న్యూఇయర్‌.. సన్నీ.. నైట్ | New year.. Sunny .. Night | Sakshi
Sakshi News home page

న్యూఇయర్‌.. సన్నీ.. నైట్

Published Wed, Dec 31 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

న్యూఇయర్‌.. సన్నీ.. నైట్

న్యూఇయర్‌.. సన్నీ.. నైట్

వణికించే చలిగాలులు ఆమె దూకుడుకు వేడెక్కాయి. ఆమె ఓరచూపులు కుర్రకారును కిర్రెక్కించాయి. జగద్విఖ్యాత సెక్సిణి సన్నీ లియోన్ ఒంపు సొంపుల సోయగాలను ఆరబోస్తూ, హొయల్ వగల్ ఒలికిస్తూ వేసిన చిందులు కుర్రాళ్ల గుండెల్లో పొగలు పుట్టించాయి. జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెబుతూ, పాత ఏడాదికి సెండాఫిస్తూ.. బుధవారం రాత్రి సన్నీ ప్రదర్శించిన నృత్య విన్యాసాలకు యంగ్‌తరంగాలు ఉర్రూతలూగాయి.
 
బిఫోర్ షో: శృంగార తార సన్నీలియోన్ బుధవారం రాత్రి తన షోకు ముందు మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు వచ్చింది. షో వివరాలను ఆమె మీడియాకు వెల్లడిస్తారని నిర్వాహకులు చెప్పారు. అయితే, అభిమానులు ఆమెను చూసేందుకు పెద్దసంఖ్యలో ఎగబడటంతో.. ఆమె ‘హాయ్’ చెబుతూ అటు నుంచి అటే వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement