మదాలస & కో
చిట్‌చాట్: మగువ అందాన్ని రెట్టింపు చేసే నగలంటే తనకు ఎంతో ఇష్టం అని వగలుపోతోంది బాలీవుడ్ నటి మదాలస శర్మ. తనకే కాదు ఆడవాళ్లందరికీ ఆభరణాలంటే ప్రాణమేనని చెబుతున్నారామె. పండుగ వేళల్లో జ్యువెలరీ షాపింగ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేదే లేదని చెబుతోంది ఈ మిస్. సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్ మానేపల్లి జ్యువెలర్స్‌లో ధన్‌తెరాస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హీరోయిన్లు మదాలస శర్మ, శామిలి, శ్వేతా జాదవ్, సమోనియా తళుక్కుమన్నారు. వెరైటీ డిజైన్లు ధరించి మెరిసిపోయారు.
మార్కెట్‌లోకి నయాట్రెండ్ జ్యువెలరీ వస్తే వదిలిపెట్టేది లేదన్న మదాలస తన ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘తెలుగులో ఫిట్టింగ్ మాస్టర్‌తో నటిగా మొదలైన నా ప్రయాణం బాలీవుడ్ సినిమాల్లో నటించే వరకు వెళ్లింది. సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా చేశాను. టాలీవుడ్‌లో ఆలస్యం అమృతం, మేం వయసుకు వచ్చాం సినిమాల్లో చేశాను. అవకాశం వస్తే టాలీవుడ్ స్క్రీన్‌పై కనిపించడానికి ఎప్పటికీ సిద్ధమే..’ అని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ గురించి చెబుతూ.. ‘ఈ బ్యూటిఫుల్ సిటీకి వస్తే.. ఇక్కడి వంటకాలు టేస్ట్ చేయనిదే వెళ్లను. షాపింగ్‌లో కూడా సిటీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్’ అని అంటోంది. ప్రజెంట్ పంజాబీ సినిమా పటియాల డ్రీమ్ మూడీలో రీతూ, సామ్రాట్ అండ్ కో అనే బాలీవుడ్ మూవీలో డింపీ సింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నానని తెలిపింది. అన్ని పండుగలు మస్తీగా సెలబ్రేట్ చేసుకుంటానంటున్న మదాలస.. దీపావళికి కాస్త జోష్ ఎక్కువగానే ఉంటుంద ంటోంది. దివాలి షాపింగ్ కూడా పూర్తయిందని చిట్‌చాట్ ముగించింది.
- సాక్షి, సిటీ ప్లస్