latest trends
-
నట్టింటి నుంచి.. నెట్టింటికి..
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని సినీ గేయ రచయిత ఆత్రేయ పాట అందరికీ తెలిసిందే.. అయితే ఆ పాటలో చెప్పిన విధంగా పెళ్లివారి నట్టింట్లో అచ్చం అలాంటి సందడే కొనసాగేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది.. పెళ్లి సందడి నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి చేరింది. దీంతో రకరకాల ఆధునిక పోకడలు ఈ తతంగంలో కనిపిస్తున్నాయి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదేరా బ్రదర్ అని మరో కవి అన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అయ్యే విధంగా తతంగం నడుస్తోంది. పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ మొదలు, పెళ్లి అనంతరం జరిగే తతంగాల వరకూ అన్నీ సోషల్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిలో నేటి ఆధునిక పోకడలపైనే ఈ కథనం.. నేటి తరానికి ప్రతిదీ సెలబ్రేషనే.. సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటున్నారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రీవెడ్డింగ్, పెళ్లి వేడుకలు, పోస్ట్ వెడ్డింగ్, సీమంతం ఇలా ఒక్కటేమిటి ప్రతి సందర్భాన్నీ వీడియోలు, ఫొటోలు తీసుకుని భద్రపరుచుకుంటున్నారు. తరతరాలు గుర్తుండిపోయేలా విభిన్నంగా, వినూత్నంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి సంబంధించిన పొట్టి వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల సరికొత్త ట్రెండ్ వచి్చంది. అదేంటంటే.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ వీడియోలు తాజాగా ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. సంతోషాన్ని పంచుకునేందుకు.. ఇటీవల తమ జీవితంలో జరిగే ముఖ్యమైన అంశాలను ప్రపంచంతో పంచుకోవడం అలవాటైంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పెడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు పెళ్లిచూపులకు సంబంధించిన అంశాలను చాలా గోప్యంగా ఉంచేవారు. అంతా సెట్ అయిన తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్నీ గుర్తుంచుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు కారు దిగిన దగ్గరి నుంచి పెళ్లి చూపులు జరుగుతున్న తతంగం మొత్తాన్నీ వీడియోలు తీసుకుంటున్నారు. అటు పెళ్లి కొడుకు, ఇటు పెళ్లి కూతురు నవ్వుతూ సిగ్గు పడుతుంటే అదో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి కూతురు తరపు వాళ్లు, పెళ్లి కొడుకు తరపు బంధువులు ఈ సందర్భంగా సరదాగా జరిపే మాటామంతీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సంభాషణలను ఆధారంగా చేసుకుని ఎన్నో ఫన్నీ వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తున్నారు. కామెంట్ల వెల్లువ.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను చక్కగా ఎడిటింగ్ చేసి, సూటయ్యే పాటలను బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్‌చేసి అప్లోడ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని కూడా వీడియోలు తీస్తున్నారు. రెండు, మూడేళ్లుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు తెగ పాపులర్‌గా ఉండేవి. ఇటీవల కాలంలోనే మన దగ్గర కూడా ఇలా పెళ్లి చూపుల వీడియోలు తీసి ఇన్‌స్ట్రాగామ్ వంటి వేదికల్లో పోస్టు చేస్తున్నారు. దీంతో మన దగ్గర కూడా ఈ రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రీల్స్ చూసిన వీక్షకులు కూడా నూతన వధూవరులకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు చెబుతూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు మాత్రం ఈ వీడియోలను చూస్తుంటే ‘పెళ్లి చేసుకుంటే బాగుండూ అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు. మొత్తానికీ ఈ ఏడాది పెళ్లి చూపుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. జాగ్రత్త అంటున్న నిపుణులు.. ఇటీవల చాలావరకూ ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్, బేబీ బంప్ వీడియోలు షూట్ చేసుకోవడం కామన్‌గా మారిపోయింది. అయితే ఏదైనా కానీ మితి మీరనంత వరకే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి అతిగా ప్రవర్తిస్తే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో సెన్సేషన్ కోసమో.. వినూత్నంగా, విభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనో వెరైటీగా షూటింగ్స్ చేసి విమర్శలు కొని తెచ్చుకున్న వారూ లేకపోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోలు నేటి టెక్నాలజీ కారణంగా మిస్ యూజ్ అయిన సందర్భాలనూ చూస్తూనే ఉన్నాం.. -
వెల్కమ్ టు వెబ్3 వరల్డ్
టెక్నాలజీ ప్రేమికులైన యువతరం తాజా ఆసక్తి... వెబ్3 విశాలమైన వెబ్ 3 స్పేస్‌లో స్టార్టప్‌ల నుంచి ఉద్యోగాల వరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ చెయిన్ సాంకేతికత ఆధారిత వెబ్3 యువత కోసం ఎన్నో ద్వారాలను తెరవనుంది. స్వయంప్రతిపత్తిని అందించనుంది... ఒకప్పుడు... ‘మాకు వెబ్‌సైట్‌తో పనిలేదు. ప్రింట్ మీడియా టీవీ చాలు’ ‘ఇ–కామర్స్‌తో పనిలేదు. ఇన్–స్టోర్ చాలు’‘మొబైల్ వెబ్సైట్, యాప్‌లతో పనిలేదు’ ‘వెబ్3 స్ట్రాటజీ మాకు అవసరం లేదు’ అన్నట్లుగా ఉండేది. 90ల నుంచి 2020 వరకు సాంకేతికతకు సంబంధించిన అభిరుచులు, అభిప్రాయాలలో ఎంతో మార్పు వచ్చింది. ‘మాకు అవసరం లేదు’ అన్నచోటే ‘మాకు తప్పనిసరిగా అవసరం’ అనే మాట వినిపిస్తోంది. వెబ్3 సాంకేతిక విషయంలోనూ ఇదే మార్పు చోటు చేసుకుంది. ‘ఇలా వచ్చి అలా వెళ్లి పోయే ట్రెండ్ ఇది’ అనుకున్న కంపెనీలు కూడా వెబ్3 సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. యూత్‌తో కనెక్ట్ కావడానికి ‘వెబ్3’ అనేది బలమైన సాధనం అని నమ్ముతున్నాయి. వెబ్3 మార్కెటింగ్‌పై రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నాయి. వెబ్3 బ్రాండ్స్ జెన్ జెడ్ మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి సంప్రదాయ విధానాలకు భిన్నంగా కొత్తదారిలో పయనిస్తున్నాయి. బ్లాక్‌చెయిన్–బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్, వర్చువల్ వరల్డ్స్ అభివృద్ధి వల్ల డిజిటల్ స్పేస్‌లో ఎక్కువ సమయం గడుపుతోంది యువతరం. వెబ్–3 బేస్డ్ గేమ్స్, వర్చువల్ వరల్డ్స్ యువ ప్లేయర్స్‌కు అటానమస్, వోనర్షిప్, మానిటైజేషన్ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లాంటి సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫామ్స్ మీద ఆధారపడకుండా కంటెంట్ క్రియేట్ చేయడానికి, షేర్ చేయడానికి, కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి వెబ్3 టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ‘వెబ్3 విశ్వరూపాన్ని మనం ఇంకా చూడనప్పటికీ కొత్తరకం అవకాశాలతో క్రియేటర్లను ఆకట్టుకుంటోంది. మధ్యవర్తుల అవసరం లేకుండానే డైరెక్ట్–కన్యూ్జమర్ ఇంటరాక్షన్‌కు వీలు కల్పిస్తుంది. సంప్రదాయ పద్ధతుల కంటే భిన్నంగా ఆదాయ మార్గాలను విస్తరించుకోవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే వెబ్3 అనేది సంప్రదాయ మోడల్స్‌ను సవాలు చేసేలా ఉంటుంది. క్రియేటర్లు ఒక అడుగు ముందుకు వేసేలా చేస్తుంది’ అంటున్నాడు ఏఐ పవర్డ్ క్రియేటర్ టెక్ కంపెనీ ‘యానిమెటా’ సీయివో దేవదత్తా. ‘వెబ్3 జెన్–జెడ్, మిలీనియల్స్‌ను ఆకట్టుకుంటుంది. వెబ్3 నుంచి మరిన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నారు. వెబ్3 యాప్ ఫౌండర్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన కసరత్తు చేస్తే, ఆసక్తికరమైన ఐడియాలతో ముందుకు వస్తే గేమ్‌లో ముందు ఉంటారు’ అంటున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీ ‘యాప్టోపియా’ ఫౌండర్, సీయివో జోనాథన్ కె. వెబ్ 3 రంగంలో భారత్ వేదికగా ఎన్నో కంపెనీలు పని చేస్తున్నాయి. వీటిద్వారా యువతకు ఎన్నో ఉద్యోగావకాశాలు దొరుకుతాయి. సాలిడిటీ డెవలపర్, మార్కెటింగ్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, బ్లాక్ చెయిన్ ఆఫీసర్, కమ్యూనిటీ మేనేజర్, యూనిటీ డిజైనర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఈవెంట్స్ మేనేజర్, ఎనలిస్ట్, బీటా టెస్టర్, టెక్నికల్ రైటర్, డెవలపర్, డిజైనర్, ఇన్ఫ్లూయెన్సర్ మేనేజర్... ఇలా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నయా ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వెబ్(డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ)కు సంబంధించి వెబ్ 1 నుంచి వెబ్ 2 వరకు జరిగిన ప్రస్థానాన్ని గమనిస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. వెబ్ 1 దశలోని వెబ్సైట్ల నుంచి వెబ్2 దశలోని సోషల్ మీడియా విస్తృతి వరకు ఆ మార్పును ప్రతిబింబిస్తాయి. అయితే ‘అభివృద్ధి’గా చూపుతున్న మార్పు బడా కంపెనీలకే మేలు చేసిందనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద కంపెనీల ఆధిపత్యానికి, నియంత్రణకు వీలు లేని వెబ్3 టెక్నాలజీపై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. వెబ్3 స్టార్టప్‌లు భారతీయ మార్కెట్లో ఊపందుకోవడం ఈ మార్పును సూచిస్తోంది. వెబ్ 3లో డీసెంట్రలైజ్డ్ విధానంలో డేటా ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతుంది. వెబ్ 3 అనేది ఒక తరం మార్పునకు ప్రతిబింబం. ‘వెబ్ 3కి కొలమానం ఏమిటి?’ అనే విషయానికి వస్తే ఒక యాప్‌లో డాటా, ఐడెంటిటీ, ప్రైవసీ, ప్లే–టు–ఎర్న్లాంటి ఎలిమెంట్స్ తప్పకుండా ఉండాలి. స్వెట్‌కాయిన్ (ఫిట్నెస్), ట్విగ్(ఫైనాన్స్)లాంటి వెబ్3 రైజింగ్ స్టార్స్ ఆచరణ స్థాయిలో వెబ్3 ఎలిమెంట్స్‌ను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. మైరాతో అంతర్జాతీయ స్థాయికి... వెబ్ 3 వరల్డ్ ఇనోవేషన్‌కు సంబంధించి ఘనంగా చెప్పుకునే వారిలో శిల్పా కర్కెరా ఒకరు. నాగ్‌పుర్‌కు చెందిన శిల్ప ఏఐ అండ్ బ్లాక్‌చెయిన్ సొల్యూషన్స్, ప్రాడక్ట్ కంపెనీ ‘మైరా టెక్నాలజీకి’ ఫౌండర్, సీయివో. ప్రస్తుతం ఈ కంపెనీ ఆరు దేశాల్లో పనిచేస్తోంది. ‘మైరా బ్లాక్స్’ అనే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్‌తో పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తోంది. ఎన్నో కొత్త కంపెనీలకు టెక్నాలజీ అడ్వైజర్‌గా పనిచేసింది. ‘మీకు సాంకేతిక విషయాలపై ఆసక్తి ఉంటే మీలాగే ఆసక్తి ఉన్నవారితో స్నేహం చేయండి. నిపుణులతో మాట్లాడండి’ అంటుంది శిల్ప. -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.. YS Jagan: పట్టణాభివృద్ధిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. త్వరగా ఇళ్లను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4500 కోట్లు ఖర్చుచేశామని, ఇంకా కనీసంగా మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు వివరించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. సాంకేతిక లోపం.. కేబుల్ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్ పర్వానూలోని టింబర్ ట్రైల్ రిసార్టులో సోమవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పదకొండు మంది పర్యాటకులు కేబుల్ కారులో చిక్కుకుపోయారు. సాంకేంతిక లోపం ఏర్పడటంతో రోప్‌వే మధ్యలో గాల్లో ఆగిపోయింది. చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించేందుకు రెస్క్యూ ట్రాలీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని సురక్షితంగా రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. మోదీ జీ.. మీ దోస్త్‌ను అడిగి తెలుసుకోండి అంటూ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ఆయన దోస్త్ అబ్బాస్ గురించి ఒవైసీ ప్రస్తావించడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మోదీ స్నేహితుడిని ప్రస్తావిస్తూ ఒవైసీ.. బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.. భారతీయుల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ తీసుకొచ్చారా..?: కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్‌కు నిరసనగా సోమవారం రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే! మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్‌క్రాప్ట్ డీల్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ దాదాపు 300 నారోబాడీ జెట్లను ఆర్డర్ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది విమానాయన చరిత్రలో అతి పెద్ద ఆర్డర్లలో ఒకటి అని స్పష్టం చేశాయి. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్‌లైన్ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో తన విమానాలను సరిదిద్దాలని చూస్తోంది. అధికారులు అంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. ఒకే రోజు టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ముగ్గురు క్రికెట్ దిగ్గజాలు భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ తేదీ భారత క్రికెట్‌కు ముగ్గురు దిగ్గజాలను అందించిన చిరస్మరణీయమైన రోజు. వివరాల్లోకి వెళితే.. భారత క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన ముగ్గురు క్రికెటర్లు ఇదే తారీఖున టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8..O2 Telugu Movie Review: పెళ్లి తర్వాత నయన తార మొదటి చిత్రం.. 'ఓ2' రివ్యూ.. ఎలా ఉందంటే ? లేడీ సూపర్ స్టార్ నయన తార తాజాగా 'ఓ2 (O2, ఆక్సిజన్)' సినిమాతో నేరుగా ఓటీటీలో సందడి చేస్తోంది. జీఎస్ విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నయన తార పెళ్లి తర్వాత విడుదలకావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్లుగా ఓ2 (O2) ఉందా? లేదా? రివ్యూలో చూద్దాం. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. సంచలనం..అదిరిపోయే డిజైన్లతో ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉందో మీరే చూడండి! ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఆటోమొబైల్ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఓలా సంస్థ త్వరలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. 10లక్షల ఎలక్ట్రిక్ హచ్ బ్యాక్ కార్లను తయారు చేసేందుకు సిద్ధమవ్వగా..ఆ కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహారాష్ట్రలో విషాదం.. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ముంబైకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్ గ్రామంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఇంట్లోనే విగత జీవులుగా కనిపించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1.. Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా పాశవికం రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడులను ఉధృతం చేస్తోంది. సామాన్య పౌరులు తలదాచుకున్న శిబిరాలను కూడా వదిలిపెట్టకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది. లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని బిలోహోరివ్కా గ్రామంలో ఓ పాఠశాలపై శనివారం రష్యా జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో జనం మరణించినట్లు స్థానిక గవర్నర్ సెర్హీ హైడే ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.. రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న... ఎంపీల ఓటు విలువ ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ 700కు పడిపోనుంది. గతంలో ఇది 708గా ఉండేది. 83 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.. ఉద్ధవ్‌కు దమ్ముంటే నాపై గెలవాలి: నవనీత్ కౌర్ హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేసి నెగ్గాలని ఆయనకు సవాలు విసిరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4..ఇక డ్రైవింగ్ ‘పరీక్ష’ లేదు! ఇకపై లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో నిర్దేశిత శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందితే చాలు.. రవాణా శాఖ కార్యాలయం డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5..వర్ష సూచన.. ఆ సమయంలో ఇళ్లలోంచి బయటకు రాకండి పరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.. భార్యతో యశ్ కలిసి నటించిన సినిమా.. ఇప్పుడు తెలుగులో కేజీఎఫ్’ ఫేమ్ యశ్ ‘రారాజు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహేష్ రావు దర్శకత్వంలో యశ్, రాధికా పండిట్ జంటగా నటించిన చిత్రం ‘సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్’. కె.మంజు నిర్మించిన ఈ కన్నడ చిత్రాన్ని ఇప్పుడు ‘రారాజు’ పేరుతో పద్మావతి పిక్చర్స్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7..చావు నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్ ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రెవిస్ హెడ్, అతని భార్య జెస్సికా డేవిస్ తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8..రుణ రేట్లకు రెక్కలు రిజర్వ్ బ్యాంకు కీలక రెపో రేటు పెంపు తర్వాత బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రైవేటురంగ గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన బెంచ్‌మార్క్ లెండింగ్ (రుణాలు) రేట్లను 30 బేసిస్ పాయింట్లు (0.30 శాతం) పెంచుతున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.ఒక్కసారి కాదు.. ఏకంగా 26 సార్లు ఎవరెస్టు ఎక్కేశాడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైన అధిరోహించాలన్నది ఎందరో పర్వతారోహకుల కల. అలాంటిది, నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా ఎవరెస్టును ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 26 సార్లు అధిరోహించాడు! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10..siddaramaiah: డబ్బులిచ్చి సీఎం పదవి కొన్న బొమ్మై: సిద్ధు సంచలన ఆరోపణలు ర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎన్నికైన సీఎం కాదని, సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారనివిమర్శించారు. ఈ మేరకు బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బొమ్మై నియామకం వెనుక భారీగా డబ్బులు చేతులు మారిందన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1.. హైదరాబాద్‌లో ఏరో, ఫార్మా వర్సిటీలు! రాష్ట్రంలో ఏరోనాటికల్, ఫార్మా విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఇటీవల ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2.. Vontimitta: కమనీయం.. సీతారాముల కల్యాణం పండు వెన్నెల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కమనీయంగా, కనులపండువగా జరిగింది. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయం సమీపంలో అత్యంత సుందరంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కల్యాణ వేదికలో ఈ వేడుక సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. 3.. హార్దిక్‌కు ‘ఆప్’ ఆహ్వానం కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గుజరాత్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం పలికింది. ‘‘ఆయన సొంతగానే పెద్ద నాయకుడిగా ఎదిగారు. అలాంటి నాయకులు మాకు కావాలి. 4.. Russia-Ukraine war: మాస్క్వా మునిగింది గురువారం భారీగా దెబ్బతిన్న రష్యా ప్రఖ్యాత యుద్ద నౌక మాస్క్వా చివరకు సముద్రంలో మునిగిపోయింది. దెబ్బతిన్న నౌకను దగ్గరలోని నౌకాశ్రయానికి తరలిస్తుండగా మధ్యలోనే మునిగిపోయినట్లు రష్యా ప్రకటించింది. 5.. పదేళ్లలో సరిపడా వైద్యులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో దేశంలో వైద్యుల కొరత తీరిపోనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఫలితంగా వచ్చే పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు అందివస్తారని చెప్పారు. 6.. IPL 2022: ఐపీఎల్లో ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా! ఐపీఎల్లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించిన తొలి ఆటగాడిగా ఫించ్ నిలిచాడు. ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగి ఫించ్ ఐపీఎల్లో అత్యధికంగా తొమ్మిది జట్లకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 7.. ఐటీ కంపెనీలకు యుద్ధం సెగ ఉక్రెయిన్–రష్యా సంక్షోభ ప్రభావం భారత ఐటీ కంపెనీలనూ తాకుతోంది. ప్రత్యక్షంగా భారత ఐటీ కంపెనీలపై పడే ప్రభావం కంటే పరోక్ష ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఐరోపా ప్రాంతంలోని క్లయింట్లు ఐటీపై చేసే వ్యయాలను తగ్గించుకోవడం లేదా వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొని ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 8.. Shruti Haasan: మీ లిప్ సైజ్ ఎంత ?.. శ్రుతి హాసన్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సెషన్‌ను నిర్వహించింది శ్రుతి హాసన్. ఈ సెషన్లో శ్రుతి హాసన్‌కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. ఈ సెషన్లో ఓ నెటిజన్ శ్రుతి హాసన్‌ను 'మీ పెదాల సైజు ఎంత?' అని అడిగాడు. ఈ ప్రశ్నకు ధీటుగా స్పందించింది శ్రుతి హాసన్. 9.. వేసవిలో ఈ జావలు తాగితే శరీర ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు బోలెడు ప్రయోజనాలు మన వంటింట్లో దొరికే కొన్ని రకాల పిండి దినుసులతో జావచేసుకోని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందడంతోపాటు, శరీరానికి హాని చేసే వేడి కూడా ఇట్టే తగ్గిపోతుంది. నిమిషాల వ్యవధిలో ఎంతో రుచికరమైన జావలను ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. 10.. బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదంటూ.. ‘నేను ఇవాళ రాత్రి 8 గంటలకు దుర్గంచెరువు కేబుల్ మీది నుంచి దూకుతున్నాను. నేను చావడం డ్రగ్స్ అడిక్ట్ వల్లనో, అమ్మాయి వల్లనో కాదు. నేను మరీ అంత చీప్ కాదు. బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదు’అంటూ ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు -
Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1.సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ సింగపూర్ కాబోయే ప్రధాన మంత్రిగా ఆ దేశ ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్ అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని లీ హిసీన్ లూంగ్ వారసుడిగా అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) అధ్యక్షుడిగా వాంగ్ గురువారం పార్టీ ఎంపిక చేసింది. 2. సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 3. ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అరగంటకో ఎంఎంటీఎస్ ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. కొద్దిరోజులుగా నగరంలోని అన్ని మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎంఎంటీఎస్ సర్వీసులను గణనీయంగా పెంచారు. 4. IPL 2022: హార్ధిక్ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు! ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ విజయంలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. అయితే రాజస్తాన్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన హార్ధిక్ పాండ్యా.. కేవలం మూడు బంతులు మాత్రమే వేసి ఫీల్డ్‌ను విడిచి పెట్టాడు. 5. 'కేజీఎఫ్' అభిమానులకు గుడ్ న్యూస్.. పార్ట్-3 కూడా? కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. అయితే 'కేజీఎఫ్2'కి చివరిలో కొనసాగింపుగా 'కేజీఎఫ్3' కూడా ఉండబోతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 6. Elon Musk: ఏకంగా ట్విటర్‌నే దక్కించుకోవాలని ప్లాన్, కానీ.. సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఇంక్‌పై ఎలన్ మస్క్ కన్నేశారు. ఇప్పటికే 9.1 శాతం వాటా కలిగిన మస్క్ తాజాగా కంపెనీ టేకోవర్‌కు ఆఫర్ ప్రకటించారు. షేరుకి 54.2 డాలర్ల చొప్పున నగదు రూపంలో చెల్లించనున్నట్లు తెలియజేశారు. 7. Tempus Law Associates: న్యాయ మార్గదర్శనం అది 1988. బెంగళూరులో ఉన్న ‘నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ’లో అప్పుడే ప్రవేశ పెట్టిన ఐదేళ్ల న్యాయశాస్త్రం కోర్సులో చేరింది ఓ అనంతపూరమ్మాయి. 1993 తొలి బ్యాచ్ బయటకు వస్తున్న వేడుకలవి. ఐదు బంగారు పతకాలతో కాలేజ్ టాపర్‌గా నిలిచింది అదే అమ్మాయి. 8.బంపర్ ఆఫర్: రూపాయికే లీటర్ పెట్రోల్ వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. 9. Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. 10. ‘మంచు’కొస్తోందా..? కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియాలో కమలా పండ్లు గడ్డకట్టిపోయేంత స్థాయిలో మంచు కురిసింది. అలాగే ఆఫ్రికాలోని సహారా ఎడారిపై మంచు దుప్పటిలా పరుచుకుంది. అసాధారణ రీతిలో కొన్నిచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఇంకొన్ని చోట్ల వెన్ను వణికించే స్థాయిలో చల్లదనం కనిపించాయి కూడా. -
ఆటోమేషన్.. జాబ్ ఆఫర్లు అపారం!
డిజిటలైజేషన్.. ఆటోమేషన్.. ఇప్పుడు అన్ని రంగాల్లో వినిపిస్తున్న మాట! మానవ ప్రమేయం తగ్గించి ఆటోమేషన్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకోసం రోబోటిక్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మొదలు తయారీ వరకు.. అన్ని రంగాల్లో రోబో ఆధారిత సేవలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా.. రోబోటిక్స్ రంగం యువతకు కొలువుల వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. రోబోటిక్స్ కొలువులు, తాజా ట్రెండ్స్, అవసరమైన నైపుణ్యాలు, అందుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. కొన్నేళ్ల క్రితం వరకు మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమల్లోనే ఇండస్ట్రియల్ రోబోల వినియోగం ఉండేది. క్రమేణా ఇది ఇతర రంగాల్లోకి దూసుకొస్తోంది. ఇప్పుడు ఐటీ, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, డిఫెన్స్,స్పేస్ టెక్నాలజీ తదితర విభాగాల్లో సైతం రోబో ఆధారిత కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లోని ఐటీ సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ద్వారా కార్యకలాపాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకోసం ఆర్పీఏ నైపుణ్యాలున్న వారిని నియమించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అందుకే ఆటోమేషన్ డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా మానవ ప్రమేయం తగ్గించొచ్చని సంస్థలు భావిస్తున్నాయి. అందుకోసం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లను వినియోగించాలనే ఆలోచన చేస్తున్నాయి. అంటే.. వ్యక్తులు చేయాల్సిన అనేక కార్యకలాపాలు రోబోల ద్వారా నిర్వహిస్తారు. నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–పది మంది చేసే పనిని ఒక్క రోబో ద్వారా వేగంగా పూర్తిచేయొచ్చు. ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వైపు దృష్టిపెడుతున్నాయి. కొత్త కొలువులు ► ముఖ్యంగా ఇటీవల కాలంలో ఐటీ విభాగంలో ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఐటీ అనుబంధ విభాగంగా పేర్కొనే బీపీఓలో చాట్ బోట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ పేరుతో రోబో ఆధారిత సేవలు అందించాలని సాఫ్ట్వేర్ సంస్థలు భావిస్తున్నాయి. ► సంస్థలు నిర్దిష్టంగా ఏదైనా ఒక విభాగంలో రోబోటిక్ సేవలు అందించాలని భావిస్తే.. దానికి సరితూగే విధంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ వంటివి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోబోల తయారీ, నిర్వహణ, నియంత్రణకు మానవ నైపుణ్యం తప్పనిసరి. పది లక్షల ఉద్యోగాలు ► నాస్కామ్,బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–2022నాటికి రోబోటిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ► ఐటీ బీపీఓ రంగంలో 2022 నాటికి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ఆధారిత సేవలు 70శాతం మేర పెరగనున్నాయి. దీనికి తగ్గట్టుగా 2022 చివరి నాటికి లక్షల ఉద్యోగాలు ఆర్పీఏ, రోబోటిక్స్ విభాగాల్లో లభించనున్నాయని అంచనా. nఒక్క భారత్‌లోనే 2022 నాటికి ఆటోమేషన్ విభాగంలో దాదాపు మూడు లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి. నైపుణ్యాలు రోబోటిక్స్ విభాగంలో కొలువులు అందుకోవాలంటే.. నిర్దిష్టంగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్; నానో టెక్నాలజీ; డిజైన్ అండ్ టెక్నాలజీ; సంబంధిత కోర్ స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగంలో రోబోటిక్స్ విభాగంలో రాణించాలంటే.. రోబోల రూపకల్పనకు అవసరమైన స్పీచ్ రికగ్నిషన్, వాయిస్ రికగ్నిషన్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. అదే విధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలు కూడా రోబోటిక్ రంగంలో రాణించేందుకు ఉపయోగపడతాయి. కారణం..రోబోల రూపకల్పన, నిర్వహణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా ఉండటమే. ఈ రోబోలకు డిమాండ్ ఇండస్ట్రియల్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్; హెల్త్‌కేర్ రోబోట్స్, హాస్పిటాలిటీ రోబోట్స్, లాజిస్టిక్స్ రోబోట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. వీటిలోనూ సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్ మోషన్ ప్లానింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్,ఏఐ అండ్ రోబోటిక్స్ విభాగాలు మరింత కీలకంగా మారుతున్నాయి. జాబ్ ప్రొఫైల్స్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ లేదా రోబోటిక్స్ స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు.. రోబోటిక్స్ టెక్నీషియన్స్, రోబోట్ డిజైన్ ఇంజనీర్, రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీర్స్, సీనియర్ రోబోటిక్స్ ఇంజనీర్స్, ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్, అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, రోబోటిక్ సిస్టమ్ ఇంజనీర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. ఈ ఉద్యోగాల్లో నియమితులైన వారికి సంస్థ స్థాయి, కార్యకలాపాల ఆధారంగా రూ.మూడు లక్షల నుంచి రూ. పది లక్షల వరకూ వార్షిక వేతనం లభిస్తోంది. స్కిల్స్‌కు మార్గం ► ఇప్పుడు అకడమిక్ స్థాయి నుంచే రోబోటిక్స్ నైపుణ్యాలు పొందే వీలుంది. ► ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లు.. బీటెక్ స్థాయిలోనే రోబోటిక్స్‌ను మైనర్‌గా అందిస్తున్నాయి. ► ఎంటెక్ స్థాయిలో రోబోటిక్స్ స్పెషలైజేషన్‌తో పూర్తి స్థాయి ప్రోగ్రామ్‌లను సైతం పలు ఇన్స్టిట్యూట్లు అందిస్తున్నాయి. ► ఎంటెక్‌లో మెడికల్ రోబోటిక్స్; సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోట్ మోషన్ ప్లానింగ్; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్; ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ స్పెషలైజేషన్లు అభ్యసించడం ద్వారా ఆర్పీఏ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ► ఏఐసీటీఈ సైతం రోబోటిక్స్, ఏఐ విభాగాలకు సంబంధించిన స్కిల్స్ అందించేలా కరిక్యులం రూపొందించాలని అనుబంధ కళాశాలలకు మార్గనిర్దేశం చేసింది. ► వీటితోపాటు సీమెన్స్, రోబోటిక్స్ ఆన్లైన్, సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్, రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్ వంటి పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేషన్ కోర్సులు ► రోబోటిక్స్‌లో పూర్తి స్థాయి కోర్సులు అభ్యసించే అవకాశం లేని విద్యార్థులకు మూక్స్ విధానంలో పలు సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేసుకుని నిర్ణీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా జాబ్ మార్కెట్లో పోటీ పడే అవకాశం లభిస్తుంది. పలు సంస్థలు రోబోటిక్స్ సర్టిఫికేషన్స్ అందిస్తున్నాయి. అవి.. ► రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్: వెబ్సైట్: www.onlinerobotics.com ► రోబో జీనియస్ అకాడమీ: వెబ్సైట్: www.robogenious.in ► రోబోటిక్స్ ఆన్లైన్: వెబ్సైట్: www.robotics.org ► సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్: వెబ్సైట్: www.isa.org రోబోటిక్స్.. ముఖ్యాంశాలు ► రోబోటిక్ ఇంజనీరింగ్ విభాగంలో.. వచ్చే ఏడాది చివరికి ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మేర పెరగనున్న నియామకాలు. ► పీడబ్ల్యూసీ, నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదికల ప్రకారం–వచ్చే ఏడాది చివరికి పది లక్షల ఉద్యోగాలు. ► అంతర్జాతీయంగా లక్షల కొలువులు లభిస్తాయని పలు సర్వేల అంచనా. ► రోబోటిక్ జాబ్స్ అందించడంలో మూడో స్థానంలో భారత్. ► ఈ విభాగాల్లో కనిష్టంగా రూ.మూడు లక్షలు, గరిష్టంగా రూ.10–12 లక్షల వార్షిక వేతనం. ► రోబోటిక్ ఇంజనీర్లు, డెవలపర్స్‌కు సగటున నెలకు రూ.50వేల నుంచి రూ.80వేల వేతనం లభిస్తోంది. ► బ్యాంకింగ్, హెల్త్‌కేర్ వంటి సర్వీస్ సెక్టార్లలో నెలకు రూ.60వేల వరకు వేతనం ఖాయం. n సాఫ్ట్వేర్, ప్రొడక్షన్, మెకానికల్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్, మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో అధిక శాతం నియామకాలు. ఇదే మంచి అవకాశం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కార్యకలాపాలు పెరుగుతూ..దానికి సంబంధించిన విభాగాల్లో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. యువత దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలి. సంబంధిత నైపుణ్యాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. రోబోలతో ఉద్యోగాలు తగ్గుతాయన్న మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. – ప్రొ.కె.మాధవ కృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్, ఐఐఐటీ–హైదరాబాద్ -
వణికించే చలిలో వేడెక్కిన రాజకీయం
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలి వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల ఫలితాలు మాత్రం అందరికీ మంచి వేడి పుట్టిస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం అందకుండా అక్కడ ఎన్నికల ఫలితాల సరళి కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన సమయంలో కొంతవరకు ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీ ముందంజలో ఉన్నట్లు కనిపించినా.. తర్వాత ఫలితాల సరళి గణనీయంగా మారిపోయింది. అక్కడ మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 86 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెల్లడయ్యాయి. వాటిలో పీడీపీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే ముందుండగా, బీజేపీ 22 చోట్ల ముందుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 19 చోట్ల, కాంగ్రెస్ 15 స్థానాల్లోను ముందడుగు వేశాయి. ఇతరులు మరో 7 చోట్ల తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇలా ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి కనిపిస్తోంది. ఈసారి అక్కడ హంగ్ అసెంబ్లీ తప్పదన్న జోస్యం మాత్రం నిజమవుతోంది. -
హెయిర్ అండ్ స్పా
ప్రస్తుతం హెయిర్‌స్టైల్స్‌లో లేటెస్ట్ ట్రెండ్స్ అనేకం వస్తున్నాయని, ఎప్పటికప్పుడు తమని తాము అప్డేట్ చేసుకునే స్టైలిస్ట్‌లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుందని టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి అన్నారు. ఫిలింనగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన అలెగ్జాండర్ హెయిర్ బ్యూటీ లాంజ్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 75 ఏళ్లుగా ఈ రంగంలో సేవలు అందిస్తున్న అలెగ్జాండర్ బ్రాండ్ సినీరంగంలో అనేక మందికి చిరపరిచితమైన పేరన్నారు. ఇక రాష్ట్రంలోనే తొలిసారి కిడ్స్ కోసం స్పెషల్‌గా ఏర్పాటు చేసిన స్పాను సినీ నటుడు శ్రీకాంత్ తనయుడు రోహిత్ ప్రారంభించాడు. -
మోడ్రన్ టచ్... ట్రెడిషనల్ లుక్
బాలీవుడ్ ఫ్యాషన్ బాద్షా మనీష్ మల్హోత్రా సిటీలో మహిళలకు లేటెస్ట్ ట్రెండ్స్‌పై మెళకువలు నేర్పాడు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సోమాజిగూడ హోటల్ పార్క్ హయత్‌లో ‘ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ సిటీ ఆన్ చేంజింగ్ ఫాకేడ్ ఆఫ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా’ అంశంపై ప్రసంగించాడు. ‘ఎంతో మంది బాలీవుడ్ తారల డ్రెస్‌లు రూపొందించా. మైకేల్ జాక్సన్ భారత్ వచ్చినప్పుడు కూడా అతని డ్రెస్ డిజైన్ చేశా. ప్రతి ఒక్కరూ అందమైన వారే. మనల్ని మనం ఇంకాస్త అందంగా తీర్చిదిద్దుకోవడంలోనే ఆనందం ఉంటుంది. 25 ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నా. దాదాపు 1,000 సినిమాలకు కాస్టూమ్స్ డిజైన్ చేశా. ఇకపై సినిమాలకు తగ్గించి, సామాన్యుల కోసం డిజైన్ చేస్తా. మోడ్రన్ టచ్‌తో ట్రెడిషనల్ లుక్ మిస్సవ్వకుండా డిజైన్ చేస్తే ఏ డ్రెస్ అయినా అద్భుతంగా ఉంటుంది. నగరంలోని ఆడవారు ఫ్యాషన్‌పై మక్కువ చూపుతున్నారు. ఇది శుభపరిణామం’ అంటూ ‘సిటీ ప్లస్’తో తన అనుభవాలు పంచుకున్నాడు మనీష్. - సిరి -
అరారుుష్ ఎగ్జిబిషన్
లేటెస్ట్ ట్రెండ్స్, ఎత్నిక్ వేర్ కలెక్షన్లతో కొలువుదీరే ఒకరోజు ఎగ్జిబిషన్ ఇది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్లో ఈ రోజు ఉదయుం 10 గంటలకు. దేశంలో పేరొందిన డిజైనర్లు ఇందులో తవు డిజైన్లను ప్రదర్శిస్తారు. సుష్టుగా భోంచేసిన తర్వాత కవ్ముని కిళ్లీ వేసుకుంటే ఆ వుజాయే వేరు. అలాంటి అద్వితీయు అనుభవం పొందాలంటే భాగ్యనగరి నలుచెరగులా ఓ లుక్కేయూల్సిందే. విభిన్న రుచులు, వేర్వేరు ఫ్లేవర్లతోయ ఆకట్టుకునే పాన్లు హైదరాబాద్‌కే సొంతం. షాన్‌దార్ పాన్లకు కేరాఫ్ అడ్రస్ ఇది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 80 వెరైటీల పాన్లు దొరుకుతారుుక్కడ. వీటిలోనూ చాక్లెట్ పాన్, మీనాక్షి పాన్, ఖర్జూర్ పాన్, కుల్ఫీ పాన్లు వెరీ పాపులర్. ఢిల్లీ స్పెషల్‌గా భావించే ఐస్‌క్రీమ్ పాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో బాగా హల్చల్ చేస్తోంది. వేసవిలో భోజనానంతరం ఈ కిళ్లీ వేసుకోకుంటే అసంపూర్తి భోజనం చేసినట్టే భావించేవారూ ఉన్నారు. కొబ్బరి, సుపారి, వక్కపొడి, జాజికాయు వేసిన సంప్రదాయు కిళ్లీలు ఏ వీధిలోనైనా దొరుకుతారుు. కానీ సరికొత్త ఇన్గ్రీడియుంట్స్తో సపరేట్గా చేసే పాన్లు కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఇలాంటిదే జూబ్లీహిల్స్ ‘పాన్ ప్యాలెస్’. 25 ఏళ్ల కిందట ఓ చిన్న బడ్డీ కొట్టులా ఆరంభమైన ఈ షాప్... ఇప్పుడు పాన్ ప్యాలెస్‌గా వూరిందంటే... భాగ్యనగరవాసులు ఇక్కడి కిళ్లీలను ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మెుత్తం 78 రకాల పాన్లు ఇందులో దొరుకుతారుు. ‘కస్టవుర్లకు నచ్చేలా పాన్లు ప్యాక్ చేయుడం వూ స్పెషాలిటీ’ అంటారు దీని యుజవూని శ్రీనివాస్. అధికంగా అవుు్మడుపోయేవి... అన్ని వయుసుల వారూ వేసుకొనే విభిన్న పాన్లలో కుల్ఫీ, ఖజూర్, చాక్లెట్ పాన్లది ప్రత్యేకత. కుల్ఫీ పాన్: మీగడ, పంచదార, కోవా, సోంపు, గుల్కంద్, ఏలకుల పొడి ఇందులో ఉపయోగిస్తారు. ఖజూర్ పాన్: ఖర్జూరాలు, కొబ్బరిపొడి, కొబ్బరిపాలు, ఏలకులపొడి, రోజ్‌ఎసెన్స్, గుల్కంద్, సోంపు వాడతారు. చాక్లెట్ పాన్: దీని తయారీలో కిస్మిస్, జీడి పలుకులు, కరిగించిన చాక్లెట్, గుల్కంద్, పాలు వాడతారు. విశేషమేంటే... ‘తీపి తీపిగా రుచులూరే ఈ పాన్లలో పొగాకు వాడరు. అన్ని వయసుల వారు తినొచ్చు. పిల్లలు, మహిళలు వీటిని ఇష్టపడతారు. స్థానికంగా మాత్రమే కాదు, విదేశాలకూ ఈ పాన్లు సిటీ నుంచి ఎగువుతి అవుతున్నారుు’ అని చెప్పారు శ్రీనివాస్. -
లేడీస్.. స్పెషల్
లేటెస్ట్ ట్రెండ్స్‌తో నిర్వహించిన ‘ఫ్యాషన్ యూత్ర’ సిటీజనులకు వినూత్న వెరైటీలను పరిచయుం చేసింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో సోషలైట్ కామినీ షరాఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఫ్యాషన్ లవర్స క్యూ కట్టారు. దుస్తులు, జ్యువెలరీ, ఫుట్‌వేర్, డెకార్స్, యాక్సెసరీస్ వంటి ఐటమ్స్‌తో స్టాల్స్ కొలువుదీరాయి. - ఈ ప్రదర్శనలో పాల్గొన్నవారంతా మహిళలే. ఈసారి ఏర్పాటు చేసిన డిజైనర్ ఉత్పత్తుల ప్రదర్శనలో 67 స్టాల్స్ అన్నీ మహిళలవే. - ఫిలిప్పీన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఆల్చిప్పలతో రూపొందిన మ్యూజికల్ సెట్స్, గౌతమ్‌బుద్ధ వంటి అలంకరణ వస్తువులు ఆకట్టుకున్నాయి. ముంబై నుంచి వచ్చిన మరో వ్యాపారి.. సౌదీ అరేబియా నుంచి తెచ్చిన డ్రైఫ్రూట్స్‌తో చేసిన స్వీట్స్ టేస్టీగా ఉన్నారుు. తిబర్‌మాల్ జ్యువెలర్స్‌కు చెందిన పంకజ్గుప్తా డిజైన్ చేసిన ఆభరణాలతో మోడల్స్ వావ్ అనిపించారు. ఇంకా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ కాని, ఇటలీకి చెందిన ఒక బ్రాండ్ కంపెనీ తొలిసారి తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. - పేజ్ త్రీ ప్రవుుఖులు వినీతాపిట్టి, నీరాశారెన్, పింకీరెడ్డి, హీరో వెంకటేష్ సతీవుణి నీరజ, నిర్మాత సురేష్‌బాబు సతీవుణి లక్ష్మి షాపింగ్ చేశారు. - ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేసే నాన్హి కలి, హెల్ప్, పీఎఫ్‌ఏలకు అందజేస్తారు. - ‘ఇది తొమ్మిదో ఏడాది. వచ్చే ఏడాది మరింత డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నా. సామాజిక ప్రయోజనం కోసం చేస్తున్న ఈ కార్యక్రవుం విజయువంతం కావడం సంతోషంగా ఉంది’ అని నిర్వాహకురాలు కామినీ షరాఫ్ చెప్పారు. - శిరీష చల్లపల్లి ఫొటోలు: సృజన్ పున్నా