ఫుడీస్ డే అవుట్
ఫుడ్ లవర్స్ అంతా ఒకే చోట చేరి.. వారికి నచ్చిన వెరైటీలను... మెచ్చిన స్పాట్‌లో వేడివేడిగా లాగించేశారు. ఎప్పుడూ ఫేస్‌బుక్‌లో తమ అభి‘రుచు’లను పంచుకున్న ‘ఫుడీస్ ఇన్ హైదరాబాద్’ కమ్యూనిటీ తొలిసారి కలుసుకుని రియల్‌గా టేస్ట్స్‌ను ఆస్వాదించారు. కొండాపూర్ అనంతర ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌లో ‘ఫస్ట్ ధమాకా’ పేరుతో ఇష్టమైన రుచులను ఓ పట్టు పట్టారు.
వీరి కోసం మొత్తం 38 వెరైటీలను సిద్ధం చేసింది రెస్టారెంట్. మూడు వేల మంది సభ్యులున్న ఈ కమ్యూనిటీ అడ్మిన్ రవికాంత్‌రెడ్డి మాట్లాడుతూ... నగరంలోని ఫుడ్ లవర్స్ కోసం ఇకపై ఇలాంటి గెట్ టుగెదర్‌లు నెలకు రెండు ఏర్పాటు చేస్తామన్నారు. ఒకే అభిరుచి ఉన్నవారంతా ఇలా ఒకేచోట కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
-సాక్షి, సిటీ ప్లస్