బ్రిటన్లో నెలకు నాలుగుసార్లే..! | Average Briton has sex just four times a month: Survey | Sakshi
Sakshi News home page

బ్రిటన్లో నెలకు నాలుగుసార్లే..!

Published Mon, Sep 29 2014 2:46 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

బ్రిటన్లో నెలకు నాలుగుసార్లే..! - Sakshi

బ్రిటన్లో నెలకు నాలుగుసార్లే..!

రోజురోజుకూ జీవితం మీద విరక్తి పుడుతోంది. అసలు ఏమీ చేయబుద్ధి వేయట్లేదు.. అందుకే శృంగారం కూడా నెలకు నాలుగుసార్లు మాత్రమే చేస్తున్నారట బ్రిటిషర్లు. ఈ విషయం ఓ సర్వేలో తేలింది. నెలలో 30 సార్లు శృంగారం చేసేవాళ్లు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్నారట. ద అబ్జర్వర్ అనే పత్రిక ఈ సర్వే చేసింది. అయితే.. ఎన్ని సార్లయినా సరే తాము మాత్రం తమ శృంగార జీవితంతో సంతోషంగానే ఉన్నామని 63 శాతం మంది చెబుతున్నారు. ఇది కూడా ఇంతకుముందు చేసిన సర్వేతో పోలిస్తే తగ్గింది. అప్పుడు 76 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంటర్నెట్లో పరిచయం అయినవారితో తాము శృంగారంలో పాల్గొన్నట్లు ప్రతి ఏడుగురిలో ఒకరు చెప్పారు. ఇక తాము వేశ్యల వద్దకు వెళ్లినట్లు 22 శాతం మంది అన్నారు. 2008లో కంటే ఇది నాలుగు శాతం ఎక్కువ. ఆన్లైన్లో 76శాతం మంది పురుషులు పోర్నోగ్రఫీ గురించి చదవితే, 53 శాతం మంది మహిళలు ఎరోటికా గురించి చదివారు. తమకు 16 ఏళ్లు వచ్చేలోపే కన్యత్వాన్ని కోల్పోయామని ప్రతి ఐదుగురు యువతుల్లో ఒకరు చెప్పారు. సగటున ప్రతి బ్రిటిష్ వ్యక్తికి పదిమంది శృంగార భాగస్వాములు ఉన్నారని కూడాసర్వేలో తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement