1.సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్
సింగపూర్ కాబోయే ప్రధాన మంత్రిగా ఆ దేశ ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్ అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని లీ హిసీన్ లూంగ్ వారసుడిగా అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) అధ్యక్షుడిగా వాంగ్ గురువారం పార్టీ ఎంపిక చేసింది.
2. సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
3. ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అరగంటకో ఎంఎంటీఎస్
ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. కొద్దిరోజులుగా నగరంలోని అన్ని మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎంఎంటీఎస్ సర్వీసులను గణనీయంగా పెంచారు.
4. IPL 2022: హార్ధిక్ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు!
ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ విజయంలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. అయితే రాజస్తాన్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన హార్ధిక్ పాండ్యా.. కేవలం మూడు బంతులు మాత్రమే వేసి ఫీల్డ్‌ను విడిచి పెట్టాడు.
5. 'కేజీఎఫ్' అభిమానులకు గుడ్ న్యూస్.. పార్ట్-3 కూడా?
కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. అయితే 'కేజీఎఫ్2'కి చివరిలో కొనసాగింపుగా 'కేజీఎఫ్3' కూడా ఉండబోతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
6. Elon Musk: ఏకంగా ట్విటర్‌నే దక్కించుకోవాలని ప్లాన్, కానీ..
సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఇంక్‌పై ఎలన్ మస్క్ కన్నేశారు. ఇప్పటికే 9.1 శాతం వాటా కలిగిన మస్క్ తాజాగా కంపెనీ టేకోవర్‌కు ఆఫర్ ప్రకటించారు. షేరుకి 54.2 డాలర్ల చొప్పున నగదు రూపంలో చెల్లించనున్నట్లు తెలియజేశారు.
7. Tempus Law Associates: న్యాయ మార్గదర్శనం
అది 1988. బెంగళూరులో ఉన్న ‘నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ’లో అప్పుడే ప్రవేశ పెట్టిన ఐదేళ్ల న్యాయశాస్త్రం కోర్సులో చేరింది ఓ అనంతపూరమ్మాయి. 1993 తొలి బ్యాచ్ బయటకు వస్తున్న వేడుకలవి. ఐదు బంగారు పతకాలతో కాలేజ్ టాపర్‌గా నిలిచింది అదే అమ్మాయి.
8.బంపర్ ఆఫర్: రూపాయికే లీటర్ పెట్రోల్
వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు.
9. Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్‌ఆర్‌ఐటి, గౌతమ్ కాలేజి
‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి.
10. ‘మంచు’కొస్తోందా..?
కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియాలో కమలా పండ్లు గడ్డకట్టిపోయేంత స్థాయిలో మంచు కురిసింది. అలాగే ఆఫ్రికాలోని సహారా ఎడారిపై మంచు దుప్పటిలా పరుచుకుంది. అసాధారణ రీతిలో కొన్నిచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఇంకొన్ని చోట్ల వెన్ను వణికించే స్థాయిలో చల్లదనం కనిపించాయి కూడా.
Comments
Please login to add a commentAdd a comment