శ్రద్ధగా సన్నద్ధం..
మనిషిగా ఎదిగినా...మనసు పెరగనివారు. చుట్టూ ప్రపంచం ఉన్నా... దాన్ని అర్థం చేసుకోలేని అమాయుకులు. వయుసు వచ్చినా... మానసిక పరిపక్వత లేని వారందరినీ ఒక చోట చేర్చి... వారికి నాట్యంలో తర్ఫీదునిస్తోంది బేగంపేట్‌లోని ‘శ్రద్ధ’ వొకేషనల్ సెంటర్. స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రదర్శించేందుకు వీరికి ఇక్కడ దేశభక్తిని ప్రతిబింబించే నాట్యాన్ని నేర్పిస్తున్నారు నర్తకి, చిల్డ్రన్ కౌన్సెలర్ అశ్రీత వేముగంటి. ఒక్కసారి ఆ సెంటర్‌కు వెళితే... అశ్రీతతో కలిసి రిహార్సల్స్ చేస్తున్న చిన్నారుల ఉత్సాహం కనిపిస్తుంది. డ్యాన్స్‌పై వారికున్న మక్కువా అర్థవువుతుంది. ఒకరికి మించి ఒకరు పోటీ పడటం చూస్తుంటే తనకెంతో వుుచ్చటేస్తుందని అంటారు అశ్రీత. ‘గడ్డాలు, మీసాలు వచ్చినా వాళ్లు ఆరు నెలల పసిపాపలే.
వూనసికంగా ఎదగకపోరుునా వారిలో నేర్చుకోవాలన్న తపన నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అన్నీ బాగున్నవాళ్ల కంటే కూడా మెరుగ్గా వీరు వుుద్రలు, స్టెప్స్ గుర్తుపెట్టుకొంటున్నారు. వీరిలో ఎంతో ప్రతిభ ఉంది’ అన్నారు అశ్రీత. ఐదు నుంచి నలభై ఏళ్ల వూనసిక వికలాంగులకు జీవించడానికి అవసరమైన విద్యాబుద్ధులు నేర్పిస్తున్న వొకేషనల్ సెంటర్ శ్రద్ధ.