రోమాలు లేని మృదువైన చర్మం కోసం మగువలు ఎంతగానో తాపత్రయపడుతుంటారు. అందుకే నెలకోసారి ఐబ్రోస్ (కనుబొమ్మలు), అప్పర్ లిప్ (పై పెదవి), ఫోర్ హెడ్ (నుదురు), ఆర్మ్స్ అండ్ లెగ్స్ (కాళ్లు చేతులు) ఇలా బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లి మరీ.. ఏదొకటి చేయించుకుంటూ ఉంటారు. త్రెడ్డింగ్ (దారంతో వెంట్రుకలను తొలగించడం), వ్యాక్సింగ్ (మైనం మిశ్రమాన్ని వెంట్రుకలున్న చర్మానికి రాసి లాగడం) ఇలా నచ్చిన పద్ధతిలో తమ అందాన్ని మెరుగులు పరచుకుంటూ ఉంటారు. కొందరు ఫేస్‌కి త్రెడ్డింగ్ చేయించుకుంటే..మరికొందరు టోటల్ బాడీ వ్యాక్సింగ్ చేయించుకుంటారు.
అలాంటి వారికోసమే ఈ మినీ హెయిర్ రిమూవర్. దీనికి ఫుల్ చార్జింగ్ పెట్టుకుంటే చాలు. దీన్ని పెన్ ఓపెన్ చేసుకున్నట్లుగా ఓపెన్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. వెంట్రుకలు ఉన్న చోట గుండ్రంగా తిప్పుతూ ఉంటే వెంట్రుకలన్నీ లోతుకు తెగిపోతాయి. కనుబొమలను ముందుగా పెన్సిల్‌తో షేప్ హైలెట్ చేసుకుని, ఈ రిమూవర్‌తో జాగ్రత్తగా కనుబొమలను షేప్ చేసుకోవచ్చు. ఇక దీనితో అండర్ ఆర్మ్స్ తో సహా... అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ రిమూవర్‌కి అతి సూక్ష్మమైన ఒక బ్లేడ్ అటాచ్ అయి ఉంటుంది. ఇది చర్మానికి ఎలాంటి హానీ చేయకుండా వెంట్రుకలను సుతారంగా కట్ చేస్తుంది. దీన్ని లిప్‌స్టిక్ లాగా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని వెళ్లిపోవచ్చు. త్రెడ్డింగ్ లేదా వ్యాక్సింగ్ చేయిస్తే ఎలాంటి గ్రోయింగ్ ఉంటుందో.. ఈ రిమూవర్‌ని ఉపయోగించినప్పుడు కూడా అదే గ్రోయింగ్ ఉంటుంది. సో.. ఇది ఎలాంటి ఇబ్బందులకు కారణం కాదు.
ఇదే మోడల్‌లో బ్యాటరీతో నడిచే రిమూవర్స్ కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఎక్కడైతే వెంట్రుకలు తొలగించాలో అక్కడ దీన్ని ఆన్ చేస్తే ఒక చిన్న లైట్(వెలుగు) వస్తుంది. (రిమూవర్‌కి మధ్యలో ఒక చిన్న లైట్ అమర్చి ఉంటుంది) దాంతో వెంట్రుకలు ఉన్న చోట మనకి చక్కగా కనిపిస్తుంది. వెంటనే ఈ రిమూవర్‌తో రబ్ చేసుకుంటే సరిపోతుంది. దీని ధర సుమారు 28 డాలర్ల(రూ. 2,000) వరకూ అమ్ముడుపోతున్నాయి. అయితే కొన్ని మరింత చౌక ధరల్లో కూడా లభిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఈ రిమూవర్ చక్కగా ఉపయోగపడుతుంది కదూ!
Comments
Please login to add a commentAdd a comment