1.. Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా పాశవికం
రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడులను ఉధృతం చేస్తోంది. సామాన్య పౌరులు తలదాచుకున్న శిబిరాలను కూడా వదిలిపెట్టకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది. లుహాన్‌స్క్ ప్రావిన్స్‌లోని బిలోహోరివ్‌కా గ్రామంలో ఓ పాఠశాలపై శనివారం రష్యా జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో జనం మరణించినట్లు స్థానిక గవర్నర్ సెర్హీ హైడే ప్రకటించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2.. రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న... ఎంపీల ఓటు విలువ
ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ 700కు పడిపోనుంది. గతంలో ఇది 708గా ఉండేది. 83 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3.. ఉద్ధవ్‌కు దమ్ముంటే నాపై గెలవాలి: నవనీత్ కౌర్
హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేసి నెగ్గాలని ఆయనకు సవాలు విసిరారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4..ఇక డ్రైవింగ్ ‘పరీక్ష’ లేదు!
ఇకపై లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్‌లో నిర్దేశిత శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందితే చాలు.. రవాణా శాఖ కార్యాలయం డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయనుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5..వర్ష సూచన.. ఆ సమయంలో ఇళ్లలోంచి బయటకు రాకండి
పరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6.. భార్యతో యశ్ కలిసి నటించిన సినిమా.. ఇప్పుడు తెలుగులో
కేజీఎఫ్’ ఫేమ్ యశ్ ‘రారాజు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహేష్ రావు దర్శకత్వంలో యశ్, రాధికా పండిట్ జంటగా నటించిన చిత్రం ‘సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్’. కె.మంజు నిర్మించిన ఈ కన్నడ చిత్రాన్ని ఇప్పుడు ‘రారాజు’ పేరుతో పద్మావతి పిక్చర్స్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7..చావు నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రెవిస్ హెడ్, అతని భార్య జెస్సికా డేవిస్ తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8..రుణ రేట్లకు రెక్కలు
రిజర్వ్ బ్యాంకు కీలక రెపో రేటు పెంపు తర్వాత బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రైవేటురంగ గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన బెంచ్‌మార్క్ లెండింగ్ (రుణాలు) రేట్లను 30 బేసిస్ పాయింట్లు (0.30 శాతం) పెంచుతున్నట్టు ప్రకటించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9.ఒక్కసారి కాదు.. ఏకంగా 26 సార్లు ఎవరెస్టు ఎక్కేశాడు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైన అధిరోహించాలన్నది ఎందరో పర్వతారోహకుల కల. అలాంటిది, నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా ఎవరెస్టును ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 26 సార్లు అధిరోహించాడు!
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10..siddaramaiah: డబ్బులిచ్చి సీఎం పదవి కొన్న బొమ్మై: సిద్ధు సంచలన ఆరోపణలు
ర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎన్నికైన సీఎం కాదని, సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారనివిమర్శించారు. ఈ మేరకు బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బొమ్మై నియామకం వెనుక భారీగా డబ్బులు చేతులు మారిందన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment