
3ఎమ్ ఫెస్టివల్
మాటలకందని భావాలను పలికించే హావభావాలు.. మనసులో ఆశ్చర్యాతిరేకాలను కలిగించే మాయాజాలం.. సెలబ్రిటీల గొంతుకలను వీనులకు విందుగా పంచే అనుకరణ.. మైమ్, మ్యాజిక్, మిమిక్రీ.. ఈ మూడు ఒకే వేదికపై అలరించనున్నాయి.
గజిబిజి లైఫ్‌స్టయిల్‌తో మూడీగా ఉంటున్న సిటీవాసులకు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు త్రీఎమ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. మంగళ, బుధవారాల్లో ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయి.
వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి.