ఎగ్జామ్స్‌కు ఎనర్జీ
ఓ తాజా సర్వేలో తేలిందేంటంటే... అరవై శాతానికి పైగా ఉద్యోగులు వర్కింగ్ ప్లేస్‌లోనూ క్రికెట్‌ను వదలడం లేదట! పని పక్కనబెట్టి మరీ ఆటలో లీనమైపోతున్నారట. కొంతమందైతే ఏకంగా తమ బాస్‌లకు కూడా ఈ ఫీవర్ ఎక్కించేసి... మ్యాచ్‌రోజు వారినీ అప్‌డేట్ చేస్తున్నారట! ఎంప్లాయీసే ఇలా ఉంటే ఇక కుర్రకారు మాటేమిటి! వారికి అడ్డాలైన కాలేజీల్లో సీనేమిటి! ప్లేస్ మారినా అక్కడా అదే సీన్. ఎవర్ని కదిలించినా క్రికెట్టే ‘సబ్జెక్టు’.
మరి ఇంతలా లీనమైపోతే యాన్యువల్ ఎగ్జామ్స్ మాటేమిటి! నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచ పోరును ఫాలో అవ్వాలా! కెరీర్‌కు పునాదులు వేసే పరీక్షలపై శ్రద్ధ పెట్టాలా! అసలీ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా! ఇదే విషయాన్ని మాదాపూర్ ‘విజ్ఞాన్ కాలేజీ’ విద్యార్థుల ముందుంచితే... ఇంట్రస్టింగ్‌గా స్పందించారు. వారి కబుర్లు వినాలంటే... లెట్స్ గో ఇన్‌టూ ది డిస్కషన్...
తరుణ్: ఒకపక్క వరల్డ్ కప్ క్రికెట్... మరో పక్క ఫైనల్ ఎగ్జామ్స్. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎగ్జామ్స్ ముఖ్యం కాబట్టి దృష్టి క్రికెట్ మీదకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాం. మా సార్స్ ఎప్పటికప్పుడు క్రికెట్ స్కోర్స్ అప్‌డేట్ చేస్తున్నారు.
దీపక్: మిగతా ఎగ్సామ్స్ సంగతి ఎలా ఉన్నా... మా ఫిజిక్స్ ఎగ్జామ్స్ రోజు భారత్ మ్యాచ్ రాకుండా ఉంటే చాలు.
మనోజ్: ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ బాగా ఎంజాయ్ చేశాం. నేను, మా ఫ్రెండ్ శ్రీకాంత్ బెట్టింగ్ కట్టుకున్నాం. అఫ్‌కోర్స్ ఓడిపోయాననుకోండి!
శ్రీకాంత్: ఇండియా ఓడిపోతుందని బెట్ కడితే... ఓడిపోక ఏం చేస్తాడు. నేనైతే ఆ రోజు ఫుల్ ఎంజాయ్. మా ఫ్రెండ్స్ అందరికీ క్యాంటిన్‌లో పార్టీ ఇచ్చాను.
దినేష్: నాలుగేళ్లకోసారి వచ్చే వరల్డ్‌కప్. ప్రతి క్రికెట్ అభిమానీ ఎంజాయ్ చేసే టైమిది. ఎగ్జామ్స్ టైమ్‌లో వరల్డ్ కప్ ఉందని మేమెవ్వరం ఫీల్ అవడం లేదు. ఇంకాస్త జోష్‌తో ఎగ్జామ్స్ రాస్తున్నాం.
శ్రీకాంత్: మనిషికి ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ ఉండాలి కదా అని..!
తరుణ్: ఈసారి కూడా వరల్డ్ కప్ ఇండియాదే. ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. ఆ గెలుపు మాలో తెలియని ఎనర్జీ నింపుతుంది. దాంతో ఎగ్జామ్స్ ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో రాయగలుగుతున్నాం.
అఖిల్: ఈనెల 23తో మా ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పటివరకూ ఇలా ఫోన్స్‌లో అప్‌డేట్స్ తెలుసుకోవడం తప్పదు. ఆ తరువాత ఫుల్
ఎంజాయ్.
సత్యసాయి: అప్పటికి ఇండియా క్వార్టర్ ఫైనల్స్ ఆడేస్తుంది. ఇంపార్టెంట్ మ్యాచ్ మిస్సయిపోతాం. ఏదో మనసు ఆపుకోలేక స్కోర్స్ తెలుసుకోవడమే గానీ చూడలేం కదా! చూస్తే ఉండే ఎంజాయ్‌మెంటే వేరు..!
లలిత్: ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ అప్పుడు అమితాబ్ కామెంట్రీ మాత్రం మిస్సయ్యాం. అలాగని కాంప్రమైజ్ అయ్యి బుక్స్‌ని పక్కన పెట్టలేం కదా. కేవలం స్కోర్స్ వరకు తెలుసుకుని, మిగతా టైమంతా పుస్తకాలకే స్పెండ్ చేస్తున్నాం.
భరత్: ఈసారి మ్యాచ్‌లో సచిన్, సెహ్వాగ్, యువరాజ్ లేని లోటు తెలియడం లేదు గానీ, పిచ్‌లో వారి ముఖాలు కనిపించకపోవడం చాలా నిరాశగా ఉంది.
వెంకట్ సౌరభ్: అయినా ఫర్వాలేదు. మన ధోని మిస్టర్ ఫర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు.
దినేష్: స్టార్టింగ్ మ్యాచ్‌కు భయపడ్డాం. అంటే ఎగ్జామ్స్ మొదలవకముందు మన టీమ్ గురించే ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్లం. ముఖ్యంగా బౌలింగ్‌లో వీక్ ఉన్నామని! ఎప్పుడైతే వరుస గెలుపులు చూశామో ఇక భారత్‌పై చర్చలు మానేశాం. ఓన్లీ స్కోర్సే ఎంక్వైరీ చేస్తున్నాం.
శ్రీకాంత్: నో డౌట్... వరల్డ్ కప్ మాత్రం ఇండియాదే. ఆ ఉత్సాహంతోనే ఎగ్జామ్స్ అన్నీ బాగా రాస్తున్నాం.
అఖిల్: ప్రతిసారీ సమ్మర్ హాలిడేస్ అంటే రొటీన్‌గా అనిపించేది. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసే ముందు పెద్దగా ఉత్సాహమేమీ ఉండేదికాదు. ఈసారి అలా కాదు, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అవుతాయా అని రోజులు లెక్కబెట్టుకుంటున్నాం.
సత్యసాయి: అయామ్ షూర్... వరల్డ్ కప్ ఎనర్జీ ప్రస్తుతం మాకు బాగా వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా అబ్బాయిలకు. ఇండియా గెలుపు మాలో ఏదో తెలియని ఉత్సాహం నింపుతోంది. బేసిగ్గా మేమంతా క్రికెట్‌ని ఎక్కువగా ఆడడం వల్లో ఏమో తెలీదు... పగలు, రాత్రులు చదివినా పెద్దగా అలసట అనిపించడంలేదు.
మనోజ్: వరల్డ్ కప్ మాలో తెలియని పాజిటివ్ ఎనర్జీని నింపుతోంది.
దీపక్: ఒక్కోసారి ఇంట్లోవాళ్లని చూస్తే ఈర్ష్య కలుగుతుంది. చక్కగా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్‌లు ఎంజాయ్ చేస్తున్నారు. మాకు కామెంట్రీ వినిపించడానికి ట్రై చేస్తుంటే వద్దంటున్నాం. ఎగ్జామ్స్ తరువాత యూ ట్యూబ్‌లో జరిగిన మ్యాచ్‌లు అన్నీ చూసి ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నాం.
శ్రీకాంత్: అంత అవసరం లేదురా... ఎలాగూ జరిగిన మ్యాచ్‌లు హైలైట్స్ ఇస్తూనే ఉంటారు.
రవితేజ: ఎలాగూ వరల్డ్ కప్ కొట్టేది మన ఇండియానే కాబట్టి... సమ్మర్ హాలిడేస్ అంతా అవే హైలైట్స్ చూస్తూ కూర్చోవచ్చు.