time punctuality
-
పంక్చువాలిటీ పాటిస్తున్నారా?
అందరూ పనులు చేస్తారు, కొందరు అన్నీ అనుకున్న టైమ్‌కే జరగాలనుకుంటారు. అలా తమను మలచుకుంటారు. కొంతమంది ఇష్టమైనవి, అయిష్టమైనవి అన్న తేడా లేకుండా ఏ పనినైనా సరే తమకు మూడ్ ఉంటేనే చేస్తారు. పంక్చువాలిటీ, టైమ్ మేనేజ్మెంట్ అన్న పదాలను ఇష్టపడరు. ఇంతకీ మనం ఎలా ఉంటున్నాం? 1. మీ స్కూలు, కాలేజ్‌లకి టైమ్‌కి వెళ్లడానికంటే ఆలస్యంగా వెళ్లిన రోజులే ఎక్కువ. ఎ. అవును బి. కాదు 2. ఎగ్జామ్‌కి వెళ్లే ముందు పెన్నులు, కంపాస్ బాక్స్ వంటి వాటిని వెతుక్కోవడం మీకు అలవాటు. ఎ. అవును బి. కాదు 3. థియేటర్‌కు వెళ్లి చూసిన సినిమాల్లో దాదాపుగా అన్నీ కనీసం పది నిమిషాల ఆలస్యంగా వెళ్లిన సందర్భాలే ఎక్కువ. ఎ. అవును బి. కాదు 4. లేట్‌గా వెళ్లినందుకు స్కూల్లో పనిష్మెంట్ తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎ. అవును బి. కాదు 5. మీరు ఎలాంటి సందర్భంలోనైనా నింపాదిగానే ఉంటారని మీ ఫ్రెండ్స్ ఆటపట్టిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 6. ఉద్యోగంలో కాని ఇతర ఏ పనులనైనా చేయడం ముఖ్యం కాని ఫలానా టైమ్‌లోనే చేయాలన్న నిబంధనలను మీకు నచ్చవు. ఎ. అవును బి. కాదు 7. అశ్రద్ధ, నిరాసక్తత, బద్దకం వల్ల పని నిర్ణీత సమయానికి పూర్తి కాని సందర్భం మీ కెరీర్లో ఒక్కటి కూడా లేదు. ఎ. కాదు బి. అవును 8. టైమ్ మేనేజ్మెంట్ పాటించకపోతే పంక్చువాలిటీ లేని ఉద్యోగిగా ముద్ర పడుతుందని నమ్ముతారు. ఎ. కాదు బి. అవును మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకంటే ఎక్కువగా వస్తే పంక్చువాలిటీ మీద అసలు పట్టింపు లేదనుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే మీకు కేటాయించిన బాధ్యతలను పూర్తి చేయడంలో ఆలస్యమైనప్పుడు అందుకు సహేతుకమైన కారణం ఉండి ఉంటుంది అని మీ పై అధికారి నమ్మడానికి అవకాశం ఉండదు. ‘బి’లు ఎక్కువైతే మీది క్రమబద్ధంగా పనిచేయాలన్న ధోరణి అనుకోవాలి. దీనిని కొనసాగించండి. -
సమయపాలనలో స్విస్ ఫస్ట్
బెర్న్: గడియారాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశాల్లో , స్విట్జర్లాండ్ ఒకటన్న విషయం మనకు తెల్సిందే. సమయాన్ని కచ్చితంగా పాటించే దేశాల ప్రజల్లో కూడా స్విస్ ప్రజలు ముందున్నారు. అక్కడ ఎవరైనా మనల్ని 12 గంటలకు కలుస్తామంటూ టైమిచ్చినట్లయితే వారు కచ్చితంగా అదే సమయానికి వచ్చి కలుస్తారు. ఐదు నిమిషాల తర్వాతగానీ, ఐదు నిమిషాల ముందుగానీ వారు రారంటే వారు సమయపాలనకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకింత కచ్చితమైన సమయాన్ని పాలిస్తారని అక్కడ ఎవరినైనా ప్రశ్నిస్తే వారిచ్చే సమాధానం ఒక్కటే! ‘మేము మీ సమయానికి విలువనిస్తాం. మిమ్మల్ని గౌరవిస్తాం’ అని చెబుతారు. అక్కడి ప్రజలు సమయాన్ని కచ్చితంగా పాటించడానికి అక్కడి రవాణా వ్యవస్థ కూడా వారికి దోహదపడుతోంది. దీశీయ విమానాలు, రైళ్లు, బస్సులు, టాక్సీలు కూడా కచ్చితమైన సమయం ప్రకారం నడుస్తాయి. 87 శాతం రైళ్లు సమయానికి నడుస్తాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అంటే 13 శాతం రైళ్లు మాత్రమే ఆలస్యంగా నడుస్తాయట. అది కూడా ఎంతో ఆలస్యం కాదు. ఏడాదిలో సరాసరి 32 సెకండ్లు ఆలస్యంగా నడుస్తాయట. మాల్స్, దుకాణాలు కూడా కచ్చితమైన సమయాన్ని పాటిస్తాయి. రెండు గంటల్లో సరకును ఇంటికి చేరుస్తామని చెబుతే కచ్చితంగా ఆ సమయానికి పార్శల్ అందుతుంది. టాక్సీలు కూడా నిమిషం తేడా లేకుండా చెప్పిన సమయానికి వస్తాయి. సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి కేఫ్‌లు, హోటళ్లు జనంతో కిటకిటలాడుతుంటాయి. కారణం అదే సమయంలో పలు ఆఫీసులు సిబ్బందికి టీ బ్రేక్ ఇస్తారు. టీ సమయం ముగిసిన మరుక్షణం వాళ్లు తమ తమ ఆఫీసుల్లో ఉంటారు. వారికి సమయపాలనపై అంతటి స్ఫూర్తి ఎలా వచ్చిందో మాత్రం తెలియదు.