satya sai nigamagamam
-
దశాబ్ది ఉత్సవాలు: తెలుగు సినిమా, సీరియల్స్ డబ్బింగ్ కళాకారుల సందడి!
హైదరాబాద్: శ్రీ నగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా, సీరియల్స్‌కి సంబంధించిన డబ్బింగ్ కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. DAATT అధ్యక్షుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు మాట్లాడుతూ ఇన్ని గళాలతో కలిసి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, రోజంతా బిజీగా గడిపే మా జీవితాలకు అన్ని పండగలు కలిసి ఓకే రోజు చేసుకున్నట్టుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సీనియర్ నటి రోజా రమణి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వినోద్ బాల, కాదంబరి కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ బంటి , DAATT కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ వర్మ, టీవీ విఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ ఆవిష్కరణ -
సత్యసాయి నిగమంలో ఉగాది ఉత్సవాలు
-
అదిరే.. అదిరే..
ఫ్యాషన్ ప్రపంచంలో పరుగులు పెడుతున్న సిటీలో.. రోజుకో కొత్త థీమ్‌తో ఎక్స్‌పోలు జరుగుతున్నాయి. సత్యసాయినిగమాగమం వేదికగా ఏర్పాటైన డాజ్లింగ్ ఎక్స్పో అందర్నీ కట్టిపడేస్తోంది. ఈ ఎక్స్పోను నటి దీక్షా నగార్కర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షా మాట్లాడుతూ.. ఫ్యాషన్ వెరైటీలను అనుసరించడానికి ఇలాంటి ఎక్స్‌పోలు చాలా ఉపయోగపడతాయన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్లో ప్రముఖ డిజైనర్లు, చేనేత కార్మికులు రూపొందించిన పండుగ కలెక్షన్లు, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, సూట్స్, హోమ్ ఫర్నీచర్, కిడ్స్ స్టఫ్, ఇమిటేషన్ జ్యువెలరీ ఇలాంటివెన్నో ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తరలివచ్చిన డిజైనర్లకు చెందిన 74 స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయి. - సాక్షి సిటీప్లస్