Fashion world
-
టాప్ టెన్‌లో రష్మిక మందన్న బ్రాండ్
నార్త్, సౌత్‌లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన.. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్‌కి ప్రమోటర్‌గా మారిన విషయం తెలిసిందే. జపనీస్ ఐకానిక్ ఫ్యాషన్ బ్రాండ్ ఓనిట్సుకా టైగర్‌కి ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె కొనసాగుతుంది. రశ్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ 'ఒనిట్సుకా టైగర్' మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో టాప్ 10 బ్రాండ్స్‌లలో ఒకటిగా నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ తాజాగా ఈ లిస్టును తయారు చేసింది. ఫ్యాషన్ బ్రాండ్ విలువను డాలర్స్ తో చూసినప్పుడు రశ్మిక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఒనిట్సుక టైగర్ బ్రాండ్ టాప్ 10లో 9వ స్థానంలో నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ప్రకారం ఒనిట్సుక టైగర్ ఫ్యాషన్ బ్రాండ్ 75 లక్షల డాలర్ల వర్త్ కలిగి ఉంది. గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో రశ్మిక మందన్న ర్యాంప్‌పై నడిచింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొని ఒనిట్సుక టైగర్ బ్రాండ్‌ను రశ్మిక ప్రమోట్ చేసింది. పుష్ప , యానిమల్ మూవీస్‌తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకుంది రశ్మిక మందన్న. ఈ క్రమంలోనే ఆమెకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్ దక్కుతున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్‌తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది రశ్మిక మందన్న. ఐకానిక్ జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుకా టైగర్ ఎప్పటికప్పుడు నూతన వెరైటీలు, కొత్త డిజైన్స్‌తో అటు ఫ్యాషన్, ఇటు క్రీడలను మిళితం చేస్తున్నాయని..ఇలాంటి బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించడం గొప్ప ఎక్స్పీయరెన్స్ అని రష్మిక మందన్న తెగ సంబరపడిపోయింది. -
Sita Vasuniya: చేనేత సీతమ్మ
ఫ్యాషన్ ప్రపంచం ప్యారిస్ అంటారు కానీ, ఫ్యాషన్‌కి ఇప్పుడు ఇటలీ కూడా. ‘వోగ్’ మాస పత్రిక పేరు వినే ఉంటారు. ఆ అమెరికన్ పత్రికకు ఇటలీలో ఒక ఎడిషన్ ఉంది. ‘వోగ్ ఇటాలియా’. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ రెండూ ఉంటాయి అందులో. ఒక్క ఇటలీవే కాదు. ఫ్యాషనబుల్‌గా ఉన్న ఏ దేశంలోని మహిళ అయినా, ఆఖరికి ఆమె ఆదిమవాసీ మహిళ అయినా.. ఆమె ధారణలో అత్యాధునికత కనిపిస్తూ ఉంటే ఆమె అందులో ప్రత్యక్షం అవుతుంది! వోగ్ ఇటాలియా తాజా సంచికలో సీతా వసూనియా కనిపించింది కూడా అందుకే. ఆమె ధరించిన చీర ఆమె నేసిందే. పైకి సాదాసీదాగా ఉన్న ఆ చీర ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త షో కేస్ డిజైన్ అయింది! సీత మధ్యప్రదేశ్‌లోని ఓ గిరిజన గూడెం యువతి. తను, తన చేనేత, స్వయం సహాయ బృందంలోని తన తోటివారు... ఇదే ఆమె ప్రపంచం. ఆ ప్రపంచంలో జీవనం, జీవితం తప్ప ఫ్యాషన్ అనే మాట ఉండదు. జీవనం అంటే బతుకు తెరువు. జీవితం అంటే లైఫ్ స్టైల్. అంటే.. కష్టపడం, ఇంటికి చేదోడు అవడం. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని వీలాంచల్ ప్రాంతంలోని ఆదివాసీ మహిళలు ఎలా ఉంటారో సీత కూడా వేరే మాట లేకుండా అలాగే ఉంటుంది కానీ.. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో ఆమె ఒక విశేషం అయింది. ఆ ప్రాంతంలోనే కాదు. ఇండియాలో, ఇటలీలో, అమెరికాలో.. ఇంకా అనేక ఆధునిక దేశాలలో ఆమె ధరించిన చీర ఫ్యాషన్‌కు సరికొత్త ప్రతీక అయింది. తను కట్టుకోడానికి నేసుకున్న చీర తనకొక గుర్తింపును కట్టబెట్టింది! ఇంతలా గుర్తింపు రావడానికి కారణం.. ఆమె జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యమూ లేని ఒకానొక రోజు. ఆ రోజు జరిగిన ఒక ఘటనే.. రెండేళ్ల కొడుకున్న ఈ యువ మాతృమూర్తిని ‘ఎంపవరింగ్ సెలబ్రిటీ’గా మార్చేశాయి. వోగ్ ఇటాలియా పత్రికలో వచ్చిన ఫొటోలో ఆమె మహేశ్వరం చేనేత అద్దకం చీర ధరించి ఉన్నారు. ఆ ఫొటోను తీసింది ఢిల్లీలో పేరున్న ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. ధార్ జిల్లాలోని పర్యాటక స్థలం ‘మండు’లో ఆ ఫొటోగ్రాఫర్ కెమెరా పట్టుకుని తిరుగుతున్నప్పుడు అదే చోట స్వయం సహాయ బృందంలో సీత కనిపించింది. కనిపించడం కాదు. సీత ఉండేదే అక్కడ. ధార్ జిల్లాలోని పనల గ్రామ్ సీతది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ మిషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రారంభించిన ‘ఏక్ జిల్లా ఏక్ ఉత్పాద్’ పథకంలో భాగంగా పదిమందిలో ఒకరిగా సీత ఆ రోజు ‘మండు’లో ఉంది. ఆ అదివాసీ యువతి చీరకట్టులోని అత్యాధునికతను ఆమె అనుమతితో తన కెమెరాలోకి షూట్ చేసుకున్నారు ఆ ఫొటోగ్రాఫర్. మండులోని రాణి రూపమతి మహల్ మ్యూజియం ఫొటో షూట్ జరిగింది. అది ఫిబ్రవరి నెల. ఆ వెంటనే మార్చి సంచికలో సీత ఫొటో వచ్చింది! ‘‘మండు కు మేమంతా శిక్షణ కోసం వచ్చాం. అప్పుడే ఆ ఫొటోగ్రాఫర్ నా ఫొటో తీసుకున్నారు. కానీ ఇలా నా ఫొటో ప్రపంచంలో అందరూ చూసే పుస్తకంలో వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మా ఊళ్లోకొచ్చే వార్తా పత్రికల్లోని గ్రూప్ ఫొటోల్లో కూడా నేను ఏ రోజూ రాలేదు’’ అని సంభ్రమంగా అంటోంది సీత. మండులో వారికి లభించిన శిక్షణ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్ట్, బాగ్ ప్రింట్, ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ధారానేత.. మొదలైన వాటి మీద. వాటిని ధ్యాసగా నేర్చుకుంటున్న సీతలో ఆ రోజు ఆమె కట్టుకున్న చీర ఫొటోగ్రాఫర్‌కి నచ్చింది. చివరికి సీతకు పేరు తెచ్చింది. సీత ఒక్కరే కాదు. ఇక ముందు ప్రాంతంలోని చేనేతలన్నిటికీ ప్రాచుర్యం తేచ్చే ప్రయత్నాలు మొదలు పెడతాం. ఇందుకు ప్రేరణ మాత్రం మాకు ‘వోగ్ ఇటాలియా’ లో వచ్చిన సీత ఫొటోనే’’ అంటున్నారు ధార్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సలోనీ సిదానా. -
చబ్బీ చార్మ్
చిక్కిన అందానికి ఏ డ్రెస్ వేసినా చక్కగానే ఉంటుంది. కాని కాస్త బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలకే డ్రెస్సింగ్ కేర్ తప్పని సరి. దాచాలంటే దాగని శరీరాకృతిని కాస్ట్యూమ్స్‌తో కవర్ చేసుకోవాలనుకుంటారు. అందుకే అన్ని కోణాల్లో ఆలోచించి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు. మనసుకు నచ్చిన డిజైన్ కనిపించిన మన కు నప్పదని కాదనుకుంటారు. ఇలాంటి వారి కోసం ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త డిజైన్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత లైఫ్‌స్టైల్.. అమ్మాయిలను వద్దన్నా బొద్దుగా మార్చేస్తోంది. దీంతో పెళ్లికో.. పేరంటానికో.. వెళ్లాలంటే ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియక గజగామినిలు తికమకపడుతున్నారు. బొద్దుగా కాకుండా.. ముద్దుగా చూపించే ఆహార్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి అతివల కోసమే ఫ్యాషన్ డిజైనర్లు సరికొత్త ఫార్ములాలను పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. బొద్దుగుమ్మలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించాలో.. ఏ ఏ రంగులు సూటవుతాయో.. ఇలా సూచిస్తున్నారు. ఫికర్ మత్.. మేని ఛాయ బంగారంలా మెరిసిపోతున్న చబ్బీ బేబీలు ముదురు రంగులు వేస్తే బెటర్. లైట్ కలర్స్ అయితే మీ లావుతనాన్ని హైలైట్ చేస్తాయి. కాళ్లు కాస్త లావుగా ఉంటే డార్క్ కలర్ బాటమ్ వేసి లైట్ కలర్ టాప్ వేసుకుంటే సరి. అయితే టాప్స్ మాత్రం నడుం కింది భాగం వరకూ ఉండేలా చూసుకుంటే మంచిది. చేతులు చబ్బీగా ఉంటే మాగ్జిమమ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లేదా ఫుల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేయాలి. మరో విషయం వేసుకునే డ్రెస్‌పైన గాని, కట్టుకునే చీరపైన కాని పెద్దపెద్ద పూలు, పెద్ద డిజైన్ ఉంటే అవి మిమ్మల్ని హైలైట్ చేస్తాయి. చిన్న చిన్న పూలు, చుక్కలు ఉండేవి వేసుకుంటే అవి హైలైట్ అయ్యి మీ ఆకారాన్ని దాచేస్తాయి. ఫ్యాషన్ మస్త్.. అడ్డగీతల టాప్‌లు, షర్ట్లు, ప్యాంట్లు వేసుకుంటే ఉన్నదానికంటే ఇంకాస్త ఎక్కువ లావుగా కనిపిస్తారు. నిలువు గీతల కాస్ట్యూమ్స్ కాస్త సన్నగా, పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. ఫ్యాషన్ లుక్ కోరుకునే ‘మంద’గత్తెలు హిప్స్ కింది వరకూ కవర్ చేసే పొడువాటి షర్ట్, మ్యాచింగ్‌గా క్వాలిటీ స్కిన్నీ లెగ్గిన్ వేసుకుంటే అదిరేటి లుక్ వస్తుంది. టాప్, షర్ట్‌లకు సైడ్ కటింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఈ కాస్ట్యూమ్స్ ఏ మాత్రం ట్రాన్స్పరెంట్గా లేకుండా చూసుకోవాలి సుమీ. ఈ డ్రెసింగ్‌కు మార్కెట్లో దొరికే షగ్స్ ్రలేదా పలుచటి ఓవర్ జాకెట్ వేసుకుంటే స్టైలిష్ లుక్ సొంతం చేసుకోవచ్చు. చీరకట్టయితే మోచేతుల వరకూ జాకెట్ ఉంటే ఫ్యాషనబుల్‌గా ఉంటుంది. సాధ్యమైనంత వరకూ స్లీవ్‌లెస్‌లు, మెగా స్లీవ్స్ అవాయిడ్ చేయండి. డ్రెసింగ్తోనే సరిపెట్టకుండా.. కాస్త బిగ్‌సైజ్ ఇయర్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకుంటే మరీ మంచిది. అన్నింటికన్నా కాన్ఫిడెంట్ ఉండటం ముఖ్యం. - శిరీష చల్లపల్లి -
శారీ...సింగారీ
నల్లంచు తెల్ల చీరైనా.. చెంగావి రంగు చీరైనా.. అతివలు చుట్టుకుంటేనే వాటికి అందం. తరతరాలుగా విలువ తరగనివి చీరలే. మగువల మేను చుట్టుకుని మెరిసిపోయే కోకల రూపకల్పన మహాద్భుతంగా ఉంటుంది. రోజురోజుకూ ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులు చీరల్లో సరికొత్త చేర్పులు చేస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్. సిటీలోని షాపింగ్ మాల్స్ విభిన్నమైన శారీ కలెక్షన్స్‌తో నిండిపోయాయి. అలనాటి పట్టు చీరలకు ఆధునిక హంగులు జోడించి మగువలకు కలర్ఫుల్గా అందిస్తున్నాయి. ఒకటేమిటి... కాంచీపురం, కుబేర, ఆవిష్కార, అరుంధతి తదితర హెవీ, లైట్ వెయిట్ పట్టు చీరలు వినూత్నమైన డిజైన్లు అద్దుకుని ముచ్చటగొలుపుతున్నాయి. జీవితంలో ఒకసారి జరిగే పెళ్లి వేడుకలో తమ ఆహార్యం స్పెషల్ అట్రాక్షన్‌గానే కాదు, ఓ మెమరబుల్‌గా మిగిలిపోవాలని పెళ్లికూతుళ్లు కోరుకుంటున్నారు. వారితోపాటు ఆ వేడుకకు హాజరయ్యే అతివలు కూడా అదిరిపోయే అప్పీరెన్స్ ఉండాలనుకుంటున్నారు. అందుకే ధరకు వెనకాడకుండా నచ్చిన చీరలు కొనుగోలు చేస్తున్నారు. పాతతరం చీరలకు ఆధునికత జోడించిన వెరైటీలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. లైట్ వెయిట్ పసిడి పట్టుకు ఇప్పుడు క్రేజ్ బాగా ఉంది. 90 శాతం వెండి, పది శాతం బంగారం మిక్స్ చేసి ఈ శారీలను డిఫరెంట్ డిజైన్లలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. వీటిని ధనవంతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అధిక బరువు ఉన్నవి మధ్యతరగతివారు అడుగుతున్నారు. కాలేజీ అమ్మాయిల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరినీ దృష్టిలో ఉంచుకుని వీటిని సిద్ధం చేస్తున్నారు... అని షాపింగ్ మాల్ నిర్వాహకులు చెబుతున్నారు. మెరిసి... మురిపించి సికింద్రాబాద్ సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్లో శుక్రవారం జరిగిన ‘వివాహ్ కలెక్షన్స్ 2015’ లాంచింగ్‌లో... ముద్దుగుమ్మలు పట్టు చీరలు కట్టి... ఒంటి నిండా ఆభరణాలు ధరించి సంప్రదాయ సిరులు ఒలికించారు. మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్, నటి రామ్శ్రీ, ఆయేషా రావత్, మోడల్స్ కలర్‌ఫుల్ శారీల్లో ‘పట్టు’కే వన్నె తెచ్చారు. -వీఎస్ -
బహుమతి అపురూపం
ఓపెనింగ్ సీన్.. కారడవిలోనో.. నదిలో కొట్టుకొస్తున్న తెప్పలోనో మెడలో లాకెట్ చైన్‌తో ఓ పిల్లాడు ఉంటాడు. పిల్లలు లేని దంపతులకు దొరుకుతాడు. కట్ చేస్తే.. ఆ పిల్లాడు పెరిగి హీరో అవుతాడు. సినిమా క్లైమాక్స్‌కు రెండు రీళ్ల ముందు సదరు హీరో ఆ లాకెట్ ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న ఫొటోలను చూసి తన అసలైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటాడు. ఈస్ట్‌మన్ కలర్ సినిమాల్లో లాకెట్ బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి. 3డీ సినిమాలు జోరుమీదున్న ఈ టైంలో లాకెట్లు కూడా 3డీ హంగులు అందుకుంటున్నాయి. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఫ్యాషన్ ముచ్చట్లు.. మనం ఎంతగానో అభిమానించే వారికి ఎన్నడూ మరచిపోలేని అపురూపమైన గిఫ్ట్ ఇవ్వాలని అందరూ ఆశపడుతుంటారు. మన మనసు మెచ్చిన వ్యక్తికి మనం ఇచ్చే బహుమతి తీపి జ్ఞాపకాలను అందించేదై ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసమే కస్టమైజ్డ్ బహుమతులు నేటి ఫ్యాషన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నాయి. పసిడి వెలుగులకు క్రియేటివిటీ జోడించి మీరు మెచ్చిన లేదా మీకు నచ్చిన వ్యక్తి రూపాన్ని లాకెట్‌గా మలచి అందిస్తున్నారు. గోల్డెన్ సర్ప్రైజ్ మీ పెళ్లి నాటి మనోహర దృశ్యమైనా.. అప్పుడే పుట్టిన పిల్లాడి పాదాలైనా.. మీ గారాలపట్టి ముఖారవిందమైనా.. ఈ 3డీ ప్రింటెడ్ జ్యువెలరీలో ఇట్టే ఇమిడిపోతాయి. ఏది ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో.. ఆ చిత్రాన్ని తయారీదార్లకు ఇస్తే చాలు. ఆధునిక టెక్నాలజీతో ఆ దృశ్యానికి 3డీ రూపం ఇచ్చి.. దాన్ని లాకెట్గానో, రింగ్గానో మలిచేస్తారు. వధూవరుల ముఖాలు ప్రతిబింబించేలా ఎంగేజ్మెంట్ రింగ్స్ తయారు చేస్తున్నారు. ఇలాంటి పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ http://www.augrav.com/ ఆన్లైన్లో ఆఫర్ చేస్తోంది. ఈ వెబ్సైట్లోకి వెళ్లి డిజైన్ సెలెక్ట్ చేసుకుని, కావాల్సిన వ్యక్తి ఫొటో అప్లోడ్ చేస్తే చాలు.. మీ కస్టమైజ్డ్ గిఫ్ట్ రెండు మూడు వారాల్లో రెక్కలు కట్టుకుని మీ చెంత వాలుతుంది. యువర్స్ చాయిస్ బారసాల, పుట్టినరోజు, ఎంగేజ్మెంట్, వివాహం, షష్టిపూర్తి.. ఇలా అకేషన్స్‌లో 3డీ ప్రింటెడ్ జ్యువెలరీ గిఫ్ట్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. బంగారు వన్నెల్లో మెరిసిపోయే ఈ బహుమతులకు కస్టమర్ ఆర్డర్ మేరకు నవరత్నాలతో ఫినిషింగ్ కూడా ఇస్తున్నారు. సైజు, వెయిట్, డిజైన్ బట్టి వీటి ఖరీదు రూ.12 వేల నుంచి రూ.లక్షల వరకూ పలుకుతున్నాయి. మరింకెందుకు ఆలస్యం.. అపురూపమైన బహుమతిని నేడే అందుకోండి. - శిరీష చల్లపల్లి -
నయా ట్రెండ్స్
కొత్త ఆశలతో వస్తున్న కొత్త సంవత్సరం కొంగొత్త ట్రెండ్స్‌నూ మోసుకొస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో, డే టు డే లైఫ్‌లో నయా మార్పులకు శ్రీకారం చుడుతోంది. న్యూ ఇయర్ రాకతో క్యాలెండర్ మార్చినట్టే.. ఓల్డ్ ఫ్యాషన్స్‌ను మార్చేస్తున్నారు. ఒక్క ఫ్యాషన్‌లోనే కాదు... అన్ని రంగాల్లో డిఫరెంట్ యాంగిల్‌ను చూపిస్తున్నారు. - శిరీష చల్లపల్లి ఫ్యాషన్ అనగానే అమ్మాయిల కే అనుకుంటాం. సిటీలో అతివలకు సమానంగా ఫ్యాషన్ పోకడలకు స్వాగతం పలుకుతున్నారు మగాళ్లు. 2015లో అప్పీరియన్స్‌లో ఆడవాళ్లకు దీటుగా కనిపిస్తాం అంటున్నారు. బ్లూ జీన్స్, బొమ్మల టీ షర్ట్, కూలింగ్ గ్లాసెస్, మెడలో యాక్సెసరీస్ ఈ ట్రెండ్ ఓల్డ్ అయిపోయిందంటున్నారు యువకులు. సింపుల్ స్పన్ టీ షర్ట్, పైన సెమీ హెవీ జాకెట్, కలర్ చినోస్, బ్లాక్ ఫ్రేమ్ కూల్ గ్లాసెస్, వెట్టెడ్ ఫంక్ హ్యాండ్ కోంబింగ్ హెయిర్ స్టయిల్.. ఇలా సింపుల్ లుక్స్‌లో జెంటిల్‌గా కనిపించే ప్యాటర్న్ మీద మనసు పారేసుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు.. ఫ్యాషన్ షోల్లో, కాలేజీల్లో సైతం ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. - హర్ష, ఫ్యాషన్ డిజైనర్ గుండమ్మ రుచి సిటీవాసులకు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు కామన్. కానీ వీటిని తోసిరాజని సరికొత్త రుచి ఒకటి భోజనప్రియులను చవులూరిస్తోంది. ఆ పాత రుచిని కాస్త మోడిఫై చేసిన వెరైటీ డిష్ 3జీ రైస్. జనరేషన్‌కు తగ్గట్టుగా మొబైల్లోనే కాదు ఫుడ్‌లో కూడా 3జీ వెరైటీని ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. ఇంతకీ 3జీ అంటే గుండమ్మ గారి గోంగూర రైస్. గుండమ్మకథ సినిమా నచ్చని వారు ఉండరు. అందుకే ఆ సినిమా పేరుతో గోంగూర రైస్‌ను సిటీవాసులకు పరిచయం చేస్తున్నారు. ఈ డిష్ 2015లో హాట్ డిష్‌గా మారబోతోందని చెబుతున్నారు భోజనప్రియులు. - వెంకట్ (కిచెన్ ఆఫ్ కూచిపూడి) నేచురల్ మేకప్ సహజంగానే అతివలకు మేకప్‌పై మక్కువ ఎక్కువ. అయితే మార్కెట్లోకి వస్తున్న లోషన్స్‌ను ఎడాపెడా రుద్దేస్తే చర్మం వికసించడం కాదు సరి కదా.. పాలిపోతుంది. అందుకే కెమికల్స్ రహిత ఆర్గానిక్ మేకప్ కిట్ మార్కెట్లోకి వచ్చింది. పసుపు, కుంకుమ పువ్వు, గంధం, విభూది చూర్ణం వంటి సహజమైన వస్తువులతో తయారు చేసిన ఈ మేకప్ కిట్ ద్వారా ఎలాంటి దుష్ర్పభావాలూ ఉండవనేది బ్యుటీషియన్ల మాట. సో... చిన్నపిల్లలకే కాదు సెన్సిటివ్ స్కిన్ ఉన్న మగువలకూ ఈ మేకప్ ఎంతో ఉపకరిస్తుంది. - లక్ష్మీదీప, సాయి సంపద ట్రెడిషనల్ ఇండియన్ ప్రొడక్ట్స్ -
కొంగు సింగారం
వాలుజడ చివరన వేలాడుతూ.. నడకలతో నాట్యం చేసే కుచ్చులంటే మహిళలకు మహా ఇష్టం. అయితే బారెడు జడలు కానరాక బావురుమంటున్న కుచ్చులకు ఫ్యాషన్ ప్రపంచం సరికొత్త ప్లేస్ ఇచ్చేసింది. శతాబ్దాల పాటు మగువల కురుల్లో కొలువున్న ఈ అలంకరణ వస్తువు.. కాస్త లుక్ మార్చుకుని ష్యాషన్ కాస్ట్యూమ్స్లోని యువతులకు భుజకీర్తులుగా.. చీరకట్టులో ఉన్న స్త్రీల కొంగు సింగారంగా రూపుదిద్దుకుని నయా పోకడల్లో కనిపిస్తోంది. కుచ్చుల గంటలు ఒకప్పుడు జడలకు మాత్రమే అలంకారంగా ఉండేవి. నేటి యువతులు వస్త్రధారణలో ఏ ట్రెండ్ ఫాలో అయినా.. కుచ్చుల గంటలను కామన్ యాక్సెసరీస్‌గా కొలుస్తున్నారు. ‘లవ్ హ్యాంగింగ్స్’ పేరుతో కొత్త లుక్ సంతరించుకున్న కుచ్చుల గంటలు రకరకాల మోడల్స్‌లో ఇప్పుడు ఫ్యాషన్ మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. మ్యాచింగ్ లవ్ హ్యాంగింగ్స్.. వేసుకున్న కాస్ట్యూమ్‌కు మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఫ్యాషన్ హ్యాంగింగ్స్ రకరకాల రంగుల్లో ఈ హ్యాంగింగ్స్ దొరుకుతున్నాయి. పెరల్స్, స్టోన్స్, కుందన్, నేచురల్ స్టోన్స్, బీడ్‌స ఇలా స్పెషల్ ఫినిషింగ్‌తో లవ్ హ్యాంగింగ్స్‌ను స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. జాకెట్ వెనుక డోరీలకు, డ్రెస్‌లకు, చీరల కొంగులకు వీటిని సెట్ చేసుకోవచ్చు. క్రి యేటివ్ ఫ్యాషన్ లవర్స్.. సాదాసీదా చీరకు కొంగు చివర్లో గుత్తులుగా కాంట్రాస్ట్ కలర్ కుచ్చులను ఫిక్స్ చేసి డిజైనరీ చీరగా మార్చేస్తున్నారు. వస్త్రాలకే కాదు.. యాక్సెసరీస్‌కూ లవ్ హ్యాంగింగ్స్ రిచ్ లుక్ తీసుకొస్తున్నాయి. మహిళలు ఇష్టంగా వేసుకునే గాజులకు, హ్యాండ్‌బ్యాగ్ జిప్‌లకు కూడా అతికినట్టు సరిపోతున్నాయి. ఈ కుచ్చులు బ్యాంగిల్ స్టోర్స్‌లో, డిజైనర్ మెటీరియల్ సేల్ సెంటర్స్‌లో దొరుకుతున్నాయి. - శిరీష చల్లపల్లి -
త్రీడీ డ్రెస్.. అదుర్స్..!
ఆధునిక ఫ్యాషన్ ప్రపంచం సరికొత్త శిఖరాలకు చేరుకుందని చెప్పడానికి ఈ భామ వేసుకున్న డ్రెస్సే నిదర్శనం. దీనిని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించారు. అతివల శరీరాకృతికి సరిగ్గా సరిపోయేలా దుస్తులు రూపొందించడం ఈ విధానం ప్రత్యేకత. తొలుత యువతి శరీరాకృతిని త్రీడీ స్కానింగ్ చేస్తారు. అనంతరం ఆమెకు నచ్చిన డిజైన్‌తో సరిగ్గా ఒంటికి సరిపోయేలా త్రీడీ ప్రింటర్ ద్వారా డ్రెస్ ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. అమెరికా మసాచుసెట్స్‌కు చెందిన ఓ డిజైన్ స్టూడియో ఈ వినూత్న ఆవిష్కరణ చేసింది. ఒక్క డ్రెస్‌ను ప్రింట్ చేయడానికి 48 గంటల సమయం పడుతుందని, ఇందుకు 3వేల డాలర్లు (దాదాపు రూ.1.80 లక్షలు) ఖర్చవుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. -
ఫ్యాన్సీ సూత్రం
ఫ్యాషన్ వరల్డ్‌లో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్ వస్తుంటాయి.. పోతుంటాయి. తరాలు మారినా.. కాలాలు మారినా.. ఈ ట్రెడిషనల్ జ్యువెలరీ మాత్రం ఎప్పుడూ ఫ్రెష్‌గానే ఉంటుంది. దీని ప్రస్తావన లేకుండా పెళ్లికి ముందు జరిగే మాటాముచ్చట్లకు పరిపూర్ణత రాదు. ఈ నల్లపూసల హారానికి.. మాంగల్యబలాన్ని మరింత పెంచుతుందన్న క్రెడిట్ కూడా ఉంది. అందుకే బోషాణంలో బోలెడన్ని నగలున్నా.. మగువలు మాత్రం నల్లపూసల తర్వాతే మిగతావంటారు. నయా ఫ్యాషన్ వాకిట నిలిచిన ముదితలు.. పుస్తెల తాడు ప్లేస్‌ను కూడా నల్లపూసలతోనే భర్తీ చేస్తున్నారు. పెళ్లయిన ప్రతి అమ్మాయికి లీగల్ లెసైన్స్ మంగళసూత్రమే. పుస్తెలతాడు కనిపిస్తే చాలు ఆ పడతికి పతి ఉన్నాడని తెలిసిపోతుంది. అయితే కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్న ఈ తరం భార్యామణులు మంగళసూత్రాలకు బదులు నల్లపూసలు వేసుకుంటున్నారు. గతంలో ఏ పేరంటానికి వెళ్లినా.. హెవీ పట్టుచీరలు.. వాటిపైన లాంగ్ చైన్, చంద్రహారం, కాసుల పేరు, రవ్వల నెక్లెస్.. ఇలా స్వర్ణ కాంతులతో మెరిసిపోయేవారు. ఆ రోజులకు చెక్‌పెడుతూ.. సింపుల్‌గా ఉండే సూపర్బ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సంప్రదాయానికి కాస్త కలరింగ్ ఇచ్చి బ్లాక్ బీడ్‌స చెయిన్‌తో లాగించేస్తున్నారు. వెరైటీ బీట్స్ కొత్తగా హల్చల్ చేస్తున్న బ్లాక్ బీడ్‌స ఫ్యాషన్‌కు వేలాది ఇన్నోవేటివ్ డిజైన్లతో మరింత ఊపునిస్తున్నారు జ్యువెలరీ డిజైనర్లు. పచ్చలు, కెంపులు, కలర్ బీడ్‌స, ముత్యాలు, రత్నాలు, పగడాలు, సీ జేడ్స్ ఇలా వెరైటీలు జత చేసిన బ్లాక్ బీడ్‌స చెయిన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫంక్షనల్ వేరింగ్ కోసమే కాదు.. ఉద్యోగాలకు వెళ్లే అతివలకు నప్పే విధంగా క్లోస్డ్ నెక్ బ్లాక్ బీడ్‌స, రో బీడ్‌స, గసగసాల నల్లపూసలు, స్నేక్ స్కిన్ బ్లాక్ బీడ్‌స ఇలా రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి. చెయిన్ సైజ్‌ను బట్టి లాకెట్లు ప్రిఫర్ చేస్తున్నారు మహిళలు. టెంపుల్ లాకెట్, డ్రాప్ లాకెట్, నేచురల్ స్టోన్ లాకెట్ ఇలా రకరకాలుగా దొరుకుతున్నాయి. నయా ట్రెండ్‌కు సలామ్ కొడుతున్న వనితలు.. లాకర్ల నిండా బంగారు ఆభరణాలు ఉన్నా.. గోల్డ్, ప్లాటినం కలగలిపిన నల్ల పూసలు ఒక్కటే వేసుకుని వెళ్లిపోతున్నారు. ఏజ్‌తో సంబంధం లేకుండా నల్లపూసల వెరైటీస్‌తో ముస్తాబవుతున్నారు. సింప్లీ సూపర్బ్.. ఈ తరహా బ్లాక్ బీడ్‌స చెయిన్లు ఈ మధ్య ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ప్లాటినం, గోల్డ్‌లోనే కాదు సెమీప్రీషియస్ జ్యువెలరీలో కూడా అనేక డిజైన్లు దొరుకుతున్నాయి. సింపుల్ బీడ్‌స ఉన్న షార్ట్ నల్లపూసల చెయిన్ల ధర వెయ్యి రూపాయల లోపే ఉంటుంది. మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బ్లాక్ బీడ్‌స చెయిన్ అయితే ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటాయి. అయితే బ్లాక్ బీడ్‌స కలర్ షేడ్ కాకుండా ఉండాలంటే.. పర్ఫ్యూమ్, డియోస్ వాటిపై పడకుండా చూసుకోవాలి. వాటిని ప్లాస్టిక్ కవర్లో గానీ, కాటన్ బాక్స్‌లో కానీ జాగ్రత్త చేస్తే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. - శ్రీకాంత్ సంధి రెడ్డి, కుందన జ్యువెలరీ -
ఫ్రాక్..కిరాక్
పెళ్లి అనేది సంప్రదాయ వేడుక. పక్కా ట్రెడిషనల్‌గా జరిగే పెళ్లిసందడిలో ఆచార వ్యవహారాలే కాదు.. కట్టూ, బొట్టూ కూడా పద్ధతి అంటారు పెద్దలు. కానీ రిసెప్షన్‌కు వచ్చేసరికి కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తారు. అందుకే పెళ్లిపందిరిలో పట్టు చీరలో మెరిసిపోయే వధూమణి.. రిసెప్షన్ వేడుకలో నయాట్రెండ్ వస్త్రాల్లో తళుకులీనుతుంది. అప్పుడున్న ట్రెండ్‌లో ది బెస్ట్ కలెక్షన్‌ను సెలెక్ట్ చేసుకుని మరింత అందంగా కనిపిస్తుంది. కాలంతో పాటు ఫ్యాషన్ ట్రెండ్స్ మారిపోతుంటాయి. ఓసారి ఫ్యాషన్ ప్రపంచం అంతా చుడీదార్ల చుట్టూ తిరిగింది. మరోసారి పల్లూ శారీస్‌ను పట్టుకుని మురిసిపోతుంది. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్లపై మనసుపడింది. ఫ్లోర్ లెన్త్ గౌన్లలో కాస్త హుందాగా.. ఇంకాస్త అందంగా కనిపిస్తామని యంగ్ మగువలు దీన్ని ఎన్నుకుంటున్నారు. పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ వేడుకల్లో సైతం లాంగ్ స్కర్ట్‌లో దర్శనమిస్తున్నారు. లాంగ్‌స్కర్ట్ జమానా మళ్లీ ఊపందుకోవడంతో సరికొత్త కలెక్షన్స్ మార్కెట్లోకి తెస్తున్నారు డిజైనర్లు. లైట్ వెయిట్ షిఫాన్, క్రీప్స్, జార్జెట్స్ వంటి రకాలు ఫ్యాషన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫారిన్ సొగసులు దిద్దుకున్న ఈ లాంగ్ గౌన్లకు ఇండియన్ ఫ్లేవర్ అద్దుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అదిరిపోయే ఎంబ్రాయిడరీ వర్క్స్‌తో లాంగ్ స్కర్ట్స్‌కు వెడ్డింగ్ శోభను తీసుకొస్తున్నారు. అందుకే ఈ కొత్త ఫ్యాషన్.. మిగతా కలెక్షన్స్‌ను దాటుకుని ముందుకొచ్చింది. - శిరీష చల్లపల్లి -
పట్టుమహిషులు
పట్టు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమైనా, ఫ్యాషన్ ప్రపంచంలో పట్టుకు ప్రాధన్యం కల్పించడమైనా సరే.. ‘పట్టు’దలతోనే సాధ్యం అంటున్నారు ఈ మహిళలు. ‘శ్రీమతి సిల్క్‌మార్క్-2014’లో ర్యాంప్‌పై ఇటీవల మిలమిలలాడిన ఈ మిసెస్లు పట్టువస్త్రాలకు మళ్లీ మంచిరోజులు రావాలనే ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. భిన్న నేపథ్యాలకు చెందిన వారైనా ‘పట్టు’దల వీరిని ఒకే వేదికపైకి తెచ్చింది. పట్టు వస్త్రాలపై ఈ ‘పట్టు’మహిషుల మనోగతం వారి మాటల్లోనే... పట్టుపై అవగాహన పెరగాలి.. పట్టు గురించి విద్యార్థుల్లోనే కాదు, ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. పట్టు ప్రాధాన్యమేమిటో మహిళలకే బాగా తెలుసు. పట్టుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు నా వంతు బాధ్యతగా ఈ ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్నా. గత ఏడాది ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నా, కానీ హాజరు కాలేకపోయాను. అప్పుడు ఇచ్చిన వివరాలను గుర్తుంచుకుని మరీ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో ఈసారి పాల్గొనగలిగాను. - స్వప్నప్రసాద్, టీచర్, వసంతనగర్, కూకట్పల్లి పట్టు గొప్పదనం అర్థమైంది.. మాది రాజస్థాన్. రాజస్థాన్ సంప్రదాయ వస్త్రధారణలో చీరలకు ప్రాధాన్యం ఉండదు. ఇక్కడికొచ్చాక పట్టు గొప్పదనం అర్థమైంది. టీవీలో స్క్రోలింగ్ చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. కాలేజీ డేస్ ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చేశాక ఆ లైఫ్ మిస్సయ్యానన్న దిగులు ఉండేది. పెళ్లయిన వారు సైతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు హైదరాబాద్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చాలా బాగుంది. - శ్వేతాచౌదరి, పార్ట్‌టైమ్ ట్యూటర్, కొండాపూర్ పట్టుచీరలంటే చాలా ఇష్టం.. మా ఆయన అభిషేక్ హైకోర్టు అడ్వొకేట్. అమ్మాయి శ్రావ్య ఇంటర్ చదువుతోంది. నేను బడ్స్ అండ్ ఫ్లవర్స్ స్కూల్లో పనిచేస్తున్నాను. చివరి నిమిషంలో ఈ కార్యక్రమం గురించి తెలియడంతో స్కూలు నుంచి నేరుగా కార్యక్రమానికి వచ్చేశాను. మన సంప్రదాయ వేడుకల్లో, పండుగల్లో పట్టువస్త్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. నాకు పట్టుచీరలంటే ఇష్టం.నా దగ్గర పట్టుచీరల కలెక్షన్ చాలానే ఉంది. - సత్యవాణి, టీచర్, కమలాపురి కాలనీ అవగాహన కార్యక్రమం ప్రశంసనీయం.. మా ఆయన ఫ్రాంక్లిన్ కంపెనీలో ట్రెజరర్. పెళ్లయి మూడున్నరేళ్లు అయింది. పెళ్లయ్యాక ఒక్కసారిగా బాధ్యతలన్నీ మీదపడతాయి. ఒతిళ్లు పెరుగుతాయి. అలాంటి ఒత్తిళ్ల నుంచి మహిళలకు రిఫ్రెష్మెంట్ కావాలి. అందులో అవేర్నెస్ కూడా ఉంటే మానసిక తృప్తి కూడా ఉంటుంది. టీవీలో స్క్రోలింగ్ చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. పట్టుపై అవగాహన కోసం ఈ కార్యక్రమం చేపట్టడం ప్రశంసనీయం. - శ్రుతిలక్ష్మి, ‘రేడియో అర్చన’లో ఆపరేషన్స్ ఆఫీసర్, రామంతపూర్ మా ఆయన ప్రోత్సాహంతో వచ్చాను.. మా ఆయన హరీష్, డెలాయిట్‌లో ప్రాజెక్ట్ మేనేజర్. పద్నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా. చిన్నప్పటి నుంచి చదువు కంటే ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీల్లో చదువుకునేటప్పుడు ప్రతి ఈవెంట్లోనూ పార్టిసిపేట్ చేసేదాన్ని. నా ఇంటరెస్ట్ చూసి మా ఆయన నన్ను ప్రోత్సహిస్తుంటారు. పట్టుచీరలపై అవగాహన కల్పించే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమానికి వచ్చాను. - జయ ఇంటూరి, గృహిణి పెళ్లయిన వారికీ వేదికలు ఉండటం విశేషం.. పెళ్లయి నాలుగు నెలలే అయింది. మా ఆయన నరసింహారెడ్డి, మార్కెటింగ్ ఇంజనీర్. టీవీలో స్క్రోలింగ్ చూసి వచ్చాను. పెళ్లయ్యాక ఇదో కొత్త జ్ఞాపకం. మా ఆయన ఎంకరేజ్ చేసి, ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇలాంటి వేదికలు పెళ్లయిన వాళ్లకు సైతం అందుబాటులో ఉండటం విశేషం. - అనసూయారెడ్డి, చేవెళ్ల -
అదిరే.. అదిరే..
ఫ్యాషన్ ప్రపంచంలో పరుగులు పెడుతున్న సిటీలో.. రోజుకో కొత్త థీమ్‌తో ఎక్స్‌పోలు జరుగుతున్నాయి. సత్యసాయినిగమాగమం వేదికగా ఏర్పాటైన డాజ్లింగ్ ఎక్స్పో అందర్నీ కట్టిపడేస్తోంది. ఈ ఎక్స్పోను నటి దీక్షా నగార్కర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షా మాట్లాడుతూ.. ఫ్యాషన్ వెరైటీలను అనుసరించడానికి ఇలాంటి ఎక్స్‌పోలు చాలా ఉపయోగపడతాయన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్లో ప్రముఖ డిజైనర్లు, చేనేత కార్మికులు రూపొందించిన పండుగ కలెక్షన్లు, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, సూట్స్, హోమ్ ఫర్నీచర్, కిడ్స్ స్టఫ్, ఇమిటేషన్ జ్యువెలరీ ఇలాంటివెన్నో ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తరలివచ్చిన డిజైనర్లకు చెందిన 74 స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయి. - సాక్షి సిటీప్లస్ -
కేక పుట్టించిన ఢిల్లీ ఫ్యాషన్ వీక్
-
ఫ్యాషన్ ప్రపంచం
-
ఫ్యాషన్హీట్ ...