Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌ | Top 10 Telugu Latest Current News Morning Headlines Today 16th April 2022 10AM | Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Sat, Apr 16 2022 10:00 AM | Last Updated on Sat, Apr 16 2022 10:29 AM

Top 10 Telugu Latest Current News Morning Headlines Today 16th April 2022 10AM - Sakshi

1.. హైదరాబాద్‌లో ఏరో, ఫార్మా వర్సిటీలు! 
రాష్ట్రంలో ఏరోనాటికల్, ఫార్మా విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రిని ఇటీవల ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

2.. Vontimitta: కమనీయం.. సీతారాముల కల్యాణం
పండు వెన్నెల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కమనీయంగా, కనులపండువగా జరిగింది. వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయం సమీపంలో అత్యంత సుందరంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కల్యాణ వేదికలో ఈ వేడుక సాగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. 

3.. హార్దిక్‌కు ‘ఆప్‌’ ఆహ్వానం
కాంగ్రెస్‌ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గుజరాత్‌ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్‌ పటేల్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆహ్వానం పలికింది. ‘‘ఆయన సొంతగానే పెద్ద నాయకుడిగా ఎదిగారు. అలాంటి నాయకులు మాకు కావాలి.

4.. Russia-Ukraine war: మాస్క్‌వా మునిగింది
గురువారం భారీగా దెబ్బతిన్న రష్యా ప్రఖ్యాత యుద్ద నౌక మాస్క్‌వా చివరకు సముద్రంలో మునిగిపోయింది. దెబ్బతిన్న నౌకను దగ్గరలోని నౌకాశ్రయానికి తరలిస్తుండగా మధ్యలోనే మునిగిపోయినట్లు రష్యా ప్రకటించింది. 

5.. పదేళ్లలో సరిపడా వైద్యులు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో దేశంలో వైద్యుల కొరత తీరిపోనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఫలితంగా వచ్చే పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు అందివస్తారని చెప్పారు. 

6.. IPL 2022: ఐపీఎల్‌లో ఆరోన్‌ ఫించ్‌ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా!
ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించిన తొలి ఆటగాడిగా ఫించ్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున బరిలోకి దిగి ఫించ్‌ ఐపీఎల్‌లో అత్యధికంగా తొమ్మిది జట్లకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా  గుర్తింపు పొందాడు.

7.. ఐటీ కంపెనీలకు యుద్ధం సెగ
ఉక్రెయిన్‌–రష్యా సంక్షోభ ప్రభావం భారత ఐటీ కంపెనీలనూ తాకుతోంది. ప్రత్యక్షంగా భారత ఐటీ కంపెనీలపై పడే ప్రభావం కంటే పరోక్ష ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఐరోపా ప్రాంతంలోని క్లయింట్లు ఐటీపై చేసే వ్యయాలను తగ్గించుకోవడం లేదా వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొని ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

8.. Shruti Haasan: మీ లిప్‌ సైజ్‌ ఎంత ?.. శ్రుతి హాసన్‌ స్ట్రాంగ్ కౌంటర్‌..
ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌' సెషన్‌ను నిర్వహించింది శ్రుతి హాసన్‌. ఈ సెషన్‌లో శ్రుతి హాసన్‌కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. ఈ సెషన్‌లో ఓ నెటిజన్‌ శ్రుతి హాసన్‌ను 'మీ పెదాల సైజు ఎంత?' అని అడిగాడు. ఈ ప్రశ్నకు ధీటుగా స్పందించింది శ్రుతి హాసన్.

9..  వేసవిలో ఈ జావలు తాగితే శరీర ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు బోలెడు ప్రయోజనాలు
మన వంటింట్లో దొరికే కొన్ని రకాల పిండి దినుసులతో జావచేసుకోని తాగడం వల్ల  శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందడంతోపాటు, శరీరానికి హాని చేసే వేడి కూడా ఇట్టే తగ్గిపోతుంది. నిమిషాల వ్యవధిలో ఎంతో రుచికరమైన జావలను ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

10.. బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదంటూ.. 
‘నేను ఇవాళ రాత్రి 8 గంటలకు దుర్గంచెరువు కేబుల్‌ మీది నుంచి దూకుతున్నాను. నేను చావడం డ్రగ్స్‌ అడిక్ట్‌ వల్లనో, అమ్మాయి వల్లనో కాదు. నేను మరీ అంత చీప్‌ కాదు. బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదు’అంటూ ఓ ఇంటర్‌ విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement