ఇల్లే బ్యూటీ క్లినిక్
బ్యూటిప్స్
►మెటిమలు, నల్లమచ్చలు పోవాలంటే... ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. పొడి చర్మం అయితే నిమ్మరసం బదులు కీరదోస రసం కలుపుకోవచ్చు.
►చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంటే... రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖానికి రాయాలి. కోడిగుడ్డులోని పచ్చసొనను కూడా రాయవచ్చు. ఎగ్ ప్యాక్ ఆరిన తరవాత గోరువెచ్చటి నీటితో కడిగి ముఖానికి పన్నీరు అద్దాలి.
► మోచేతులు, మెడ, బాహుమూలల్లో నలుపు వదలాలంటే నిమ్మరసం లేదా కీరదోస రసం రాయాలి. కీరదోస ముక్కతో మసాజ్ చేసినట్లు రుద్దినా ఫలితం ఉంటుంది. సున్నితమైన చర్మానికి నిమ్మరసం రాస్తే మంటపుడుతుంది. కాబట్టి ముందుగా కొద్దిగా రాసి పరీక్షించుకోవాలి. నిమ్మరసం పడకపోతే కీరదోస వాడడమే మంచిది.
►వాతావరణంలో కాలుష్యం చర్మం మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి బయటకు వెళ్లి వచ్చిన వెంటనే సబ్బుతో ముఖం కడుక్కుని తుడిచిన తర్వాత పన్నీటిని అద్దాలి. దూదిని పన్నీటిలో ముంచి అద్దితే, పన్నీరు ముఖమంతా సమంగా పడుతుంది.