అరారుుష్ ఎగ్జిబిషన్
లేటెస్ట్ ట్రెండ్స్, ఎత్నిక్ వేర్ కలెక్షన్లతో కొలువుదీరే ఒకరోజు ఎగ్జిబిషన్ ఇది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్‌లో ఈ రోజు ఉదయుం 10 గంటలకు. దేశంలో పేరొందిన డిజైనర్లు ఇందులో తవు డిజైన్లను ప్రదర్శిస్తారు.
సుష్టుగా భోంచేసిన తర్వాత కవ్ముని కిళ్లీ వేసుకుంటే ఆ వుజాయే వేరు. అలాంటి అద్వితీయు అనుభవం పొందాలంటే భాగ్యనగరి నలుచెరగులా ఓ లుక్కేయూల్సిందే. విభిన్న రుచులు, వేర్వేరు ఫ్లేవర్లతోయ ఆకట్టుకునే పాన్‌లు హైదరాబాద్‌కే సొంతం. షాన్‌దార్ పాన్‌లకు కేరాఫ్ అడ్రస్ ఇది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 80 వెరైటీల పాన్‌లు దొరుకుతారుుక్కడ. వీటిలోనూ చాక్లెట్ పాన్, మీనాక్షి పాన్, ఖర్జూర్ పాన్, కుల్ఫీ పాన్‌లు వెరీ పాపులర్. ఢిల్లీ స్పెషల్‌గా భావించే ఐస్‌క్రీమ్ పాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో బాగా హల్‌చల్ చేస్తోంది. వేసవిలో భోజనానంతరం ఈ కిళ్లీ వేసుకోకుంటే అసంపూర్తి భోజనం చేసినట్టే భావించేవారూ ఉన్నారు. కొబ్బరి, సుపారి, వక్కపొడి, జాజికాయు వేసిన సంప్రదాయు కిళ్లీలు ఏ వీధిలోనైనా దొరుకుతారుు. కానీ సరికొత్త ఇన్‌గ్రీడియుంట్స్‌తో సపరేట్‌గా చేసే పాన్‌లు కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఇలాంటిదే జూబ్లీహిల్స్ ‘పాన్ ప్యాలెస్’. 25 ఏళ్ల కిందట ఓ చిన్న బడ్డీ కొట్టులా ఆరంభమైన ఈ షాప్... ఇప్పుడు పాన్ ప్యాలెస్‌గా వూరిందంటే... భాగ్యనగరవాసులు ఇక్కడి కిళ్లీలను ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మెుత్తం 78 రకాల పాన్‌లు ఇందులో
దొరుకుతారుు. ‘కస్టవుర్లకు నచ్చేలా పాన్‌లు ప్యాక్ చేయుడం వూ స్పెషాలిటీ’ అంటారు దీని యుజవూని శ్రీనివాస్. అధికంగా అవుు్మడుపోయేవి... అన్ని
వయుసుల వారూ వేసుకొనే విభిన్న పాన్‌లలో కుల్ఫీ, ఖజూర్, చాక్లెట్ పాన్‌లది ప్రత్యేకత. కుల్ఫీ పాన్: మీగడ, పంచదార, కోవా, సోంపు, గుల్కంద్, ఏలకుల పొడి ఇందులో ఉపయోగిస్తారు. ఖజూర్ పాన్: ఖర్జూరాలు, కొబ్బరిపొడి, కొబ్బరిపాలు, ఏలకులపొడి, రోజ్‌ఎసెన్స్, గుల్కంద్, సోంపు వాడతారు. చాక్లెట్ పాన్: దీని తయారీలో కిస్‌మిస్, జీడి పలుకులు, కరిగించిన చాక్లెట్, గుల్కంద్, పాలు వాడతారు.
విశేషమేంటే... ‘తీపి తీపిగా రుచులూరే ఈ పాన్‌లలో పొగాకు వాడరు. అన్ని వయసుల వారు తినొచ్చు. పిల్లలు, మహిళలు వీటిని ఇష్టపడతారు. స్థానికంగా మాత్రమే కాదు, విదేశాలకూ ఈ పాన్‌లు సిటీ నుంచి ఎగువుతి అవుతున్నారుు’ అని చెప్పారు శ్రీనివాస్.