అదిరే.. అదిరే..
ఫ్యాషన్ ప్రపంచంలో పరుగులు పెడుతున్న సిటీలో.. రోజుకో కొత్త థీమ్‌తో ఎక్స్‌పోలు జరుగుతున్నాయి. సత్యసాయినిగమాగమం వేదికగా ఏర్పాటైన డాజ్లింగ్ ఎక్స్‌పో అందర్నీ కట్టిపడేస్తోంది. ఈ ఎక్స్‌పోను నటి దీక్షా నగార్కర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షా మాట్లాడుతూ.. ఫ్యాషన్ వెరైటీలను అనుసరించడానికి ఇలాంటి ఎక్స్‌పోలు చాలా ఉపయోగపడతాయన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్‌లో ప్రముఖ డిజైనర్లు, చేనేత కార్మికులు రూపొందించిన పండుగ కలెక్షన్లు, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, సూట్స్, హోమ్ ఫర్నీచర్, కిడ్స్ స్టఫ్, ఇమిటేషన్ జ్యువెలరీ ఇలాంటివెన్నో ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తరలివచ్చిన డిజైనర్లకు చెందిన 74 స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయి.
- సాక్షి సిటీప్లస్