
అందరూ పనులు చేస్తారు, కొందరు అన్నీ అనుకున్న టైమ్‌కే జరగాలనుకుంటారు. అలా తమను మలచుకుంటారు. కొంతమంది ఇష్టమైనవి, అయిష్టమైనవి అన్న తేడా లేకుండా ఏ పనినైనా సరే తమకు మూడ్ ఉంటేనే చేస్తారు. పంక్చువాలిటీ, టైమ్ మేనేజ్‌మెంట్ అన్న పదాలను ఇష్టపడరు. ఇంతకీ మనం ఎలా ఉంటున్నాం?
1. మీ స్కూలు, కాలేజ్‌లకి టైమ్‌కి వెళ్లడానికంటే ఆలస్యంగా వెళ్లిన రోజులే ఎక్కువ.
ఎ. అవును బి. కాదు
2. ఎగ్జామ్‌కి వెళ్లే ముందు పెన్నులు, కంపాస్ బాక్స్ వంటి వాటిని వెతుక్కోవడం మీకు అలవాటు.
ఎ. అవును బి. కాదు
3. థియేటర్‌కు వెళ్లి చూసిన సినిమాల్లో దాదాపుగా అన్నీ కనీసం పది నిమిషాల ఆలస్యంగా వెళ్లిన సందర్భాలే ఎక్కువ.
ఎ. అవును బి. కాదు
4. లేట్‌గా వెళ్లినందుకు స్కూల్లో పనిష్‌మెంట్ తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఎ. అవును బి. కాదు
5. మీరు ఎలాంటి సందర్భంలోనైనా నింపాదిగానే ఉంటారని మీ ఫ్రెండ్స్ ఆటపట్టిస్తుంటారు.
ఎ. అవును బి. కాదు
6. ఉద్యోగంలో కాని ఇతర ఏ పనులనైనా చేయడం ముఖ్యం కాని ఫలానా టైమ్‌లోనే చేయాలన్న నిబంధనలను మీకు నచ్చవు.
ఎ. అవును బి. కాదు
7. అశ్రద్ధ, నిరాసక్తత, బద్దకం వల్ల పని నిర్ణీత సమయానికి పూర్తి కాని సందర్భం మీ కెరీర్‌లో ఒక్కటి కూడా లేదు.
ఎ. కాదు బి. అవును
8. టైమ్ మేనేజ్‌మెంట్ పాటించకపోతే పంక్చువాలిటీ లేని ఉద్యోగిగా ముద్ర పడుతుందని నమ్ముతారు.
ఎ. కాదు బి. అవును
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకంటే ఎక్కువగా వస్తే పంక్చువాలిటీ మీద అసలు పట్టింపు లేదనుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే మీకు కేటాయించిన బాధ్యతలను పూర్తి చేయడంలో ఆలస్యమైనప్పుడు అందుకు సహేతుకమైన కారణం ఉండి ఉంటుంది అని మీ పై అధికారి నమ్మడానికి అవకాశం ఉండదు. ‘బి’లు ఎక్కువైతే మీది క్రమబద్ధంగా పనిచేయాలన్న ధోరణి అనుకోవాలి. దీనిని కొనసాగించండి.
Comments
Please login to add a commentAdd a comment