బంపర్ డీల్! | Bumper deal | Sakshi
Sakshi News home page

బంపర్ డీల్!

Published Sun, Mar 8 2015 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

బంపర్ డీల్!

బంపర్ డీల్!

రీసెంట్ పాస్ట్‌లో చెప్పుకోతగ్గ హిట్స్ లేకపోయినా గిరాకీ మాత్రం తగ్గలేదు బాలీవుడ్ బేబ్ ప్రియాంక చోప్రాకు. ఈ మల్టీ టాలెంటెడ్ సుందరి ఇటీవలే ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఓ హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్‌తో అక్షరాలా పదిహేను కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుందట! భారత్‌లోనే కాదు... అమెరికాలో కూడా ప్రియాంకానే ఈ బ్రాండ్‌కు ప్రమోటర్. త్వరలోనే అమ్మడు సదరు యాడ్ షూటింగ్‌లో పాల్గొనబోతుందనేది ఓ వెబ్‌సైట్ కథనం.

 ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఈ యాడ్స్ ప్రసారమవుతాయట. విశేషమేమంటే...ఈ షూటింగ్ రెండు నెలలపాటు కొనసాగుతుందట! సూపర్‌డూపర్ సినిమాలు లేకపోయినా... ఈ సోగ కళ్ల సుందరి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మొత్తానికి రాబోయే యాడ్‌లో ప్రియ సరికొత్త లుక్స్‌తో అలరించనుందనేది సినీజనం టాక్! లెట్స్ వెయిట్ అండ్ సీ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement