కామెడీ నైట్స్ విత్ అలీ! | Comedy Nights with Ali! | Sakshi
Sakshi News home page

కామెడీ నైట్స్ విత్ అలీ!

Published Sat, Nov 8 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

అలీ

అలీ

కామెడీ నైట్స్ అనగానే కపిల్‌శర్మ గుర్తొస్తాడు. కలర్స్ చానెల్‌లో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ పేరుతో అతడు నిర్వహించే కామెడీ షో... టీఆర్పీ రికార్డులను తిరగరాసింది. కౌన్ బనేగా కరోడ్‌పతి, బిగ్‌బాస్ లాంటి టాప్ రియాలిటీ షోలను వెనక్కి నెట్టేసింది. అలాంటి కామెడీ షో తెలుగులోనూ ఉంటే బాగుణ్ను అనుకున్నారో ఏమో... మాటీవీ వారు ‘అలీ టాకీస్’కి తెర తీశారు.
 
అలీ టాకీస్‌ని కపిల్ కామెడీ నైట్స్‌తో పోల్చడం అవసరమా అంటే, అవును అనాల్సిందే! ఎందుకంటే... రెండు కాన్సెప్టులూ ఒకటే కాబట్టి. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కాబోతున్నప్పుడో, రిలీజ్ అయినప్పుడో ఆ చిత్ర టీమ్‌ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటాడు కపిల్. ఇంటర్వ్యూకి కామెడీని రంగరించి తనదైన స్టయిల్లో అదరగొట్టేస్తాడు. మధ్యలో మరికొన్ని క్యారెక్టర్లు ఎంటరై నవ్వులు పండిస్తుంటాయి. అచ్చు ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిందే అలీ టాకీస్.

అందుకే రెండిటినీ పోల్చాల్సి వచ్చింది. అక్కడ కపిల్ ఎంత ఫేమసో... ఇక్కడ అలీ కూడా అంత ఫేమస్సే. కాబట్టి ఈ షోకి అలీనే పెద్ద ప్లస్ పాయింట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన టైమింగ్‌తో షోని చక్కగా నడిపిస్తున్నాడు. మరి కపిల్ కామెడీ నైట్స్‌లాగే అలీ టాకీస్ కూడా టీఆర్పీ రికార్డులను బద్దలు కొడుతుందేమో చూద్దాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement