పులి పోయి సింహం వచ్చే..?
‘సింహ’నాదం
మొత్తం 17 రాష్ట్రాలలో పులులు సంచరిస్తాయి. సింహాలు గుజరాత్‌లోనే కనిపిస్తాయి. జాతీయ జంతువుగా ఉన్న బెంగాల్ టైగర్‌ను ఇప్పుడు ఆ స్థానం నుంచి తప్పించడం ఎందుకు?
జాతీయ చిహ్నాలలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్పులు చేయబోతున్నదా? ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన వార్త దీనినే చెబుతోంది. జాతీయ జంతువు పులి స్థానంలో, సింహాన్ని రంగ ప్రవేశం చేయించాలని మోదీ సర్కారుకు ఆలోచన ఉన్నట్టు ఆ వార్త సారాంశం. 1972 నుంచి బెంగాల్ రాయల్ టైగర్ మన జాతీయ మృగం. ఇప్పుడు హఠాత్తుగా పులిని ఎందుకు ఆ స్థానం నుం చి తప్పించాలని అనుకుంటు న్నారు? సమాధానం ఏదైనా, ఈ మార్పు ఫలితంగా మోదీ మరో సారి వివాదంలో పడవచ్చునని పర్యావరణవేత్తల అభిప్రాయం.
సింహాన్ని జాతీయ జంతువుగా ప్రకటించా లని కోరుతూ జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పరిమళ్ నాత్వానీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఒక ప్రతిపాదన పంపించారు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఈ ప్రతిపాదన సంగతి చూడవలసిందని ఆ మంత్రిత్వ శాఖ తన అధీనంలోనే పనిచేసే వన్యప్రాణి జాతీయ బోర్డును ఆదేశించింది. ఈ బోర్డులోని సభ్యులు దాదాపు అంతా గుజరాతీయులే. పర్యావరణమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అంశాన్ని పరిశీలించమని మార్చిలోనే కోరారని బోర్డు సభ్యుడు రమణ్‌కుమార్ వెల్లడిం చారు కూడా. ఈ అంశాన్ని తేల్చడం అంత సుల భం కాదని మరో సభ్యుడు హెచ్ ఎస్ సింగ్ చెబు తున్నారు. ఎందుకంటే, పులులు దేశంలో 17 రాష్ట్రా లలో ఉన్నాయి. సింహాలు ఒక్క రాష్ట్రంలోనే, అదీ గుజరాత్‌లోనే ఉన్నాయి. అంటే ప్రధాని సొంత రాష్ట్రం. నిజానికి ఇండియన్ లైన్, లేదా పర్షియన్ లైన్ అని పిలుచుకునే మన సింహాల జనాభా 1974లో 180కి పడిపోయింది. మళ్లీ 2010కి 411కి పెరిగింది. అంతరించిపోయే తెగల జాబితాలో ఇది కూడా చేరిపోయిన మాట నిజమని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నే చర్ ప్రకటిం చింది కూడా.
జార్ఖండ్ ఎంపీగారి వన్యప్రాణి ప్రేమ ఎలాం టిదో తెలియదు కానీ, 2012లో కూడా ఆయన ఇదే ప్రతిపాదనను యూపీఏ ప్రభు త్వం ముందు ఉంచారు. అప్పు డు పర్యావరణ మంత్రిగా ఉన్న జయంతి నటరాజన్ ఆ ప్రతిపా దన పరిశీలన దశలో కూడా లేదని రాజ్యసభలో ప్రకటిం చారు. ఇప్పుడు జవదేకర్, అలాంటి ప్రతిపా దన ప్రభుత్వం దగ్గర ఏదీ లేదని చెబుతూనే, వన్యప్రాణి జాతీయ బోర్డు పరిశీలనలో మాత్రం ఉందని మార్చిలో రాజ్యసభలోనే ప్రకటిం చారు. దేశంలో పులుల సంఖ్య 2,200 కాగా, సింహాలు మాత్రం 411 మాత్రమే ఉన్నాయని, అది కూడా గుజరాత్‌లోని గిర్ ప్రాంతానికే పరిమిత మని చెప్పారు.
సింహానికి భారతీయ జాతీయ జీవనంలో, సంస్కృతిలో, సాహిత్యంలో విశేషమైన స్థానం ఉన్నమాట నిజమే. కానీ పులి సంపాదించుకున్న స్థానం కూడా చిన్నది కాదు. మన పురాణాలు, సాహిత్యం సంగతి సరే, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు తాజ్ మహల్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో పులిని చూడ్డానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. అయితే పర్యావరణ ఉద్యమకారులు చెబు తున్న వాదన మరో విధంగా ఉంది. పులుల సం రక్షణా కేంద్రాల దగ్గర కూడా పరిశ్రమల నిర్మాణా లకి అనుమతి ఇవ్వడం కోసమే ఇలాంటి ప్రతిపా దనను మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకువస్తున్న దని వారు అంటున్నారు.