బాదం కట్! | Blouse cuts to Badham Cut | Sakshi
Sakshi News home page

బాదం కట్!

Published Sun, Apr 24 2016 12:43 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

బాదం కట్! - Sakshi

బాదం కట్!

లేడీస్ టైలర్
చీర కట్టు చూస్తే ముందు వైపే కాదు, వెనుక కూడా గొప్పగా ఉండాలి. ఈ మార్పు ‘కట్టు’లో కాకుండా ‘కట్’లో చూపించాలనేదే డిజైనర్ల తాపత్రయం. అందుకే, బ్లౌజ్ కట్స్‌లో ‘బ్యాక్’ డిజైన్స్ వందల సంఖ్యలో వెలిగిపోతున్నాయి. వాటిలో ముందు వరుసలో ఉన్న నెక్ ప్యాటర్న్ ‘బాదం కట్!’
 
ఈ బ్యాక్ నెక్ లైన్ డిజైన్ బాదం గింజ ఆకృతిలో ఉంటుంది కనుకనే దీనికి ‘బాదం కట్’ అనే పేరు వచ్చింది. బోట్‌నెక్ ముందు-వెనుక నెక్‌లైన్ మెడకు దగ్గరగా ఉంటుంది. అదే బాదం నెక్‌కి అయితే ముందు భాగంలో రౌండ్ కట్ వస్తుంది. వెనుక వైపు మెడ దగ్గర ఓపెన్ ఉంటుంది. మెడ మీదుగా రెండు విడి భాగాలను కలపడానికి అదే రంగు క్లాత్‌తో తాడులా కుట్టి, చివరలో హ్యాంగింగ్స్‌ను వేలాడదీస్తారు. బ్లౌజ్ ధరించినప్పుడు ఈ రెండు తాళ్లనూ కలిపి ముడివేస్తారు. బ్యాక్ నెక్ ఓపెన్ కట్ చతుర స్రాకారం, త్రికోణాకారం, రౌండ్... ఇలా వందల రకాల డిజైన్స్‌ని సృష్టించారు డిజైనర్స్.
 
బ్లౌజ్ మార్కింగ్ ఉదాహరణకు:
* 34 ఛాతి చుట్టుకొలత గలవారి నమూనా బ్లౌజ్‌ను మార్క్ చేసి, కట్ చేద్దాం.
* పేపర్‌చార్ట్‌ను నిలువుగా, తిరిగి మధ్యకు మడవాలి.
* ముందు భాగం (భుజం నుంచి - నడుం వరకు నిలువుగా) స్టాండర్డ్ లెంగ్త్ 14 1/2 అంగుళాలు ఉండేలా చూసి మార్క్ చేయాలి. అలాగే వెనుకభాగం 13 అంగుళాలు కొలిచి మార్క్ చేయాలి.
* నడుము చుట్టుకొలత (ఛాతికి కింది భాగం) ముందు భాగం 14, వెనుకభాగం 14 అంగుళాలు ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇది మొత్తం 28 అంగుళాలు ఉండేలా మార్క్ చేసుకోవాలి.
* భుజాల పై భాగం (చంక నుంచి మెడ వరకు) 6 1/2 అంగుళాలు.
* షార్ట్ స్లీవ్స్ (పొట్టి చేతులు) అయితే 4 అంగుళాలు.
* ఆర్మ్ హోల్ (చంకభాగం) - 8 1/2 (ముందు ఔ మార్క్ డ్రా చేసి అటు తర్వాత గుండ్రటి వంపు తీసుకోవాలి)
* ఛాతి భాగం వద్ద డార్ట్స్ డ్రాఫ్టింగ్ పాయింట్స్ డ్రా చేయాలి.
 
నెక్ భాగం...
* వెనుక వైపు నెక్ డీప్‌గా కిందివైపు వంపుగా వస్తుంది. ఈ సైజు ముందు మెడ భాగం నుంచి - 10 1/2 అంగుళాలు మార్క్ చేయాలి. (భుజం దగ్గర నుంచి కిందకు కర్వ్ తీసుకుంటూ మార్క్ చేయాలి) ఫ్రంట్ నెక్ 8 1/2 అంగుళాలు కొలిచి, మార్క్ చేయాలి.
 
కట్ చేద్దాం...
* కొలతల ప్రకారం చాప్‌స్టిక్ మార్క్ మీదుగా తేడా లేకుండా కట్ చేయాలి.
* ముందువైపు చెస్ట్ పార్ట్ మధ్యకు డ్రా చేసి, సమంగా కట్ చేయాలి. అంటే, 34 లో సగం 17 అంగుళాల కొలత తీసుకొని కట్ చేయాలి.
* కొలతలు తీసుకున్న ప్రకారం భుజాలు, చంకభాగం, డ్రాఫ్ట్ పాయింట్స్, చేతులు కట్ చేయాలి.
* వెనుక వైపు డీప్ నెక్ కొలత తీసుకున్నదాని ప్రకారం మెడ నుంచి కిందవైపుగా కర్వ్ లైన్ వచ్చేలా కట్ చేయాలి. ఇది పూర్తిగా బాదం కట్ షేప్ వస్తుంది.
 
జాకెట్ క్లాత్‌ను కట్ చేయడం ఇలా!
* ఎంచుకున్న జాకెట్ క్లాత్‌ను పేపర్ మడిచిన విధంగానే నిలువుగా మధ్యకు మడవాలి. దానిని తిరిగి మధ్యకు మడిచి టేబుల్ మీద ముడతలు లేకుండా సరిచేయాలి.
* దీని మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాలను ఉంచాలి.
* దీని ప్రకారం క్లాత్‌ను జాగ్రతగా కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా 1 1/2 అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి).
* కొలతల ప్రకారం మార్క్ చేసుకున్నదాని మీదుగా కుట్టు అటూ ఇటూ కాకుండా జాగ్రత్తపడుతూ స్టిచ్ చేయాలి.
* బ్యాక్‌నెక్ బాదం కట్‌కి హెమ్మింగ్ అవసరం లేకుండా పైపింగ్ చేయడం వల్ల నెక్‌లైన్ అందంగా, నీటుగా వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement