లవ్ ఇండియా
దేశాన్ని ప్రేమించడం అంటే నలుగురికీ సాయపడడమేనని, మనసుంటే ఫ్యాషన్‌ను సైతం చారిటీకి మార్గంగా మలచడం సాధ్యమేననే సందేశ నేపథ్యంలో సాగిన లవ్ ఇండియా షో ఆకట్టుకుంది. లఖోటియా ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌ిసీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ షోలో 44 మంది విద్యార్థులు రూపొందించిన సరికొత్త డిజైన్లను మోడల్స్ ప్రదర్శించారు.
ముంబైకి చెందిన సెలబ్రిటీ ఫ్యాషన్ గురు జేమ్స్ ఫెరీరా పర్యవేక్షణలో సాగిన ఈ షో... అటు కలర్స్ ఇటు ఫ్యాబ్రిక్స్‌లో...కొత్త పుంతలు తొక్కిన డిజైనింగ్ ప్రతిభకు అద్దం పట్టింది. షోలో ప్రదర్శించిన దుస్తుల విక్రయంతో వచ్చిన ఆదాయాన్ని పనాహ్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే వృద్ధుల సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని లఖోటియా ఫౌండేషన్ నిర్వాహకులు అజహర్, ఆయేషాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా లఖోటియా రూపొందించిన కెరీర్-ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.