చీకటి జీవోలతో ప్రజలకు తిప్పలు | Problems to People with dark GOs | Sakshi
Sakshi News home page

చీకటి జీవోలతో ప్రజలకు తిప్పలు

Published Wed, Dec 3 2014 12:59 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

చీకటి జీవోలతో ప్రజలకు తిప్పలు - Sakshi

చీకటి జీవోలతో ప్రజలకు తిప్పలు

 రెవెన్యూ సబ్ డివిజన్ నివేదిక ఉంటేనే వ్యవసాయు భూములను, లేఅవుట్ అప్రూవల్ ఉంటేనే ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్  చేయాలని, లేని పక్షంలో తిరస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే ఉరుములేని పిడుగులా ఉత్తర్వులు ఇవ్వడం దారుణం. ఈ చీకటి జీవో యజమానుల భూ విక్రయ హక్కులను హరించే ప్రయత్నమే.
 
 అధికారం కోసం ఎన్నికల ముందు చెప్పిన పార దర్శకతకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తూట్లుపొడుస్తోంది. అధికారం చేపట్టిన ఆరునెలల కాలంలోనే చీకటి పాలనకు తెరతీసింది. తన మనసులోని చీకటి వ్యూహాల అమలు కోసం గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే నల్లజీవోలు జారీ చేస్తోంది. రాజధాని భూ సమీకరణకు అనుసరించే విధివిధానాలు, భూములిచ్చే రైతులకు వాటాపై ఇప్పటి వరకూ ఏమాత్రం స్పష్టత ఇవ్వకుండానే క్యాపిటల్ డెవలప్‌మెంట్ రీజియున్ అథారిటీ (సీడీ ఆర్‌ఏ) ఏర్పాటు చేసి ఈ ప్రాంత భూములు మొత్తంపై ఈ సంస్థకు సర్వాధికారాలు అప్పగిస్తూ ఇప్పటికే ముసాయిదా రూపొందించడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో రైతులు భూములు అమ్ముకునేందుకు (రిజిస్ట్రేషన్ చేయుడానికి) రెవెన్యూ అనుమతి తప్పనిసరి చేస్తూ గతనెల 28వ తేదీన రెవెన్యూశాఖ జారీ చేసిన చీకటి జీవో 398 ప్రభుత్వ నిరంకుశ వైఖరికి మరో ప్రత్యక్ష నిదర్శనం. రెవెన్యూ శాఖ నుంచి సబ్ డివిజన్ నివేదిక లేకపోతే వ్యవసాయ భూములు, లేఅవుట్ అప్రూవల్ లేక పోతే ఇళ్లస్థలాల విక్రయ రిజిస్ట్రేషన్లను తిరస్కరించాలంటూ జారీ చేసిన ఈ ఉత్తర్వు అత్యంత దుర్మా ర్గమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భూ యజమానులుగా రైతులకున్న భూ విక్రయ హక్కులను కొల్లగొట్టే ఉత్తర్వు.

 యజమానుల హక్కులను కాలరాయుడమే...
 రెవెన్యూ సబ్ డివిజన్ నివేదిక ఉంటేనే వ్యవసాయు భూములు, లేఅవుట్ అప్రూవల్ ఉంటేనే ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్  చేయాలని, లేనిపక్షంలో తిరస్క రించాలని రాత్రికి రాత్రే ఉరుములేని పిడుగులా ఉత్తర్వులు ఇవ్వడం ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధం కాదు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్స్ తీసుకెళ్లి తాము అమ్మిన భూమిని కొనుగోలు దారుల పేరిట రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసు కుంటే సర్వే నంబర్ల వారీగా  భూముల వివరాలు ఉన్న ‘వెబ్‌ల్యాండ్’ (ప్రభుత్వ పోర్టర్)తో దానిని సరిచూసి అన్నీ సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ అధి కారులు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది మొన్నటి వరకూ అమల్లో ఉన్న విధానం. ఇందులో ఎలాంటి లోపం లేదు. అయినా సవరణ పేరిట ప్రభుత్వం ఎందుకు చీకటి జీవో జారీచేసి యజమానుల విక్రయు హక్కు లను హరించే ప్రయుత్నం చేసిందో అర్థం కావడం లేదని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల అధి కారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.  దీని వల్ల గత నాలుగు రోజులుగా రిజిస్ట్రేషన్లు ఆగిపో యాయి. దీంతో అత్యవసరాల కోసం  భూములు, స్థలాలు అమ్ముకోవాలనుకున్న రైతులు, కష్టపడి సం పాదించిన డబ్బుతో ఎకరానో అరకెరానో, చిన్న ఇంటి స్థలమో కొనుగోలు చేయాలనుకున్న పేద, మధ్యతరగతి ప్రజలు పడుతున్న కష్టాలు కోకొల్లలు.

 ఆడబిడ్డల పెళ్లి,  పిల్లల ఉన్నత చదువులు, పెద్ద పెద్ద జబ్బులవల్ల అనుకోకుండా వచ్చిపడే వైద్య ఖర్చులు లాంటి అత్యవసరాల కోసం విధి లేని పరిస్థితుల్లోనే  పేద, మధ్యతరగతి రైతులు తవు పొలాలను అమ్ముకుంటుంటారు. కొనుగోలు దారులు కొంత అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంటు కుదు ర్చుకుని నిర్దిష్ట కాలంలో పూర్తి మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేరుుంచుకుంటారు. అత్యవసర సమయాల్లో తక్కువ ధరకైనా తక్షణమే విక్రయించే వారూ ఉంటారు. అరుుతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ నల్ల జీవోవల్ల ఇలా వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం లేకుండా పోయింది. అమ్మకం అగ్రిమెంటు గడువు ముగుస్తున్న వారు ఇప్పుడు వచ్చిన జీవోతో చాలా ఇబ్బంది పడుతు న్నారు.  రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి సబ్ డివి జన్ నివేదిక అడిగితే తమకేమీ ఇలాంటి ఆదేశాలు లేవని చెబుతున్నారు. అన్నదమ్ములు భాగ పరిష్కా రం కోసం సబ్ డివిజన్‌కు చేసిన దరఖాస్తులే సర్వే యుర్ల కొరతవల్ల నెలల తరబడి పేరుకుని ఉండిపో తున్నారుు. ఇప్పుడు భూమి విక్రరుుంచేందుకు వచ్చే వారందరికీ సబ్ డివిజన్ నివేదికలు ఇవ్వా లంటే రెవెన్యూ యంత్రాంగం సరిపోదు. పట్టా దారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసిన వారికి (పౌరసేవాపత్రం ప్రకారం 45 రోజుల్లో ఇవ్వాలి) వుూడు నెలలైనా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ నుంచి సబ్ డివిజన్ నివేది కలు తెచ్చుకుని భూములు అమ్ముకోవడం రైతు లకు అత్యవసర సమయాల్లో అయ్యేపనికాదు.  అడ్వాన్సు ఇచ్చిన తర్వాత భూములు, స్థలాల ధరలు పెరుగుతుంటారుు. ఇలాంటి సమయాల్లో పెరిగిన ధరలకు ఆశపడి అగ్రిమెంటు రద్దుకావా లని ఆశపడే వారూ ఉంటారు. సబ్ డివిజన్ నివే దిక రాలేదంటూ కాలయాపన చేసి గడువు ముగి యగానే రిజిస్ట్రేషన్ చేసేందుకు తిరస్కరిస్తే అడ్వా న్సు ఇచ్చిన వారు నష్టపోతారు. ఇలా ఈ నల్ల జీవో వల్ల భూ యజమానులకేకాకుండా కొనుగోలు దారులకూ నష్టమే.  

 వారి పరిస్థితి ఏమిటి?
 గ్రామీణ ప్రాంతాల్లో డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), నగరాల్లో పట్టణాభివృ ద్ధి సంస్థలు అప్రూవ్ చేసిన లేఅవుట్లనే రిజిస్ట్రేషన్ చేయాలని, వీటి నుంచి లేఅవుట్ అప్రూవల్ లేని ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయరాదని ఈ నల్ల జీవోలో ప్రభుత్వం పేర్కొంది. రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుని ఇలాంటి ఉత్తర్వు ఇవ్వడం ఏమా త్రం సమంజసం కాదు. అనువుతి లేని లేఅవు ట్లలో స్థలాల కొనుగోలు కోసం అడ్వాన్సు ఇచ్చిన పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏమిటనే విషయన్ని ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు. ప్రజలకు ముందుగా తెలియుజేసి కొంత సమయం ఇచ్చిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎవరూ తప్పుబట్టడానికి వీలుండదు. అనధికారిక లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు దశాబ్దాలుగా కొనసాగుతు న్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రే ఉత్త ర్వులు ఇచ్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ప్రజాస్వా మ్య స్ఫూర్తికి విరుద్ధం. ఒకే లేఅవుట్‌లో ఇప్పటికే కొన్న వారికి విక్రయంచుకునే హక్కు కల్పించి అడ్వాన్సు ఇచ్చిన వారికి మాత్రం కొనుగోలు చేసే హక్కును హరించడం ఏవిధంగానూ న్యాయస మ్మతం కాదు. గ్రామాలు, పట్టణాల్లోనే కాకుండా నగరాల్లో సైతం అనధికారిక లే అవుట్లలో లక్షల సంఖ్యలో ఫ్లాట్లు ఉన్నాయి. అసలు గ్రామాలు, పట్టణాల్లో లేఅవుట్ అప్రూవల్ తీసుకోని స్థలాలే ఎక్కువ. ఇవన్నీ ప్రభుత్వం అంగీకరిస్తున్న విష యాలే. అందువల్లే లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి అపరాధ రుసుంతో అనుమతులు ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అనధికారిక లేఅవుట్లు రాకుండా, పాత లేఅవుట్లలో ప్లాట్లకు లేఅవుట్ రెగ్యులరైజేషన్‌కు ప్రత్యేక అనుమతి ఇవ్వడం ద్వారా సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అలా కాకుం డా లక్షలాది మంది రైతులు, ఇళ్లస్థలాలు కొనేవా రిని సమస్యల సుడిగుండంలోకి నెట్టే ఇంతటి కీలక మైన అంశంపై చీకటి జీవో జారీచేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ఇలాంటి అంశాల్లో స వరణలు చేయాలంటే దీనివల్ల ఏర్పడే సమస్యలు, పరిష్కారమార్గాలపై అన్ని రాజకీయపక్షాలతో చ ర్చించి, అసెంబ్లీలో ఆమోదించి నిర్ణయుంతీసుకో వాలి. అసెంబ్లీలో చర్చిస్తే అన్ని పక్షాలనుంచి సూచ నలు వస్తాయి. తదనుగుణంగా ఆలోచించి నిర్ణ యం తీసుకుంటే ప్రజలకు కష్టాలు ఉండేవి కావు.

 మాటలతో సరి... సవరణ ఉత్తర్వులేవీ?
 చీకటి జీవో జారీపై రైతుల నుంచి  వ్యక్తమైన ఆగ్ర హావేశాలకు జంకిన ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ సబ్ డివిజన్ నివేదిక నుంచి మినహాయింపు ఇచ్చి పాత విధానమే కొన సాగిస్తామని ప్రకటించింది. జీవోలో మరో ప్రధాన అంశమైన లేఅవుట్ అప్రూవల్ తప్పనిసరి అనే నిబంధనను మాత్రం సవరించలేదు. ‘ప్రజల మనోభావాలను గుర్తించి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సబ్ డివిజన్ ధ్రువీక రణ పత్రాలను పొందుపరచాలనే ఆదేశాలను ప్రస్తుతం నిలుపుదల చేస్తున్నాం. ప్రస్తుత పద్ధతి లోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చాం’’  అని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ప్రకటించినా మంగ ళవారం కూడా అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో భూముల రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన రైతులను మంగళవారం కూడా  రెవెన్యూ నుంచి సబ్ డివిజన్ నివేదికలు తెచ్చుకోవాలంటూ సబ్ రిజిస్ట్రార్లు తిప్పిపంపడం గమనార్హం.
 ప్రజలపై ఎలాంటి భారం మోపబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు కూడా నిండకముందే మాట తప్పింది. ప్రజలపై భారం పడరాదనే ఉద్దేశంతోనే స్థిరాస్తుల మార్కెట్ (రిజిస్ట్రేషన్) విలు వలు  పెంచలేదని  ప్రకటించిన ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు తీరా రెండు నెలలు కూడా గడ వకముందే స్టాంపులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏకంగా ఆరు రకాల పన్నులు  పెంచారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్టాంపు డ్యూ టీని 4 నుంచి 5 శాతానికి, రిజిస్ట్రేషన్ ఫీజు రెట్టిం పు చేయడం ద్వారా ప్రజలపై ఏటా రూ.1,600 కోట్ల అదనపు భారం మోపడం ద్వారా చంద్రబా బు మార్కు బాదుడు ఆరంభించారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు పెంచితే రాజధాని ప్రాంతం లో భూసేకరణకు పెద్ద మొత్తంలో రైతులకు పరి హారం చెల్లించాల్సి వస్తుంది. రైతులకు పరిహారం ఎక్కువగా ఇవ్వడం ఇష్టంలేకే రిజిస్ట్రేషన్ విలువల పెంపునకు తిరస్కరించారని ఇప్పుడు ఆయన వివిధ రకాల పన్నులు పెంచడాన్ని బట్టి స్పష్ట వువుతోంది.
 - ఎల్. రఘురామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement