ఈ వారం యూట్యూబ్ హిట్స్ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, Sep 4 2016 11:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్ - Sakshi

ఈ వారం యూట్యూబ్ హిట్స్

మైఖేల్ ఫెల్ప్స్: యాంగ్రీ ఫేస్
నిడివి : 3 ని. 57 సె. : హిట్స్ : 26,17,314


వయసు 31 ఏళ్లు. అమెరికన్ స్విమ్మర్. పేరు మైఖేల్ ఫెల్ప్స్. ఈ మధ్యే రియో ఒలింపిక్స్ పతకాల కొలనులో ఈది వెళ్లాడు. ఐదు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ పట్టుకెళ్లాడు. అందుకే అతడి ఫేస్‌కంటే ముందు  అతడి పేరు, అతడు సాధించిన పతకాలు గుర్తొస్తాయి. కానీ ఒలింపిక్స్‌లో ఒక ఈవెంట్ మధ్యతో అతడు ఇచ్చిన యాంగ్రీ ఎక్స్‌ప్రెషన్ అతడి పేరును, అతడి పతకాలను పక్కకు నెట్టేసి, నెట్‌లో ఈత కొట్టేస్తోంది. ‘టు నైట్ షో’ టీవీహోస్ట్ జిమ్మీ ఫాలెన్ కూడా ఫెల్ప్స్‌ను తన స్టూడియోకి పిలిపించుకుని, అతడిని ఇంటర్వ్యూ చేసి, అతడి ప్రీ-రేస్ బ్యాక్‌స్లాపింగ్‌ని ఇమిటేట్ చేసి, నవ్వించి, కవ్వించి, నవ్వుల కన్నీళ్లు పెట్టించి...  ఆ ఫేమస్ యాంగ్రీ ఒలింపిక్ ఫేస్ లైఫ్‌సైజ్ కటౌట్‌ను షోలో ప్రదర్శించి... ఆ అపురూపమైన క్షణాలను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయించారు. ఫొటోలో ఫెల్ప్స్, ఫాలెన్ మధ్య ఉన్నది ఆ యాంగ్రీ కటౌటే! ‘నువ్వు బెస్ట్ అనిపించుకోవాలంటే... ఎవరూ చేయలేని పని చెయ్యాలి’ అన్నది ఫెల్ప్స్ ఫేమస్ కొటేషన్. కోపం ఆపుకోవడం ఎవరూ చేయలేని పని. ఆఖరికి ఫెల్ప్స్ కూడానా?!

జె బల్విన్ : సఫారీ ఫీట్
నిడివి : 3 ని. 24 సె. : హిట్స్ : 53,20,120

తెలుగు సినిమాల్లో నైట్ క్లబ్ సీక్వెన్స్‌లోని లేడీ డాన్ ఫైట్స్‌ని ఇష్టపడేవారిని ఈ సఫారీ ఫీట్ షేక్ చేస్తుంది. చువ్వలాంటి అమెరికన్ ర్యాపర్ బియాంకా లాండ్రా, డీజే స్కై, సింగర్ ఫారెల్ విలియమ్స్.. ఈ ముగ్గురినీ కలిపి కొలంబియన్ ర్యాపర్ జె బల్విన్ అల్లిన ఉల్లాస దృశ్యగీతిక... ఈ సఫారీ ఫీట్. ‘షి లైక్స్ ఇట్. ఐ లైక్ ఇట్.. అంటూ మొదలై... ‘మమ్మీ మమ్మీ విత్ యువర్ బాడీ ఐ లైక్ ఇట్, హే డాడీ గో విత్ మై ఫ్రెండ్స్ ఫర్ ద పార్టీ’ అంటూ సఫారీ ఫీట్ సాగుతుంది. మన సును పులకింపజేసే నృత్యాలను, ఒళ్లు జలదరించే ఫైట్స్‌ను చూస్తూ, డిమ్ లైట్స్‌లో డిన్నర్ తీసుకోదలచినవారు ఈ పాటను పెద్ద స్క్రీన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
 
మీర్జా: టైటిల్ సాంగ్
నిడివి : 3 ని. 16 సె. : హిట్స్ : 23,15,986

 రెండు రోజుల క్రితమే విడుదలైన బాలీవుడ్ యాక్షన్ రొమాంటిక్ మూవీ ‘మీర్జా’ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డెరైక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హర్షవర్థన్ కపూర్, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఓంపురి, ఆర్ట్ మాలిక్, కె.కె.రైనా, అంజలీ పాటిల్, అనూజ్ చౌదరి తదితరులు ఇతర కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ‘మీర్జా’ ట్రైలర్ జూన్‌లోనే విడుదలైంది. తాజాగా ఇప్పుడు టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. పంజాబీ జానపదగాథ ‘మీర్జా సాహిబా’ ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. రంగ్‌దే బసంతి, ఢిల్లీ 6, భాగ్ మిల్కా భాగ్ చిత్రాలను నిర్మించిన దర్శకుడే కాబట్టి ఈ చిత్రాన్నీ ఓ చక్కటి శిల్పంలా చెక్కుతున్నారు. ఆ పనితనాన్ని శాంిపిల్‌గా ఈ వీడియోలో చూడొచ్చు.
 


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement