పరహింస పరాయణ చంద్రశ్రీ | Choodalani Vundi movie song | Sakshi
Sakshi News home page

పరహింస పరాయణ చంద్రశ్రీ

Published Sun, Apr 23 2017 1:16 AM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

పరహింస పరాయణ చంద్రశ్రీ

పరహింస పరాయణ చంద్రశ్రీ

‘యమహా నగరి...  కలకత్తా పురి... నమహో హుగిలి హౌరా వారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి’....‘చూడాలని ఉంది’ సినిమాలో కలకత్తా నగర సౌందర్యాన్ని, సంస్కృతిని గొప్పగా ఆవిష్కరించారు వేటూరి. అయితే ఈ  పాట ట్యూన్‌ ఒక గొప్ప కీర్తనకు అనుకరణ అని చాలామందికి తెలియదు. పట్నం సుబ్రమణ్య అయ్యర్‌ కదనకుతూహల రాగంలో...

‘రఘువంశ సుధాంబుది... చంద్ర శ్రీ’ అనే కీర్తనను రచించి, స్వరపరచారు. యం.ఎస్‌.సుబ్బులక్ష్మీ, ఏసుదాస్‌ గొంతులలో ఈ పాటను వినడం గొప్ప అనుభూతి. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలో పెళ్లి చూపుల ఎపిసోడ్‌లో ‘రఘువంశ సుధాంబుది’ పాటకు నరేష్‌ నోటి నుంచి పేరడీ  వినిపిస్తుంది.‘పరహింస... పరాయణ చంద్రశ్రీ... ఆచార సంప్రదాయమా? ఆడపిల్లలకు అపచారమా?’ అనే ఈ పేరడీలో కట్న వ్యవస్థను నిరసించడం కనిపిస్తుంది.

Advertisement
Advertisement