జీ తెలుగులో 29 నుంచి... ‘చోటా ఛాంపియన్’ | Zeetelugu from 29 ... 'Chhota Champion' | Sakshi
Sakshi News home page

జీ తెలుగులో 29 నుంచి... ‘చోటా ఛాంపియన్’

Published Thu, Dec 26 2013 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

Zeetelugu from 29 ... 'Chhota Champion'

ఐదేళ్లలోపు చిన్నారులు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. అలాంటిది ఈ చిన్నారులు తమ అమ్మానాన్నల్ని ఆటాడిస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది! ఈ ఆలోచనకు కార్యరూపమే జీ తెలుగు ‘చోటా ఛాంపియన్’. ఈ కార్యక్రమంలోని ప్రతి ఎపిసోడ్‌లోనూ నలుగురు చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొంటారు. ఒక సెట్‌లో తల్లిగానీ, తండ్రి గానీ ఉంటే, మరో సెట్‌లో చిన్నారితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు ఉంటారు.

మొదటి రౌండ్ విజేత ముందు ఐదు కుండలు ఆకర్షణీయమైన బొమ్మలతో బోర్లించి ఉంటాయి. విజేత రెండుఅవకాశాలను వినియోగించుకుని కుండలను పగలగొట్టాలి. పగలగొట్టిన కుండకింద  డబ్బు ఎంత ఉందో సూచిస్తూ ఒక సంఖ్య ఉంటుంది. అంత డబ్బూ చిన్నారిదే.

ఆ డబ్బు చిన్నారి చదువుకు వినియోగించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ‘చోటా ఛాంపియన్’ డిసెంబర్ 29న ప్రారంభం కానుంది. ప్రతి ఆదివారం రాత్రి 8.30కు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందని జీ తెలుగు ప్రతినిధి వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement