ఫిల్మ్ విత్ కాజ్
బుల్లి సినిమాలు అందరూ తీసేస్తున్నారు. బుర్రలో చిన్న కథ, చేతిలో ఓ కెమెరా ఉంటే షార్ట్ ఫిలిం తీసేందుకు రెడీ అంటున్నారు. రోజుకు వందకు పైగా చిన్న సినిమాలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతున్నా.. అందులో గుర్తింపు, ఆదరణ పొందే చిత్రాలు చాలా తక్కువ. దీనికి కారణాలు అనేకం.
అయితే చిన్ని చిత్రాల విజయాలకు మాత్రం విజయ మంత్రం మంచి కథ, తగిన మార్కెటింగ్ స్ట్రాటజీ అని అంటున్నాడు బిజయ్ దాస్. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తాను తీసిన చిత్రాలే అంటారీ యంగ్ ఫిలిమ్‌మేకర్. సీవోఎఫ్‌ఎఫ్‌ఐ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ముంబై 2012లో గోల్డ్ అవార్డ్, జమ్మురా షార్ట్ ఫిలిం ఫెస్టివల్-2014లో వ్యూయర్స్ చాయిస్ అవార్డ్‌లతో పాటు ఆరు అంతర్జాతీయ అవార్డుల నామినేషన్స్ దక్కించుకున్న బిజయ్‌దాస్ బుల్లి చిత్రాల గురించి, తాను తీసిన చిత్రాల గురించి చెప్పిన విశేషాలివీ...
మాది ఒడిశా. కానీ 12 ఏళ్లుగా హైదరాబాదులోనే ఉంటున్నా. చిన్నప్పడు బొమ్మలు వేసేవాడిని. జాతీయ అవార్డు కూడా వచ్చింది. చదువయ్యాక యానిమేషన్ నేర్చుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్, ముంబైలో ఉద్యోగాలు చేశా. అల్లాదీన్, వీర్ లాంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు అనేక చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ పనులు చేశా. కానీ ఏదో అసంతృప్తి. సొంతంగా ఏదో చెయ్యాలనే తపన. దాంతో కొన్నాళ్లకు ఉద్యోగం మానేసి, నేను రాసుకున్న షార్ట్ ఫిలిమ్ కథతో చాలా చోట్ల తిరిగాను. చివరకు ఓ సంస్థవారు ఆగస్టు 15 సందర్భంగా జాతీయ సమైక్యత గురించి ఏదైనా కాన్సెప్ట్ ఉంటే చెప్పమన్నారు. ఆ కాన్సెప్ట్‌తో స్టోరీ లైన్ తయారు చేసి చెప్పాను. బడ్జెట్ పది లక్షలు. వాళ్లు రూ.2 లక్షలే ఇస్తావున్నారు. నిరాశతో బెంగళూరుకు వెళ్లా. ఉద్యోగం మానేశా. నా బెటర్ హాఫ్‌తో కలిసి అదే ఐడియాను పూర్తిగా పేపరు మీద పెట్టా.
మా ఫ్రెండ్ ఫాదర్ ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకున్నారు. అదే ‘జనగణమన’ చిత్రం. ఏమీ తెలియుకుండానే ఈ సినిమా మొదలుపెట్టాం. ఆ తర్వాత పోస్ట్‌ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి, చిత్రాన్ని టెలికాస్ట్ చేయమని హైదరాబాద్‌లో ప్రతి చానల్ చుట్టూ తిరిగా. ఇక్కడి వాళ్లు అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఒక బాలీవుడ్ ఫిలిమ్ ఫెస్టివల్ పోటీలో నా ఫిలిమ్‌కి అవార్డు వచ్చింది. అంతే నా అదృష్టం మారింది. అప్పుడు 80 వేలతో తీసిన చిత్రాన్ని 3 లక్షలకు అమ్మేంత పేరు వచ్చింది. మరో అవార్డు ద్వారా లక్ష రూపాయల నగదు అవార్డు కూడా లభించింది. 15 చానల్స్ ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేశాయి. హిందీలో తీసిన ఈ చిత్రం తెలుగు, ఒరియా భాషల్లో డబ్ అయ్యింది. తరువాత నేను రాసుకున్న మొదటి సినిమా స్క్రిప్ట్ తెరపైకి తీసుకురావాలని నిశ్చయించుకున్నా. ఆ సినిమానే ‘ది హ్యుమేన్’. ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కేవలం మ్యూజిక్‌తో సాగుతుంది. ఈ చిత్రాన్ని ఈసారి బాలల దినోత్సవం రోజు విడుదల చేయాలని అనుకుంటున్నాం.
చక్కటి బిజినెస్ కూడా...
రూ.3 లక్షలతో తీసిన ది హ్యుమేన్ సినిమాకు మై హోమ్, మహాసిమెంట్ వారు బ్రాండింగ్ ఇచ్చారు. జనగణమన చిత్రానికి అభిబస్ వారి ప్రోత్సాహం లభించింది. ఈ రెండు చిత్రాలు సోషల్ కాజ్‌తో ముడిపడి ఉండటంతో కార్పొరేట్ కంపెనీలు సీఎస్‌ఆర్ యాక్టివిటీ ద్వారా వీటికి బ్రాండింగ్, ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. కేవలం యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా ఇలాంటి చక్కటి ప్లానింగ్‌తో తీస్తే సినిమా ద్వారా మంచి లాభాలు కూడా పొందవచ్చు. ఫీచర్ ఫిలిం తియ్యాలన్నదే నా లక్ష్యం. నాపై నాకున్న నమ్మకంతోనే హిందీ చిత్రానికి కథ సిద్ధం చేసుకుంటున్నా.
ఓ మధు
కథ, దర్శకత్వం: ఉత్తేజ్
కథ: ఇందులో హీరో ఆరునెలలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. సిగ్గు వల్ల ఆ విషయూన్ని ఆ అమ్మాయికి చెప్పలేకపోతాడు. ఒకరోజు తన ఫ్రెండ్‌తో కలసి ఆ అమ్మాయి రోజూ వాకింగ్ చేసే ప్రదేశానికి వెళతారు. రోడ్డంతా ఖాళీగా ఉంటుంది. కాసేపయ్యూక ఆ అమ్మాయి వస్తుంది. హీరో ఆమె దగ్గరగా వెళ్లి నిలుచుంటాడు. ఆమెను చూసి చిరునవ్వు చిందిస్తాడు. అతడి వాలకాన్ని గవునించి, పక్కనే ఉన్న ఫ్రెండ్ కోపగించుకుని వెళ్లిపోతాడు. ఆ అమ్మాయి కూడా చిరునవ్వు నవ్వి వనంగా వుుందుకు సాగిపోతుంది. అప్పుడు హీరో ఆమెకు తన ప్రేవును వ్యక్తం చేస్తాడు. ఆమె వెనుదిరిగి తన పేరు శిరీష అని చెబుతుంది.
కథ, దర్శకత్వం: సీహెచ్.రవుణారెడ్డి
కథ: భయుం.. చాలావుందికి ఇదే పెద్ద అవరోధం.. భయుం కారణంగానే గవ్యూన్ని చేరుకోవడంలో విఫలవువుతుంటారు. ఇందులో ప్రధాన పాత్రధారి ఒక యుువకుడు. చిన్నప్పటి నుంచి తన భయూలను అధిగమించేందుకు ప్రయుత్నిస్తుంటాడు. సీనియుర్లంటే భయుం.. కొత్తవాళ్లను కలుసుకోవాలంటే భయుం.. హారర్ సినివూలు చూడాలంటే భయుం.. ఒక దశలో తన భయుమే సవుస్యలన్నింటికీ కారణవుని తెలుసుకుంటాడు. భయూన్ని అధిగమించే ప్రయుత్నంలో చివరకు అతడు ఎలా సఫలీకృతుడవుతాడనేదే ఇందులోని కథ. దర్శకుడు రవుణారెడ్డి బృందానికి ఇదే మొదటి లఘుచిత్రం అరుునా, దీనిని ఆకట్టుకునే రీతిలో రూపొందించడం విశేషం.
ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు.
వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకుపరిచయుం చేస్తాం.