హెయిర్ అండ్ స్పా
ప్రస్తుతం హెయిర్‌స్టైల్స్‌లో లేటెస్ట్ ట్రెండ్స్ అనేకం వస్తున్నాయని, ఎప్పటికప్పుడు తమని తాము అప్‌డేట్ చేసుకునే స్టైలిస్ట్‌లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుందని టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి అన్నారు. ఫిలింనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన అలెగ్జాండర్ హెయిర్ బ్యూటీ లాంజ్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 75 ఏళ్లుగా ఈ రంగంలో సేవలు అందిస్తున్న అలెగ్జాండర్ బ్రాండ్ సినీరంగంలో అనేక మందికి చిరపరిచితమైన పేరన్నారు. ఇక రాష్ట్రంలోనే తొలిసారి కిడ్స్ కోసం స్పెషల్‌గా ఏర్పాటు చేసిన స్పాను సినీ నటుడు శ్రీకాంత్ తనయుడు రోహిత్ ప్రారంభించాడు.