Madalasa Sharma
-
బెయిల్‌పై వచ్చి పెళ్లి చేసుకున్న నటుడి కొడుకు
అర్థాంతరంగా పీటల మీదే ఆగిపోయిన బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం మంగళవారం ఊటిలో జరిగింది. ఓ యువతిని రేప్ చేసి, మోసం చేసిన కేసులో కోర్టు ఆదేశాలతో మహాక్షయ్ను విచారణ చేయడం కోసం పోలీసులు గత శనివారం ఊటీలోని వివాహ వేదిక వద్దకు చేరుకోవడంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే యువతిని అత్యాచారం చేసిన కేసులో కోర్టు మహాక్షయ్‌కు బెయిల్ మంజూరు చేయడంతో తన ప్రియురాలు, దక్షిణాది నటి అయిన మదాలస శర్మను ఈ నెల 7న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. అనంతరం మంగళవారం(ఈ రోజు) తమిళనాడు ఊటిలోని తన విలాసవంతమైన హోటల్లో సాంప్రదాయబద్దంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే మహాక్షయ్, అతని తల్లి యోగిత మీద నమోదైన కేసును విచారించిన ఢిల్లీలోని ఓ కోర్టు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని యోగిత, మహాక్షయ్లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ వీరి విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. -
మిథున్ చక్రవర్తి కొడుకుతో హీరోయిన్ పెళ్లి
సాక్షి, ముంబై : బాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సోనమ్ కపూర్, నేహా ధూపియాలు గత నెలలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ కూడా త్వరలోనే బాలీవుడ్ దర్శకుడిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మరో హీరోయిన్ మదాలస శర్మ కూడా తన వివాహ తేదీని ప్రకటించేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ చక్రవర్తితో జూలై 7న తన వివాహం జరగనున్నట్లు మదాలస శర్మ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మదాలస.. ‘మూడేళ్లుగా నేను, మహాక్షయ్ రిలేషన్షిప్లో ఉన్నాం. మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో ఈ విషయాన్ని చెప్పగానే వారేమీ ఆశ్చర్యపోలేదు. వారి అంగీకారంతోనే మార్చి నెలలో మహాక్షయ్ ఇంట్లో మా ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకే ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోవచ్చు. అయితే మా వివాహం ఎక్కడ జరుతుందనేది ఇంకా నిర్ణయించలేదు కానీ కచ్చితంగా ముంబైలో మాత్రం జరగదు. డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం’ అంటూ చిరునవ్వులు చిందించారు. కాగా 2008లో ‘జిమ్మీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహాక్షయ్‌కు.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ప్రస్తుతం పెద్దగా అవకాశాలేమీ రావడం లేదు. అదే విధంగా 2011లో ‘ఏంజెల్’ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన మదాలస.. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. -
మదాలస & కో
చిట్‌చాట్: మగువ అందాన్ని రెట్టింపు చేసే నగలంటే తనకు ఎంతో ఇష్టం అని వగలుపోతోంది బాలీవుడ్ నటి మదాలస శర్మ. తనకే కాదు ఆడవాళ్లందరికీ ఆభరణాలంటే ప్రాణమేనని చెబుతున్నారామె. పండుగ వేళల్లో జ్యువెలరీ షాపింగ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేదే లేదని చెబుతోంది ఈ మిస్. సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్ మానేపల్లి జ్యువెలర్స్‌లో ధన్‌తెరాస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హీరోయిన్లు మదాలస శర్మ, శామిలి, శ్వేతా జాదవ్, సమోనియా తళుక్కుమన్నారు. వెరైటీ డిజైన్లు ధరించి మెరిసిపోయారు. మార్కెట్లోకి నయాట్రెండ్ జ్యువెలరీ వస్తే వదిలిపెట్టేది లేదన్న మదాలస తన ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘తెలుగులో ఫిట్టింగ్ మాస్టర్‌తో నటిగా మొదలైన నా ప్రయాణం బాలీవుడ్ సినిమాల్లో నటించే వరకు వెళ్లింది. సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా చేశాను. టాలీవుడ్లో ఆలస్యం అమృతం, మేం వయసుకు వచ్చాం సినిమాల్లో చేశాను. అవకాశం వస్తే టాలీవుడ్ స్క్రీన్‌పై కనిపించడానికి ఎప్పటికీ సిద్ధమే..’ అని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ గురించి చెబుతూ.. ‘ఈ బ్యూటిఫుల్ సిటీకి వస్తే.. ఇక్కడి వంటకాలు టేస్ట్ చేయనిదే వెళ్లను. షాపింగ్‌లో కూడా సిటీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్’ అని అంటోంది. ప్రజెంట్ పంజాబీ సినిమా పటియాల డ్రీమ్ మూడీలో రీతూ, సామ్రాట్ అండ్ కో అనే బాలీవుడ్ మూవీలో డింపీ సింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నానని తెలిపింది. అన్ని పండుగలు మస్తీగా సెలబ్రేట్ చేసుకుంటానంటున్న మదాలస.. దీపావళికి కాస్త జోష్ ఎక్కువగానే ఉంటుంద ంటోంది. దివాలి షాపింగ్ కూడా పూర్తయిందని చిట్‌చాట్ ముగించింది. - సాక్షి, సిటీ ప్లస్