రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ మొదలైంది...
ఆఫీసర్ : మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. సాంకేతిక సమస్య వచ్చి పైన ఫ్యాన్లు పని చేయడం లేదని అనుకుందాం. విపరీతంగా ఉక్కబోస్తుంది. అప్పుడు మీరు ఏంచేస్తారు?
అప్పారావు : కిటికి తెరుస్తాను సార్.
ఆఫీసర్ : గుడ్. కిటికీని ఇంగ్లీష్‌లో ఏమంటారు?
అప్పారావు : విండో
ఆఫీసర్ : గుడ్. క్యాబినెట్ విండో అంటే ఏమిటి?
అప్పారావు : తెలియదు సార్.
ఆఫీసర్ : ఓకే....బేవిండో అంటే?
అప్పారావు : తెలియదు సార్.
ఆఫీసర్ : ఓకే. ఐబ్రో విండో అంటే? సింగిల్–హంగ్ అండ్ డబుల్ హంగ్ విండోస్ అంటే? స్లైడ్ విండో అంటే? మల్టీ లిటిల్ విండో అంటే?
అప్పారావు : తెలియదు సార్.
ఆఫీసర్ : ఓకే...ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో కొన్ని వాక్యాలు చెబుతాను. వాటిని తెలుగులో చెబితే...ఉద్యోగం నీకే...
అప్పారావు : ఓకేసార్. చెప్పండి.
ఆఫీసర్ : బ్రౌజర్ విండో దట్ యూ ఆర్ యూజింగ్ టు వ్యూ ది వెబ్ పేజ్ ఈజ్ ఏ విండో. విండోస్ ఆర్ ఏ యూజర్ టు వర్క్ విత్ మల్టీపుల్ ప్రోగ్రామ్స్...
అప్పారావు : !!!!!!!
ఆఫీసర్ : అదేంటి కంట్లో అంతులేని ఆశ్చర్యాలు కనిపిస్తున్నాయి?
అప్పారావు : అంతా అయోమయంగా ఉంది సార్. కళ్లు తిరుగుతున్నాయి...
ఆఫీసర్ : ఓకే నువ్వెళ్లొచ్చు.
బయట ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నవారు అప్పారావును చుట్టుముట్టారు. ‘ఇంటర్వ్యూలో ఏమడిగారు?’ అంటూ ప్రశ్నల ఎండ కురిపించారు. అప్పుడు అప్పారావు వారితో ఇలా చెప్పాడు...
‘‘ట్రైన్‌ల్లో ఉక్కపోస్తే ఏంచేస్తావు?’’ అని అడిగాడు.
పొరపాటున ‘‘కిటికీ తెరుస్తాను’’ అన్నాను.
అంతే...వాడు నా గుండె తెరిచి ఒక్క ఆట ఆడుకున్నాడు. మిత్రులారా...పొరపాటున కూడా ‘కిటికీ తెరుస్తాను’ అనే మాట ఉపయోగించవద్దు. అలా అన్నారంటే...మీ చావును అర్జంటుగా కొరియర్‌లో తెప్పించుకున్నట్లే. బెస్టాఫ్ లక్’’ అని చెప్పాడు అప్పారావు.
‘సుబ్బారావు... సుబ్బారావు’ అనే పిలువు వినబడడంతో ఇంటర్య్వూ హాల్‌లోకి పరుగెత్తాడు సుబ్బారావు.
ఆఫీసర్ : మీరు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారనుకుందాం. సాంకేతిక సమస్య వల్ల పైన ఫ్యాన్లు పనిచేయడం లేదనుకుందాం. అప్పుడు మీరు ఏంచేస్తారు?
సుబ్బారావు : న్యూస్ పేపర్‌తో అటూ ఇటూ ఊపుకుంటాను సార్.
ఆఫీసర్ : అయినా ఉక్కపోస్తుందనుకో?
సుబ్బారావు : షర్ట్ విప్పుతాను సార్.
ఆఫీసర్ : అయినా ఉక్కపోస్తుందనుకో?
సుబ్బారావు : బనియన్ విప్పుతాను సార్.
ఆఫీసర్ : అయినా ఉక్కపోస్తుందనుకో?
సుబ్బారావు : ప్యాంట్ విప్పుతాను సార్...
ఆఫీసర్ : ట్రైన్లో ఉన్న ప్రయాణికులు పెడబొబ్బలు పెడుతూ పారిపోవాలనా నీ ఉద్దేశం! ఇన్ని చెబుతున్నావు...‘కిటికీ తెరుస్తాను సార్. చల్లగాలి తగులుతుంది’ అనే మాట ఎందుకు అనడం లేదు?
సుబ్బారావు : పొరపాటున కూడా తెరవను సార్.
ఆఫీసర్ : అదేమిటయ్య...కిటకీ తెరిస్తే నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి?
సుబ్బారావు : మీరు తుపాకితో కాల్చి చంపినా సరే...తెరవను సార్...
ఆఫీసర్ : అదిసరే...తుపాకీని ఇంగ్లిష్‌లో ఏమంటారు?
సుబ్బారావు : గన్.
ఆఫీసర్ : గుడ్. లాంగ్‌గన్, వాల్‌గన్, సబ్‌మెషిన్‌గన్, షాట్‌గన్, కంబాట్ షాట్‌గన్, సెమీ–ఆటోమెటిక్ షాట్‌గన్, ఫీల్డ్‌గన్, స్పేర్‌గన్, ఫ్లేర్‌గన్, క్యాప్‌గన్, వాటర్‌గన్...వీటి గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు...
సుబ్బారావు : !!!!!!!
ఆఫీసర్ : అదేమిటి నీ కంట్లో అంతులేని ఆశ్చర్యం కనిపిస్తుంది?
సుబ్బారావు : అయోమయంగా ఉంది సార్.
ఆఫీసర్ : సరే, నేను కొన్ని ఇంగ్లిష్ వాక్యాలు చెబుతాను. వాటిని తెలుగులో చెప్పు చాలు. ఉద్యోగం నీకే ఇస్తాను.
సుబ్బారావు : ఓకే సార్.
ఆఫీసర్ : ఏ గన్ ఈజ్ ఏ రేంజ్‌డ్ వెపన్. దట్ ఆర్ సాలిడ్. బట్ కెన్ ఆల్సో బి లిక్విడ్. ది ఆరిజన్ ఆఫ్ ది ఇంగ్లిష్ వర్డ్ గన్ ఈజ్ కన్సిడర్డ్ ఫ్రమ్ ది నేమ్ గివెన్ టు ఏ పర్టిక్యులర్ హిస్టారికల్ వెపన్. డోమినా గునీల్డ వాజ్ ది నేమ్ మెకానికల్ బోల్ట్ త్రోయింగ్ వెపన్ ఆఫ్....
..... ››...... ..... ... ...... ........
ఆఫీసర్ : అదేంటి బట్టలు చించుకుంటున్నావు. ఇప్పుటి వరకు బానే ఉన్నావు కదా...
(సశేషం)
– యాకుబ్ పాషా
అదేంటి బట్టలు చింపుకుంటున్నావు
Published Sun, Oct 13 2019 9:23 AM | Last Updated on Sun, Oct 13 2019 9:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment