంటే ఆలస్యంగా వెళ్లిన రోజులే ఎక్కువ. ఎ. అవును బి. కాదు 2. ఎగ్జామ్‌కి వెళ్లే ముందు పెన్నులు, కంపాస్ బాక్స్ వంటి వాటిని వెతుక్కోవడం మీకు అలవాటు. ఎ. అవును బి. కాదు 3. థియేటర్‌కు వెళ్లి చూసిన సినిమాల్లో దాదాపుగా అన్నీ కనీసం పది నిమిషాల ఆలస్యంగా వెళ్లిన సందర్భాలే ఎక్కువ. ఎ. అవును బి. కాదు 4. లేట్‌గా వెళ్లినందుకు స్కూల్లో పనిష్మెంట్ తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎ. అవును బి. కాదు 5. మీరు ఎలాంటి సందర్భంలోనైనా నింపాదిగానే ఉంటారని మీ ఫ్రెండ్స్ ఆటపట్టిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 6. ఉద్యోగంలో కాని ఇతర ఏ పనులనైనా చేయడం ముఖ్యం కాని ఫలానా టైమ్‌లోనే చేయాలన్న నిబంధనలను మీకు నచ్చవు. ఎ. అవును బి. కాదు 7. అశ్రద్ధ, నిరాసక్తత, బద్దకం వల్ల పని నిర్ణీత సమయానికి పూర్తి కాని సందర్భం మీ కెరీర్లో ఒక్కటి కూడా లేదు. ఎ. కాదు బి. అవును 8. టైమ్ మేనేజ్మెంట్ పాటించకపోతే పంక్చువాలిటీ లేని ఉద్యోగిగా ముద్ర పడుతుందని నమ్ముతారు. ఎ. కాదు బి. అవును మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకంటే ఎక్కువగా వస్తే పంక్చువాలిటీ మీద అసలు పట్టింపు లేదనుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే మీకు కేటాయించిన బాధ్యతలను పూర్తి చేయడంలో ఆలస్యమైనప్పుడు అందుకు సహేతుకమైన కారణం ఉండి ఉంటుంది అని మీ పై అధికారి నమ్మడానికి అవకాశం ఉండదు. ‘బి’లు ఎక్కువైతే మీది క్రమబద్ధంగా పనిచేయాలన్న ధోరణి అనుకోవాలి. దీనిని కొనసాగించండి. -
పిల్లలు మందకొడిగా ఉంటున్నారా?
హెల్త్‌టిప్స్ చిన్నపిల్లలు రోజులో చాలాసేపు నిద్రపోతూనే ఉంటారు. ఒకటి రెండు గంటలు మాత్రమే మెలకువతో ఉంటారు. ఇలాంటప్పుడు పాలు బాగా తాగుతూ, మూత్రవిసర్జన బాగానే చేస్తూ ఉంటే రోజులో ఎక్కువ భాగం నిద్రపోతున్నా అది సాధారణమే. దాన్ని సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు. అయితే ఆకలి వేసినప్పుడు తనంతట తానే నిద్రలేవకుండా ఉండటం, ఆహారం తీసుకోడానికి ఆనాసక్తి ప్రదర్శిస్తూ ఉండటం, మెలకువగా ఉన్న సమయంలో కూడా చురుగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పక పిల్లల డాక్టర్‌కు చూపించాలి. ఎందుకంటే అది బిడ్డలో ఏదైనా లోపానికి సూచన కావచ్చు. హనీ టీ తాగితే ఆరోగ్యం పెరిగి వార్ధక్యం దూరమవుతుం ది. దీని తయారీకిæ నాలుగు స్పూన్ల తేనె, ఒక స్పూను దాల్చిన చెక్క పొడి, మూడు కప్పుల నీటిని తీసుకోవాలి. నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి దించిన తర్వాత తేనె కలిపి తాగాలి(తేనెను మరిగిస్తే పోషకాలు నశిస్తాయి కాబట్టి చివరగా కలుపుకోవాలి). ఒకసారికి పావు కప్పు చొప్పున రోజుకు మూడు–నాలుగు సార్లు ఈ టీ తాగుతుంటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. చర్మం తాజాగా, మృదువుగా ఉంటుంది కాబట్టి వార్ధక్య లక్షణాలు దరిచేరవు. వయసు పెరిగినా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉత్సాహంగా ఉండగలగడం సాధ్యమవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో చపాతీ లేదా బ్రెడ్ మీద జామ్, జెల్లీలకు బదులుగా తేనె, దాల్చినచెక్కపొడి మిశ్రమాన్ని రాసుకుని తింటే గుండె సంబంధ వ్యాధులు రావు. ఇది రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు కూడా దీనిని పాటిస్తే రెండవ స్ట్రోక్‌కు దూరంగా ఉంటారు. దాల్చిన చెక్క పొడి, తేనెల కాంబినేషన్ రక్తనాళాలను ఆరోగ్యవంతం చేసి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఒక మోతాదు తేనెలో రెండు మోతాదుల నీటిని, ఒక స్పూను దాల్చిన చెక్క పొడిని కలిపి ఆ మిశ్రమంతో కీళ్లనొప్పులున్న చోట మర్దన చేస్తే రెండు – మూడు నిమిషాలలోనే బాధ తగ్గుతుంది. -
సేత్వారీ స్కాన్ ఇండెక్స్ సగమే
♦ ఇప్పటివరకు 5 వేల గ్రామాల్లోనే పూర్తి ♦ 3,942 గ్రామాలకు సేత్వారీలే లేవు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ రికార్డుల ప్రక్షాళనకు కీలకమైన సేత్వారి స్కాన్ ఇండెక్స్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. సేత్వారీలు (భూమి వివరాలుండే పత్రం) అందుబాటులో ఉన్న గ్రామాల్లో ఈ ప్రక్రియను ల్యాండ్ సర్వే శాఖ అధికారులు చురుగ్గానే చేస్తున్నా, కొన్ని గ్రామాల్లో సేత్వారీలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. దీంతో కొన్ని చోట్ల ఖస్రా పహాణీలు, మరికొన్ని చోట్ల చెస్సలా పహాణీలు స్కానింగ్ చేస్తున్నారు. దాదాపు నాలుగు నెలల క్రితం ప్రారంభమయిన ఈ స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెపుతున్నారు. 6 వేల పైచిలుకు గ్రామాల్లోనే... రాష్ట్రంలో 10,878 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇందులో సేత్వారీ స్కాన్ ఇండెక్స్‌లు కేవలం 6,936 గ్రామాల్లోనే ఉన్నాయని ల్యాండ్ సర్వే అధికారులు చెబుతున్నారు. ఈ సేత్వారీలున్న గ్రామాల్లో 4,950 చోట్ల ఇండెక్స్ స్కానింగ్ పూర్తయింది. అంటే ఫలానా సర్వే నంబర్లో ఎంత భూమి ఉందనే వివరాలతో పాటు పహాణి, మ్యాపు, కొలతలు, రిజిస్ట్రేషన్లకు అవసరమైన ఈసీ రికార్డులను కూడా దీనిలో పొందుపరిచారు. ఏదైనా సర్వే నంబర్‌ను క్లిక్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఒకేచోట లభ్యమయ్యేలా వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. మరో 1,986 గ్రామాల్లో సేత్వారీల ఇండెక్స్ స్కానింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. సేత్వారీలు అందుబాటులో ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 3,942 గ్రామాల్లో సేత్వారీలు లేవు. దాదాపు 80 ఏళ్ల క్రితం ఇచ్చిన సేత్వారీలు చినిగిపోవడం, స్కానింగ్‌కు అనుకూలంగా లేకపోవడం, కొన్ని చోట్ల అసలు లేకపోవడంతో ఇప్పుడు ఖస్రా పహాణీల స్కానింగ్ చేస్తున్నారు. అవి కూడా లభ్యంకాని సర్వే నంబర్లకు చెస్సలా పహాణీలను స్కాన్ చేస్తున్నామని సర్వే, ల్యాండ్ సెటిల్మెంట్స్ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సేత్వారీలు అందు బాటులో లేని కారణంగా కొంత జాప్యం జరిగిందని ఈ ప్రక్రియను మరో నెలరోజుల్లో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రక్షాళనలో ఇదే కీలకం కాగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఈ సేత్వారీ స్కాన్ ఇండెక్స్ కీలకం కానుంది. సేత్వారీలు, పహాణీలను స్కాన్ చేసి, భూముల అన్ని వివరాలను ఒక్క క్లిక్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రక్షాళన ప్రక్రియను సులభతరం చేసే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఒక్కో సర్వే నంబర్‌ను ఈ స్కానింగ్‌లోనే పరిశీలించి, వివాదాలు ఏర్పడిన భూముల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి రికార్డులను తనిఖీ చేసే అవకాశం ఉంటుందని, సేత్వారీ, ఖస్రా, చెస్సలా పహాణీల స్కానింగ్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా భూ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలు కూడా జరగకుండా నియంత్రించవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన కంటే ముందే ఈ స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి పెడితే మంచి ఫలితాలు రావచ్చని అంచనా. సేత్వారీ... భూ భగవద్గీత రాష్ట్రంలో దాదాపు 36.42 లక్షల ప్రధాన సర్వే నంబర్లలో భూములున్నాయి.మళ్లీ ఈ సర్వే నంబర్లలో దాదాపు 1.90 కోట్ల బైనంబర్లు వచ్చాయి. నిజాం హయాంలో జరిగిన సర్వేలో ప్రధాన సర్వే నంబర్లన్నింటికీ సేత్వారీలు జారీ చేశారు. ఈ సేత్వారీలలో భూమికి సంబంధించిన అన్ని వివరాలూ ఉంటాయి. ఫలానా సర్వే నంబర్లోని భూమి ప్రభుత్వానిదా.. ఇనాం భూమా... పట్టా భూమా అనే అంశాల నుంచి.. ఆ సర్వే నంబర్లో మొత్తం ఎంత భూమి ఉంది.. అందులో సాగుకు యోగ్యం కానిది ఎంత అనే వివరాలుండే పత్రం ఇది. సాగు చేసే భూమికి సేత్వారీలోనే గ్రేడ్లు ఉంటాయి. గతంలో ఈ గ్రేడ్ల ఆధారంగానే ఆయా భూములకు ధరలు కూడా నిర్ణయించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే భూ రికార్డులకు సేత్వారీని భగవద్గీతగా పేర్కొంటారు. అప్పట్లో తయారుచేసిన సేత్వారీలు అన్ని గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో వాటి ఆధారంగా తయారు చేసిన పహాణీలను ఇప్పుడు స్కాన్ చేసి భద్రపరుస్తున్నారు. -
సరికొత్త వేకీ...
సాంకేతికం పొద్దుటే లేవాలని ఉంటుంది. కానీ లేవలేం. అనివార్యంగా అలారంను ఆశ్రయిస్తాం. నిర్ణయించిన టైమ్‌కే అలారం మోగుతుంది. కానీ, లేస్తామా? లేవం. మళ్లీ బద్దకంగా ముసుగుతన్ని పడుకుంటాం. లేచిన తరువాత...‘అయ్యో! లేవలేక పోయామే’ అని బాధ పడతాం. ఇప్పుడిక అలాంటి బాధ అక్కర్లేదు. మీరు నిర్ణయించినా టైమ్‌కు అలారం ‘ట్రింగ్... ట్రింగ్’ అని మోగదు. ‘మరి ఎలా?’ అని కంగారు పడొద్దు. అమెరికన్ డెవలపర్ హచిక్ అడ్జమియన్ ‘వేకీ’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించాడు. నిర్ణీత సమయాన్ని సెట్ చేసుకొని పడుకుంటే చాలు... మీరు లేవాల్సిన టైమ్‌లో వేకీ- కమ్మగా పాడుతుంది. జోకులు వినిపిస్తుంది. కవితలు, చిన్న చిన్న కథలు వినిపిస్తుంది. అపరిచితులు గొంతులు వినిపిస్తుంది. ‘ఎలా అయితే... నిద్ర నుంచి మెలకువ వస్తుంది?’ అనే అంశంపై పరిశోధనలు జరిపి మరీ ఈ యాప్‌ను రూపొందించారు. ‘‘పొద్దున తలుపు చప్పుడు కాగానే... వెళ్లి తలుపు తీసినప్పుడు ఎవరైనా కొత్త వారు కనిపిస్తే నిద్ర మత్తు ఎగిరిపోతుంది. మళ్లీ నిద్రకు ప్రయత్నించినా రాదు... ఇలాంటి విషయాల ఆధారంగానే యాప్‌ను రూపొందించాం’’ అంటున్నాడు హచిక్ అడ్జమియన్.