వాతావరణ్ ఫిల్మ్ ఫెస్టివల్
పర్యావరణ సమస్యలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం 2002లో ఏర్పాటైన ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫోరమ్... సీఎంఎస్ వాతావరణ్. పర్యావరణం, వణ్యప్రాణుల సంరక్షణపై 26 రాష్ట్రాల్లోని 30 నగరాల్లో 39 ట్రావెలింగ్ ఫెస్టివల్స్ నిర్వహించింది. అలాగే ఇప్పటివరకు ఏడు కాంపిటేటివ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా జరిపింది.
ఈ ఏడాది అక్టోబర్ 9 నుంచి 12 వరకు ‘వాటర్ ఫర్ లైఫ్’ అంశంపై ఎనిమిదవ ఫిల్మ్ ఫెస్టివల్ దిల్లీలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఎడిషన్ కోసం 11 కేటగిరీల్లో ఔత్సాహికులైన ఇండియన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ఎంట్రీలకు ఆహ్వానం పలుకుతోంది. ఎంట్రీలు పంపించాల్సిన చివరి తే ది మార్చ్ 22. ఎంట్రీ ఫాం, ఇతర వివరాలు సంస్థ వెబ్‌సైట్ www.cmsvatavaran.org చూడొచ్చు.