జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలి వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల ఫలితాలు మాత్రం అందరికీ మంచి వేడి పుట్టిస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం అందకుండా అక్కడ ఎన్నికల ఫలితాల సరళి కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన సమయంలో కొంతవరకు ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీ ముందంజలో ఉన్నట్లు కనిపించినా.. తర్వాత ఫలితాల సరళి గణనీయంగా మారిపోయింది.
అక్కడ మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 86 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెల్లడయ్యాయి. వాటిలో పీడీపీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే ముందుండగా, బీజేపీ 22 చోట్ల ముందుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 19 చోట్ల, కాంగ్రెస్ 15 స్థానాల్లోను ముందడుగు వేశాయి. ఇతరులు మరో 7 చోట్ల తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇలా ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి కనిపిస్తోంది. ఈసారి అక్కడ హంగ్ అసెంబ్లీ తప్పదన్న జోస్యం మాత్రం నిజమవుతోంది.
వణికించే చలిలో వేడెక్కిన రాజకీయం
Published Tue, Dec 23 2014 10:00 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement