Devil's food Cake మీకూ ఇష్టమేనా? | do you like devil's food cake ? | Sakshi
Sakshi News home page

Devil's food Cake మీకూ ఇష్టమేనా?

Published Sun, Jan 12 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

Devil's food Cake మీకూ ఇష్టమేనా?

Devil's food Cake మీకూ ఇష్టమేనా?

 భాషణం
  రుచికరమైన ఆహార పదార్థాలను భుజిస్తున్నప్పుడు కలిగే సంతృప్తిని మాటల్లో చెప్పలేం. అందుకేనేమో చేతల్లో చూపిస్తుంటాం! అయితే ఆ చేతల్ని ఫుడ్డును తగ్గించాల్సి వచ్చినప్పుడు మాత్రం చూపించలేం. మాటలకే పరిమితం అవుతాం. మనుషులకు గానీ, ఇతర ప్రాణులకు గానీ అంత ప్రీతికరమైనది food! అందుకే ఏటా మనం తీసుకునే కొత్త సంవత్సర తీర్మానాలలో డైటింగ్ చేసి బరువు తగ్గాలన్నది కూడా ఒక తప్పనిసరి అంశంగా ఉంటోంది. ఈ సందర్భంగా మనం food అనే మాటతో వచ్చే కొన్ని పదాల గురించి మాట్లాడుకుందాం.
 
 Comfort food అంటే  సేద తీచ్చే ఆహారం. ఒంటరిగా, ఇంటికి దూరంగా ఉన్నప్పుడు; మనసు ఆందోళనగా ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఆహార పదార్థాలు సాంత్వన చేకూరుస్తాయి. అవే కంఫర్ట్ ఫుడ్స్. సాధారణంగా అవి మన బాల్యానికి సంబంధించినవై ఉంటాయి. ఉదా: చాక్లెట్లు మిఠాయిలు వగైరా. Convenience food అంటే... తినడానికి దాదాపు తయారుగా ఉన్న ఆహారం. మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ దోసెలపిండి ఇలాంటిదే. కొని తెచ్చాక ఇలా కలిపి అలా పెనంపై వేసుకోవచ్చు.
 
 Devil's food cake అంటే గాఢమైన రుచిగల నల్లటి చాక్లెట్ కేక్. (బహుశా నలుపును, గాఢతను దెయ్యానికి ప్రతీకాత్మంగా తీసుకోవడం వల్ల ఇలా అంటుండవచ్చు. మొదట్లో ఈ కేకు లోపల ఎర్రగా, పైన తెల్లగా ఉండేదట).Finger food అంటే ఫోర్కులు, చెంచాలతో పని లేకుండా తినగలిగిన ఆహారం. మన దగ్గరంతా ఫింగర్ ఫుడ్డే. అన్నం మొదలు దాదాపు ప్రతి పదార్థాన్నీ చేత్తోనే తినేస్తాం.  పాశ్చాత్యదేశాలలో ఇలా చేత్తో తినే అలవాటు లేదు కాబట్టి  అక్కడ ప్రత్యేకంగా ఫింగర్ ఫుడ్ అనే మాట పుట్టుకొచ్చింది.
 Food additive (యాడిటివ్) అంటే ఆహారానికి రుచి కోసం, రంగు కోసం కలిపే పదార్థం. Addictive (అడిక్టివ్) అంటే మళ్లీ వేరు. మనిషిని బానిసను చేసుకునే పదార్థాన్ని అడిక్టివ్ అంటారు. Tobacco is highly addictive.
 
 Food chain అంటే... తమ కింది వాటిని భుజించే ప్రాణుల శ్రేణి. ఉదా: పూలను గొంగళి పురుగు తింటుంది. గొంగళి పురుగును కప్ప తింటుంది. కప్పను పాము తింటుంది. పామును డేగ తింటుంది. ఇదంతా ఒక ఫుడ్ చైన్.
 
 Food poisoning అంటే ఆహారం వల్ల కలిగే అస్వస్థత. ప్రమాదకరమైన బ్యాక్టీరియా కారణంగా ఆహారం విషమించడాన్నే ఫుడ్ పాయిజనింగ్ అంటారు.
 
 Food stamp అంటే తిండి గింజలను, ఇతర దినుసులను చవకగా కొనుక్కునేందుకు ప్రభుత్వ ఇచ్చే రేషన్ కూపన్.  
 
 Functional food అంటే విటమిన్లు, ఖనిజాలు, ఔషధాలు కలిపి బలవర్థకంగా తయారు చేసిన పదార్థం. దేహానికి సరిపాళల్లో పోషకాలు అందనప్పుడు వైద్యులు ఇలాంటి ఫంక్షనల్ ఫుడ్‌ని సిఫారసు చేస్తారు. Nutraceutical అన్నా కూడా ఇదే అర్థం. దీనిని న్యూట్రిసూటికల్ అని పలకాలి.
 
 Health food అంటే ఆరోగ్యకరమైన ఆహారం. దీనికి విరుద్ధం ఒఠజు జౌౌఛీ. హెల్త్ ఫుడ్‌లో కొవ్వులు, అధిక చక్కెర నిల్వలు, కృత్రిమ రసాయనాలు ఉండవు. జంక్‌ఫుడ్‌లో ఇవన్నీ ఉంటాయి. అయితే రెడీమేడ్‌గా దొరుకుతుంది కాబట్టి జనం వీటికి బాగా అలవాటు పడిపోతారు.
 
 చివరిగా Food for thought అంటే to make someone think seriously about something. మెదడుకు మేత అనుకోండి.
 
 Dogfooding
 Dogfooding అనేది ఒకే మాట. Eating your own dog food అనే ఆంగ్ల మాండలికం నుంచి వచ్చిన పదం. కంపెనీలు (ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు) తమ ఉత్పత్తులను మార్కెట్ చేయబోయే ముందు వాటి పని తీరు తెలుసుకోవడం కోసం తమ సిబ్బందికి వాడకానికి ఇస్తాయి. అలా ఇవ్వడాన్నే dogfooding అంటారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ తను కొత్తగా కనిపెట్టిన ‘గార్డియన్’ అనే అప్లికేషన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి ముందు ఇలాగే ఛీౌజజౌౌఛీజీజ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement