టాప్‌ టెన్‌లో రష్మిక మందన్న బ్రాండ్‌ | Rashmika Mandanna's Brand Onitsuka Tiger In Top 10 | Sakshi
Sakshi News home page

టాప్‌ టెన్‌లో రష్మిక మందన్న బ్రాండ్‌

Published Fri, Mar 15 2024 6:14 PM | Last Updated on Fri, Mar 15 2024 6:21 PM

Rashmika Mandanna Brand Onitsuka Tiger In Top Ten - Sakshi

నార్త్, సౌత్‌లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయిన రష్మిక మందన.. ఇప్పుడు ఇంటర్‌నేషనల్ బ్రాండ్‌కి ప్రమోటర్‌గా మారిన విషయం తెలిసిందే. జపనీస్ ఐకానిక్ ఫ్యాషన్‌ బ్రాండ్ ఓనిట్సుకా టైగర్‌కి ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె కొనసాగుతుంది. 

రశ్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ 'ఒనిట్సుకా టైగర్' మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో టాప్ 10 బ్రాండ్స్‌లలో ఒకటిగా నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ తాజాగా ఈ లిస్టును తయారు చేసింది. ఫ్యాషన్ బ్రాండ్ విలువను డాలర్స్ తో చూసినప్పుడు రశ్మిక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఒనిట్సుక టైగర్ బ్రాండ్ టాప్ 10లో 9వ స్థానంలో నిలిచింది.

ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ప్రకారం ఒనిట్సుక టైగర్ ఫ్యాషన్ బ్రాండ్ 75 లక్షల డాలర్ల వర్త్ కలిగి ఉంది. గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో రశ్మిక మందన్న ర్యాంప్‌పై నడిచింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొని ఒనిట్సుక టైగర్ బ్రాండ్‌ను రశ్మిక ప్రమోట్ చేసింది. పుష్ప , యానిమల్ మూవీస్‌తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకుంది రశ్మిక మందన్న. ఈ క్రమంలోనే ఆమెకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్ దక్కుతున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్‌తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది రశ్మిక మందన్న.

ఐకానిక్ జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుకా టైగర్‌ ఎప్పటికప్పుడు నూతన వెరైటీలు, కొత్త డిజైన్స్‌తో అటు ఫ్యాషన్, ఇటు క్రీడలను మిళితం చేస్తున్నాయని..ఇలాంటి బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించడం గొప్ప ఎక్స్‌పీయరెన్స్ అని రష్మిక మందన్న తెగ సంబరపడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement