దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలన కెరటమై ఎగిసి దళిత బహుజనుల నాయకుడిగా పేరొం దిన శెట్టి కన్నమరాజా 1939 డిసెంబర్ 12న నెల్లూరులో జన్మిం చారు. తల్లి శెట్టి రత్నమ్మ. తండ్రి శెట్టి వీరయ్య. కన్నమదాసు అసలు పేరు డేవిడ్ రాజు. మాలల మూలపురుషుడు కన్నమదాసు ప్రేర ణగా తీసుకుని పేరు మార్చుకున్నారు. బీఏ వరకు చదివారు. బీఆర్ అంబేద్కర్ స్థాపించిన భారత రిపబ్లికన్ పార్టీలో చేరి సామాన్య కార్యకర్త నుండి గుంటూరు శాఖ అధ్యక్షు డిగా ఎదిగారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి మొన్న కన్ను మూసిన కాకా జి.వెంకటస్వామి ఆత్మీయ అనుచరు లుగా కొనసాగారు.
కారంచేడు దళితుల ఊచకోత ఘటనపై మొదటగా స్పందించి ఘటనా స్థలానికి వెళ్లి గొంతు కలి పాడు. అనేక కాలనీలను స్వయంగా నిర్మించి ఇచ్చారు. దళితుల కోసం ‘పీడితజన’, ‘సాధించు’ వంటి పత్రికలను స్థాపించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సాంఘిక సంస్కర్తగా, రాజకీయ నేతగా, కళాకారుడిగా, పాత్రికేయుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రద ర్శించిన కన్నమరాజా 2007 డిసెంబర్ 24న కన్నుమూశారు.
(నేడు శెట్టి కన్నమరాజా ఏడవ వర్థంతి)
శిఖామణి, హైదరాబాద్