tasty food
-
బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!!
రోడ్డు పక్కనే కదా హోటల్ అనుకొని తీసిపారేయకండి. ఈమె వద్ద ఒక్కసారి బోటికూర, తలకాయ మాంసం రుచి చూశారంటే ఇక రోజూ ఇటువైపు రావాల్సిందే.. అవును మరి.. బోటికూర లక్ష్మమ్మ పెట్టే తలకాయ మాంసం, మటన్ లివర్, బోటి కూర, చికెన్ కర్రీ కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బడా వ్యాపారులు సైతం వచ్చి లొట్టలేసుకొని తింటుంటారు. సమపాళ్లలో మసాలా దినుసులు, ఇంట్లోనే తయారు చేసే కారంపొడి, కొబ్బరిపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ప్రత్యేకంగా బోటీ వండుతుంటానని, రుచికి అదే కారణమని అంటుంటారు బోటికూర లక్ష్మమ్మ. – బంజారాహిల్స్బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని షేక్‌పేట మండల కార్యాలయం వద్ద ఫుట్‌పాత్‌ను ఆనుకొని రోడ్డు పక్కనే రెండు దశాబ్ధాలుగా ఆమె నిర్వహిస్తున్న మొబైల్ మెస్‌లో టేస్ట్ చేస్తున్న ఎంతో మంది ప్రముఖులు శెభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు. ప్రతిరోజూ 12 కిలోల బోటీ వండి వంద మందికి పైగానే ఆహారప్రియులకు అందిస్తున్నారు. అందుకే వరంగల్ జిల్లా ఉల్లిగడ్డ దామెర గ్రామానికి చెందిన గన్నారం లక్ష్మమ్మ(73) ఏకంగా బోటీకూర లక్ష్మమ్మగా పేరు తెచ్చుకుంది.ఈమె బోటీ కూర గురించి ఇప్పటికే సుమారు 100 మంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బోటీ కోసమే వారంలో ఒకటి, రెండుసార్లు ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వస్తుంటారు. తలకాయ మాంసం, మటన్ లివర్, మటన్ కూర, చికెన్ లివర్, చికెన్ కూర, ఇవన్నీ ఈమె వద్ద ప్రత్యేక రుచుల్లో లభిస్తుంటాయి. మరో నలుగురికి ఉపాధి బోటీ కూరను తానే స్వయంగా వండుతానని, ఇందులో వాడే ప్రతి మసాలా దినుసు తానే తయారు చేస్తుంటానని తెలిపారు.రాహుల్ సిప్లిగంజ్‌కు వడ్డిస్తూ..తాను సంపాదించడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. లక్ష్మమ్మను చూసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో ఎంతోమంది మహిళలు స్ఫూర్తి పొంది ఇలాంటి మొబైల్ మెస్‌లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఈమె టేస్ట్‌కు ఎవరూ సాటిరారంటూ చాలామంది యూట్యూబర్లు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించడమే కాకుండా సోషల్ మీడియాలో లక్ష్మమ్మ బోటి కూర టేస్టే సెపరేట్ అంటూ పోస్టులు పెడుతుంటారు. అంతేకాదు స్విగ్గి, జొమాటో ఆర్డర్లు కూడా వస్తుండగా ఇప్పుడున్న గిరాకీ తట్టుకోలేక ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎంతో ఆనందం..బోటీ వండటానికి నాకు 3 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ భోజనాలు ప్రారంభిస్తాను. మొదటి గంటలోనే వందకుపైగా బోటి కూర భోజనాలు అమ్మడవుతుంటాయి. కూర అయిపోగానే చాలా మంది వస్తుంటారు. లేదని చెప్పగానే నిరాశతో వెళ్తుంటారు. డబ్బులు సంపాదించడానికి వండటం లేదు.ఉన్నంతలోనే మంచి రుచితో అందిస్తున్నాను. రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మరో సింగర్ బిట్టు, లేడీ సింగర్ లక్ష్మీతో పాటు చాలా మంది వస్తుంటారు. బాగుంది అని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. నాతో పాటు నా కూతురు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లు ఏడు చోట్ల మెస్‌లు నిర్వహిస్తున్నారు. అన్ని చోట్లకు నేను వండిన బోటి కూర వెళ్తుంది. – లక్ష్మమ్మఇవి చదవండి: 'సిగ్నోరా సర్వీస్ సెంటర్'! ఈ ముగ్గురు మహిళలు.. -
ఉలవలు, ఊదలతో నోరూరించే రుచులు.. కొంచెం కారం, కొంచెం తీపి!
హిమాలయాల్లో పర్యాటకుల మనసులు దోచుకునే రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ ఒకటి. అక్కడి ప్రకృతి అందాలు, దేవాలయాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో సంప్రదాయ వంటలు అంతేస్థాయిలో నోరూరిస్తాయి. ఊరించే ఉత్తరాఖండ్ రుచుల్లో కొన్నింటిని ఎలా వండుతారో తెలుసుకుందాం... ఉలవల ఫాను తయారీ ఇలా! కావలసినవి: ►ఉలవలు – కప్పు ►ఆవనూనె – అరకప్పు ►వెల్లుల్లి రెబ్బలు – ఐదు, అల్లం – అరంగుళం ముక్క ►జీలకర్ర – టీస్పూను, ఇంగువ – పావుటీస్పూను ►ధనియాల పొడి – అరటీస్పూను, పసుపు – పావు టీస్పూను ►పచ్చిమిర్చి – నాలుగు, ఉప్పు – రుచికి సరిపడా ►నెయ్యి– టీస్పూన్, కొత్తిమీర – గార్నిష్‌కు సరిపడా. తయారీ... ►∙ఉలవలను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ►ఉదయం ఉలవలను తొక్కపోయేంత వరకు కడగాలి. దీనిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె కాగిన తరువాత రుబ్బుకున్న సగం పిండిని చిన్నచిన్న కట్లెట్లా చేసి రెండువైపులా చక్కగా కాల్చి పక్కనపెట్టుకోవాలి. ►మిగతా పిండిలో మూడుకప్పుల నీళ్లుపోసి కలపాలి ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె మొత్తం వేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో తరువాత జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ►ఇవి వేగాక నీళ్లు కలిపిన పిండి రుబ్బు, పసుపు, ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ►∙మూత పెట్టి సన్నని మంట మీద పదినిమిషాలు మగ్గనివ్వాలి. ►తరువాత వేయించి పెట్టుకున్న కట్లెట్లు వేసి మరో పదినిమిషాలు ఉడికించాలి. ►పప్పు మిశ్రమం దగ్గర పడిన తరువాత కొత్తిమీర తరుగు, నెయ్యితో గార్నిష్ చేసి దించేయాలి. అన్నంలోకి ఇది చాలా బావుంటుంది. ఝంగోరా కీ ఖీర్ కావలసినవి ►ఊదలు – మూడు కప్పులు, పంచదార – ఐదు కప్పులు ►జీడిపప్పుపలుకులు – టేబుల్ స్పూను, కిస్మిస్ – అరటేబుల్ స్పూను ►పాలు – మూడున్నర లీటర్లు ►క్వేరా ఎసెన్స్ – మూడు టేబుల్ స్పూన్లు ►బాదం పలుకులు – అరకప్పు. తయారీ... ►మందపాటి పాత్రలో పాలు పోసి కాచాలి. ►కాగిన పాలలో ఊదలు వేసి ఉండలు లేకుండా కలపాలి. ►ఊదలు ఉడికిన తరువాత పంచదార వేసి కరిగేంత వరకు తిప్పుతూ ఉడికించాలి. ►పంచదార కడిగిన తరువాత క్వెరా ఎసెన్స్ వేసి దించేయాలి. ►ఈ మిశ్రమం చల్లారాక గిన్నెలో వేసి రిఫ్రిజిరేటర్లో రెండు గంటలపాటు ఉంచాలి. ►రెండు గంటల తరువాత చల్లటి ఖీర్‌లో బాదం, జీడిపలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Makki Roti: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో సులువుగా మక్కి రోటీ తయారీ! Chana Madra Recipe: హిమాచల్ వంటకం.. చనా మద్రా ఎప్పుడైనా తిన్నారా! -
నయా ట్రెండ్: డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్
నాగమణి సాధారణ గృహిణి భర్త ఉద్యోగి. ఓ మధ్యాహ్నం వేళ. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఏం చేయాలో తోచక భర్తకు ఫోన్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. భర్త ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన బంధువులు రీఫ్రెష్ అయ్యేలోపే తాజా వంటకాలు సిద్ధమయ్యాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్‌ఫ్రం హోంలో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్‌లు వేరు. ల్యాప్‌టాప్‌లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లోని ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్ చేయడం.. నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్‌ను తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. డాబాగార్డెన్స్/బీచ్‌రోడ్డు: విశాఖ నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వెరైటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తుందన్న సంకేతాలు రాగానే ఆర్డర్ చేస్తే సరి.. వేడివేడి ఆహార పదార్థాలు గడప ముంగిటకు వచ్చేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. కొత్త వంటల పరిచయం నగరవాసులకు వెరైటీ ఫుడ్ అందించాలని పలు హోటళ్లు ఎప్పటికప్పుడు ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారత దేశం రుచులు, నవాబులు బిర్యానీ, కోస్టల్ రుచి.. ఇలా అనేక రకాల పేర్లతో ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేసి ఆహార ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. కొత్త రుచులు ఇంట్లో కష్టం వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి రెస్టారెంట్ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపునిండా తినొచ్చు. – సీహెచ్ పవన్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి ట్రెండ్ మారింది ఒకప్పటికీ నేటికి ట్రెండ్ మారింది. వర్క్ స్టైల్ కూడా మారింది. అలానే ఆహారపు అలవాట్లు, అభిరుచులూ మారాయి. వీకెండ్స్ సంస్కృతి వచ్చింది. చాలా మంది ఫ్యామిలీతో రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లి భోజనం చేస్తున్నారు. మెనూలో వెరైటీలు ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ మార్చుకుంటున్నాయి. హోం డెలివరీ, టేక్ ఏవే తగ్గిపోయి ఆన్లైన్లో ఆర్డర్స్ పెరిగాయి. హోటల్ బిజినెస్‌లో 60 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ఆక్రమించేశాయి. – వాకాడ రాజశేఖర్‌రెడ్డి, అతిథి దేవోభవ హోటల్ యజమాని నగరంలో నయా ట్రెండ్ హీరో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భోజన సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు ఏం వంట చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న హీరోయిన్‌కు హీరో మంచి ఐడియా చెప్తాడు. సిటీలో ప్రముఖ హోటల్ నుంచి ఫుడ్ రప్పించి బంధువులకు అన్ని రకాల రుచులు చూపించి వారి చేత శభాష్ అనిపిస్తాడు. ప్రస్తుతం నగరంలో ఇటువంటి ట్రెండే నడుస్తోంది. ఇంటికి వచ్చే బంధువులకు నగరంలోని లభించే కొత్త కొత్త రుచులను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. అందిస్తున్నారు. హోటళ్ల పేర్లూ వెరైటీనే.. విశాఖ నగర వాసులు రోజూ ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడడం లేదు. సకుటుంబ సమేతంగా హోటల్‌కో, దాబాకో వెళ్లి సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యజమానులు రెస్టారెంట్లు, హోటళ్లకు వెరైటీ పేర్లు పెడుతున్నారు. అమ్మ చేతి వంట, వంటిళ్లు, అరిటాకు, వంటకమ్.. ఇలా రకరకాల పేర్లతోనే కాదు.. బాబాయ్ హోటల్, సుబ్బయ్య హోటల్, రాజుగారి హోటల్, కుండ బిర్యానీ వంటి పేర్లతోనూ నడుస్తున్న హోటళ్లు నగరంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. బుట్ట భోజనం, కాంబో ఆఫర్, ఫ్యామిలీ ఫ్యాక్, జంబో బిర్యానీ ఇలా స్పెషల్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ.. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్డర్లు మొదలవుతాయి. వాటర్ బాటిల్ నుంచి ఐస్‌క్రీం వరకు, టిఫిన్ నుంచి భోజనం, పసందైన బిర్యానీ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కొందరు కర్రీస్, స్నాక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. రోజు రోజుకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లల్లో వంట చేయడం చాలా వరకు తగ్గింది. వేగంగా డెలివరీ చేయడం కూడా ఇందుకు కారణం. ఆన్లైన్ యాప్‌లు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. – కిరణ్, ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ఫెస్టివల్స్‌కు వెళ్తుంటా.. నాకు కొత్త కొత్త రుచులంటే చాలా ఇష్టం. అటువంటి రుచులు ఇంట్లో కష్టం. అందుకే నగరంలో ఎక్కడ కొత్త రుచులు ఉన్నాయంటే అక్కడ వాలిపోతా. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్స్, నూతన రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ రుచులన్నీ ఆస్వాదిస్తా. –హేమసుందర్ కొత్త రుచులను టేస్ట్ చేస్తాం నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేస్తుంటాం. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో ఒక్క రోజైనా రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తాం. కొత్త రుచులను టేస్ట్ చేస్తాం. –రమ్య -
ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి !
సాక్షి, కామారెడ్డి: నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటాయి. ఏది కొనాలన్నా అగ్గిపిరమే. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఊళ్లో రూ. 1 కి ఒక మిర్చిబజ్జి అమ్ముతున్నారు. మీరు చదివేది నిజమే. యాబై ఏళ్ల క్రితం మొదలైన వాళ్ల దందా ఏడు పదుల వయసులోనూ నిరాటంకంగా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఆముద సత్యనారాయణ–ఊర్మిల దంపతులు యాబై ఏళ్ల కిందట మిర్చిబజ్జీల అమ్మకాలు మొదలుపెట్టారు. అప్పట్లో అంగళ్లలో, పండుగ ఉత్సవాల్లో వేడివేడి బజ్జీలు తయారు చేస్తూ అమ్ముతుండేవారు. మిగతా రోజుల్లో రాజంపేట గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద బండీపై పెట్టుకుని అమ్మేవారు. అయితే వయస్సు పైబడడంతో బయటకు వెళ్లడం మానేశారు. ఇంటి దగ్గరే పొయ్యిమీద మిర్చీలు గోలించి బండిపై పెట్టుకుని అమ్ముతున్నారు. ప్రతీ రోజూ ఐదు వేలకు పైగా మిర్చిలు అమ్ముడవుతాయిని సత్యనారాయణ పేర్కొన్నారు. ఒక్కోసారి ఎనిమిది వేల నుంచి పది వేల దాకా అమ్ముడుపోతాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు అంటే దాదాపు 12 గంటల పాటు శ్రమిస్తారు. సత్యనారాయణ కొడుకు రాము బీఈడీ పూర్తి చేశాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో తండ్రికి తోడుగా మిర్చిబజ్జీ దందాలో భాగమవుతున్నాడు. రాజంపేట మండల కేంద్రంలో సత్యనారాయణ దగ్గర మిర్చిబజ్జీల కోసం జనం ఎగబడతారు. ప్రతీ రోజూ తయారీ అమ్మకం సాగిస్తుంటారు. నలుగురు కలిస్తే చాలు మిర్చిలు తెప్పించుకుని తినడం ఆ ఊరిలో చాలా మందికి అలవాటు. దీంతో సత్యనారాయణ మిర్చిల దందా నిరాటంకంగా సాగుతోంది. అప్పుడు ఏకాన...ఇప్పుడు ఏక్ రూపియే నాలుగైదు దశాబ్దాల నాడు సత్యనారాయణ దంపతులు మిర్చిదందా మొదలుపెట్టినపుడు ఏకాణాకు ఒక మిర్చి అమ్మేవారని సత్యనారాయణ తెలిపారు. రూపాయికి 16 అణాలు కాగా, ఒక్క రూపాయికి 16 మిర్చిలు ఇచ్చేవారమని పేర్కొన్నారు. తరువాత రూపాయకి నాలుగు, ఆ తరువాత రూపాయికి రెండు మిర్చిలు అమ్మామని, ఇప్పుడు ఒక్క రూపాయికి ఒక మిర్చి అమ్ముతున్నట్టు పేర్కొన్నారు. శనగ పప్పు, బియ్యంతో కలిపి పిండితయారీ.... సత్యనారాయణ మిర్చిల కోసం శనగ పప్పుతో పాటు బియ్యం కలిపి గిర్నీ పట్టిస్తాడు. క్వింటాళ్ల కొద్ది పిండి పట్టించి మిర్చిల తయారీకి వాడుతున్నారు. అప్పట్లో రూ.2.50 కి కిలో నూనె, రూ.1.25 కు కిలో పప్పు దొరికే దని, ఇప్పుడు రూ.140 కిలో పామాయిల్, రూ.65 కిలో శనగపప్పు దొరుకుతున్నాయని తెలిపాడు. అప్పట్లో రూపాయికి కిలో పచ్చిమిర్చి దొరికేది, ఇప్పుడేమో రూ.40 నుంచి రూ.80 వరకు కొంటున్నామని పేర్కొన్నాడు. కొంత కాలం గ్యాస్ పొయ్యి మీద మిర్చిలు గోలించామని, అయితే గ్యాస్ ధర భాగా పెరగడంతో మళ్లీ కట్టెల పొయ్యిమీదనే చేయాల్సి వస్తోందని తెలిపాడు. చదవండి: Kalyana Lakshmi Scheme: 50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’! -
‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘.. ఈ హోటల్లో ఏది కొన్నా రూ.10!
రెండు ఇడ్లీ..రెండు పూరి..దోశ..ఉగ్గాని..ఏ అల్పాహారమైనా పది రూపాయలే. ఎక్కడో పల్లె ప్రాంతంలో కాదు.. జిల్లా కేంద్రమైన కర్నూలులో..నమ్మశక్యంగా లేదా? నిజమేనండి! ఒకటి కాదు..రెండు కాదు..తొమ్మిదేళ్లుగా ఇదే ధరతో ఓ హోటల్ యజమాని పొద్దున్నే పేదల ఆకలి తీరుస్తున్నాడు. ఆ వివరాలేమిటో చూద్డామా.. కర్నూలు (ఓల్డ్‌సిటీ): కార్మికులు, కూలీలు ఎక్కువగా ఉండే రోజా వీధిలో 2012లో రేణుక టిఫిన్ సెంటర్ వెలిసింది. ఇక్కడ పది రూపాయలకే అల్పాహారాన్ని అందిస్తున్నారు. హోటల్ యజమాని నాగేశ్వరరెడ్డితో పాటు పది మంది పనిచేస్తున్నారు. ప్రతి రోజూ వెయ్యి మంది వరకు ఇక్కడ ఆకలి తీర్చుకుంటున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా పది రూపాయలకే అల్పాహారాన్ని అందిస్తుండడంతో ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. హాటల్ సర్వర్ నుంచి యజమానిగా.. నాగేశ్వరరెడ్డి సొంత ఊరు నందికొట్కూరు మండలం కొణిదెల. తండ్రి రామిరెడ్డి రైతు కూలి. తల్లి సూర్యలక్ష్మీదేవి గేదెలను పోషిస్తూ పాలు అమ్మి జీవనం సాగించేవారు. పదో తరగతి వరకు చదువుకున్న నాగేశ్వరరెడ్డి ఆస్తిపాస్తులు లేకపోవడంతో జీవనోపాధి కోసం కర్నూలు వచ్చాడు. కొన్ని రోజులు ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేశాడు. అక్కడ అతనికి హోటల్ వ్యాపారంలో మెలకువలు తెలిశాయి. ప్రజల అభి‘రుచి’ని గమనించాడు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన తనలాంటి పేదల కోసం హోటల్‌ను ఏర్పాటు చేయాలని తలంచాడు. ఇందుకు మామ జొన్నగిరి హనుమంతరెడ్డి సహకారం తీసుకున్నాడు. కూలీలు ఎక్కువగా ఉండే రోజా వీధిలో టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో వంద మంది వరకు వచ్చేవారు. తక్కువ ధరకు నాణ్యమైన అల్పాహారం దొరకుతుందని తెలిసిన తర్వాత ఆ సంఖ్య వెయ్యి వరకు పెరిగింది. తక్కువ లాభంతో.. వ్యాపారం ఎవరు చేసినా లాభాలు చూస్తారు. అయితే నాగేశ్వరరెడ్డి మాత్రం తక్కువ లాభంతో ఎక్కువ మందికి మేలు చేస్తున్నాడు. హోల్‌సేల్‌గా సరుకులు కొనుగోలు చేస్తున్నాడు. దీంతో కొంత ఖర్చు తగ్గుతోంది. ధరలు పెరిగినా..తాను మాత్రం అల్పాహారం ధర పెంచడం లేదని చెప్పాడు. ఎక్కువ మంది కస్టమర్లు ఉండడంతో తనకు నష్టం రావడం లేదని వివరించాడు. వ్యాపారం పెరిగితే మరో ముగ్గురికి అదనంగా ఉపాధి కల్పిస్తానని చెప్పాడు. తాను పేదరికంలో ఎన్నో కష్టాలను అనుభవించానని, తన లాంటి పేదల కోసం వ్యాపారం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. చాలా దూరం నుంచి వస్తున్నా మేం సుంకేసుల రోడ్డులో ఉన్న మాసామసీదులో ఉంటాం. ఇక్కడ తక్కువ ధరకు నాణ్యమైన అల్పాహారం దొరుకుతుంది. మా పిల్లాడు వీటిని బాగా తింటాడు. అందుకే చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తుంటాను. నేనూ తిని ఇంటికీ తీసుకెళుతుంటా. – షేక్రఫిక్ రుచిగా ఉంటుంది నేను సంతోష్‌నగర్‌లో ఉంటాను. ప్రతిరోజు పొద్దున్నే పనికి వెళ్లాల్సి ఉంటుంది. నేను వెళ్లే సమయానికి ఇంట్లో టిఫిన్ రెడీ అయి ఉండదు. ఎలాగూ ఇక్కడి టిఫిన్ రుచిగా ఉంటుందని ఇంత దూరం వస్తుంటా. పైగా ధర తక్కువగా ఉంటుంది. బయట రెండు ఇడ్లీలకు రూ. 40, దోశకు రూ.30 వసూలు చేస్తున్నారు. –ఈశ్వరరెడ్డి ఇంట్లో చేసే వంటల్లా ఉంటాయ్ ఇక్కడి టిఫిన్లు అచ్చం ఇంట్లో చేసిన వాటిలా ఉంటాయి. బయట చట్నీలో కారం ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ ప్రతిదీ మోతాదు వరకే వేస్తుంటారు. నేను మున్సిపల్ ఆఫీస్ వద్ద పనిచేస్తుంటా. ఇంతదూరం వచ్చి టిఫిన్ చేసి వెళతా. – సురేష్ -
అభిరుచులకు రిటైర్మెంట్ ఉండదు
సాక్షి, సిటీబ్యూరో : ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ఇప్పుడు అనన్య సామాన్య విజయాలు సాధిస్తోంది. విభిన్న రంగాల్లో రాణిస్తోంది. అయినప్పటికీ వంటింటిపై తన పట్టు కోల్పోలేదని ఇప్పటికీ నిరూపిస్తోంది. పురుష చెఫ్స్ రాజ్యమేలుతున్న ఆహార పరిశ్రమలో శరవేగంగా పుంజుకుంటున్నారు ఇంటింటా చేయి తిరిగిన మహిళా చెఫ్స్. గడప దాటకుండానే వీరు నమోదు చేస్తున్న గణనీయమైన విజయాలు ఫుడ్ ఇండస్ట్రీలో రానున్న మహిళాధిపత్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరానికి చెందిన పలువురు అతివలు తమ మనోగతాలను ఇలా పంచుకున్నారు. చదువుకునే సమయంలో కూడా ఎప్పుడూ జాబ్ చేయాలనుకోలేదు. 12వ తరగతిలో ఉండగా హాబీగా బేకింగ్ అలవాటైంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి గిఫ్ట్ ఇచ్చేదాన్ని. అలా అది ఆర్డర్లపై తయారు చేసి ఇచ్చేవరకూ వెళ్లింది. ఆ తర్వాత 2017 నవంబరు నుంచి ఫుల్‌టైమ్ ప్రొఫెషన్‌గా మారింది. ప్రస్తుతం ఇంట్లో నుంచే ఆర్డర్స్ తీసుకుంటున్నాను. హైటెక్ సిటీలో నిర్వహించిన గ్రేట్ ఇండియా బేక్ షో, మాస్టర్ చెఫ్ ఆడిషన్స్‌లోనూ పార్టిసిపేట్ చేశా. బేకింగ్‌లో ఆసక్తి ఉన్న యువతకు ఉదయం సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా టీచింగ్ ఇస్తున్నా. ఇప్పటిదాకా 120 విద్యార్థులకు టీచ్ చేశా. వారిలో కొందరు బేకరీలు కూడా ప్రారంభించారు. బేకింగ్‌తో పాటు కుకింగ్ కూడా చేస్తున్నా. మా అమ్మ, నాన్న అన్నివిధాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మనం నైన్ టు ఫైవ్ జాబ్లకు పరిమితం కాకూడదని దృఢంగా నిశ్చయించుకుంటే తప్పకుండా మహిళలు తమని తాము ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దుకోవచ్చు. – దీపిక, కూకట్పల్లి అభి‘రుచి’కి రిటైర్మెంట్ లేదు... వారాంతాల్లో హైదరాబాద్‌లో జరిగే చిన్న చిన్న ఎగ్జిబిషన్లు, చేనేత సంత వంటి వాటిల్లో రుచికరమైన పొడులను వినియోగదారులకు విక్రయిస్తుంటాను. కార్పొరేట్ ఆఫీసులోని అడ్మిన్ విభాగంలో 30 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి రిటైరయ్యా. ఓ కూతురు, కొడుకు ఉన్నారు. పిల్లలిద్దరూ సెటిలయ్యారు. భర్త దూరమై, రిటైర్ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నా. నాకు వంట అంటే ఇంకా ఇష్టం నావంట మా బంధుమిత్రులకు బాగా ఇష్టం. అందుకే దాన్నే ఎంచుకున్నా. ‘కంచి కిచెన్స్’ పేరుతో సాంబార్ పొడి, దోసపొడి, మిర్చి పొడి, పులిహోర మిక్స్.. ఇలా బామ్మల కాలంలో నాటి వంటకాలను తయారు చేస్తున్నా. డబ్బుల కోసం కాదు. కానీ.. ఏదో కోల్పోయిన భావన రాకూడదనే తపన. మా పిల్లలు, మనవరాళ్లు, బంధువులు ఇంకా ఏం వర్క్ చేస్తావు, విశ్రాంతి తీసుకోకుండా’ అంటున్నా.. కూడా ‘ఈ పనిని ఎంజాయ్ చేస్తున్నాను ఏ రోజు ఒత్తిడిగా అనిపించినా అప్పుడు మానేస్తాను’ అని చెబుతుంటాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా నాకు మార్కెటింగ్‌లో హెల్ప్ చేస్తుంటాడు. – విజయ శ్రీనివాసన్, మారేడుపల్లి బ్లాగుతో బాగు.. కొత్త కొత్త రుచులు ఆస్వాదిస్తూ ఫుడీగా ఉండేదాన్ని. ఆ అనుభవాలని ఓ కాలేజ్ మేగజైన్కి రాసేదానిని. ఆ తర్వాత ఫ్రెండ్ అడిగితే బ్లాగ్‌కి హెల్ప్ చేశా. ఆ తర్వాత కొందరు నువ్వే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అడిగారు. అలా రెండున్నరేళ్లుగా ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నా. త్వరలో ఫుల్ టైమ్ బ్లాగర్ అవుతాను. ప్రతి రోజూ తప్పకుండా హైదరాబాద్ ఫుడ్ ట్రిప్ పేజ్‌లో ఒక్క ఫుడ్ ఐటమ్ అయినా అప్లోడ్ చేస్తాను. నేను పోస్ట్ చేసిన వావ్ ఆమ్లెట్ వీడియో కి ఏకంగా లక్షా 30వేల వ్యూస్ వచ్చాయి. స్ట్రీట్ ఫుడ్, లేదా స్టార్ హోటల్ ఫుడ్ అని కాకుండా అన్నీ కవర్ చేస్తున్నా. రోజుకు కనీసం 30, 40 మెంబర్లు మెసేజ్‌లు పెడుతుంటారు. అందరికీ రెస్పాన్స్ ఇస్తుంటాను. – సృష్టి లాడేగం, కూకట్పల్లి మా నాన్‌వెజ్.. క్రేజ్ 14 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉండాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కోసం చేస్తుంటాను. పిల్లలు ఐటీ ఫీల్డ్కి నా ఫుడ్‌ని తీసుకెళుతుంటారు. పదేళ్ల నుంచి ఇది ప్రొఫెషనల్‌గా మారింది. ఫేస్బుక్లో రెండేళ్ల నుంచి మామ్స్ హోమ్ మేడ్ ఫుడ్ బై జరీనాషా అనే పేరుతో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యాను. బిర్యానీ, హలీం, పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌గా తినే పాయా, నెహారీ, బోటీ... మటన్ మరగ్ వంటివన్నీ తయారు చేస్తాను. కిచెన్‌లో 18 మందికి ఉద్యోగం ఇవ్వగలిగాను. నా దగ్గర 6 పేజీల మెనూ ఉంది. చికెన్ స్టార్టర్స్, ఫిష్, మటన్ బిర్యానీ, హలీం రెగ్యులర్‌గా ఉంటుంది. – జరీనా షా, టోలిచౌకి పచ్చడి.. పొడి.. ఎమ్మెస్సీ మైక్రోబయోలజీ చేశాను. ప్రొఫెసర్‌గా, టీచర్‌గా చేశాను. ఒకసారి ఇంట్లో ఆవకాయ పికిల్ తయారు చేసి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఎవరో మాకూ కావాలని అడిగారు. చేసి ఇచ్చాను. అక్కడ మొదలై.. దీంతో అదే బిజినెస్‌గా మారిపోయింది. తొలుత వారాంతంలో మాత్రమే చేస్తుండేదాన్ని. ఆ సమయం సరిపోలేదు. ఆ తర్వాత నా భర్త పవన్‌కుమార్ కూడా తన ఐటి ఉద్యోగం మానేసి నాతో చేయి కలిపారు. పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, స్నాక్స్ తయారు చేస్తాం. అన్నీ కలిపి 30 ఐటమ్స్ దాకా ఉంటాయి. సమ్మర్లో ఆవకాయ, బెల్లం ఆవకాయ, తొక్కు పచ్చడి అలాగే వింటర్లో నిమ్మకాయ, ఉసిరి, చింతకాయ, దబ్బకాయ.. ఇలా సీజనల్ పికిల్స్ అందిస్తున్నాం. నాలుగేళ్ల నుంచీ చేస్తున్నా. పికిల్స్ అండ్ పొడీస్ పేరుతో కేవలం ఫేస్బుక్ పేజ్ ద్వారా మాత్రమే నా బిజినెస్ సాగుతోంది. – దీప్తి ఆకెళ్ల, దిల్సుఖ్నగర్ టేస్టీగా.. వెరై‘టీ’గా.. వ్యక్తిగతంగా టీ ప్రియురాల్ని. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ టీ తాగేదాన్ని. అయితే అది టేస్ట్‌గా అనిపించేది కాదు. ఆరోగ్యకరమైన టీ.. టేస్టీగా లభించడం లేదనే విషయం అప్పుడే అర్థమైంది. దాంతో విభిన్న రకాల టీ పౌడర్స్ గురించి స్టడీ చేశాను. వాటిని దిగుమతి చేసుకుని సిటీలో కేఫ్స్, రెస్టారెంట్స్‌కి అందించడం మొదలుపెట్టాను. నేను అందిస్తున్న టీ వెరైటీలు కేవలం రుచికరంగా మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తాయి. – విద్య, కూకట్పల్లి -
దీపావళికి ఈ కొత్త రుచులు ట్రై చేయండి..
తీపి ఉన్న చోట దీప్తి ఉంటుంది. తియ్యదనం ఉన్న జీవితం మరొకరి జీవితంలో వెలుతురు పంచమంటుంది. చీకటిని తరిమికొట్టడానికి వెలిగించిన దీపంలో మిఠాయి రుచి నింపుకుంటుంది. ఇంటి ముందర దీపాలు, మనసులో అనుబంధాలు వెలిగే పండగ దీపావళి నోరు తీపి చేసుకోండి. నలుగురికీ పంచి బంధాల్ని కూడా తీపి చేసుకోండి. ► డ్రైఫ్రూట్ సున్నుండలు కావలసిన పదార్థాలు: మినప్పప్పు – 1/2 కప్పు; బాదం పప్పులు – 1/4 కప్పు; జీడిపప్పు – 1/4 కప్పు; తరిగిన పిస్తా – 1/4 కప్పు; బెల్లం – 3/4 కప్పు; నెయ్యి – 1/3 కప్పు. తయారీ విధానం: ∙జీడిపప్పు, బాదం పప్పులను విడివిడిగా వేయించుకొని బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ∙మినప్పప్పుని తక్కువ మంట మీద ఎర్రగా పచ్చి వాసన పోయేలా వేయించి చల్లార్చాలి ∙చల్లారిన మినప్పప్పుని కొద్దిగా బరకగా పొడి చేసి అందులోనే బెల్లం కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి ∙పొడి చేసుకున్న జీడిపప్పు, బాదం, మినప్పప్పు మిశ్రమాలను, తరిగిన పిస్తా పప్పులను ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి ∙వేడి నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుకోవాలి ∙మిశ్రమం వెచ్చగా వున్నప్పుడే ఉండలు చేసుకుంటే డ్రైఫ్రూట్ సున్నుండలు రెడీ. ► కోవా–రవ్వ బర్ఫీ కావలసిన పదార్థాలు: పచ్చి కోవా –1/2 కప్పు; బొంబాయి రవ్వ – 1/2 కప్పు; పాలు – 1/2 కప్పు; పంచదార – 1/2 కప్పు; నెయ్యి – 1/4 కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – 1/2 టీస్పూన్. తయారీ విధానం: ∙కుంకుమ పువ్వుని రెండు స్పూన్ల వేడి పాలలో నానబెట్టుకోవాలి ∙నెయ్యి వేడి చేసి అందులో రవ్వ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙అదే మూకుడులో కోవా, పాలు పోసి కోవా కరిగే వరకు కలియబెట్టాలి ∙దీనిలో చక్కెర కూడా వేసి కరిగేవరకు తిప్పాలి ∙ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, నానబెట్టిన కుంకుమ పువ్వు, ఏలకుల పొడి జత చేసి, మిశ్రమం దగ్గర పడేవరకు కలపాలి ∙మిశ్రమం అంచులు విడుస్తున్నప్పుడు పొయ్యి కట్టేసి, నెయ్యి రాసిన పళ్లెంలో పోసుకోవాలి ∙తరిగిన పిస్తా పప్పులను పైన వేసి సిల్వర్ ఫాయిల్‌తో అలంకరించుకోవాలి ∙కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ► కొబ్బరి –మిల్క్ మెయిడ్ హల్వా కావలసిన పదార్థాలు: తురిమిన పచ్చి కొబ్బరి – 1 కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పాలు – 1/4 కప్పు; కండెన్సెడ్ మిల్క్ (మిల్క్ మెయిడ్ ) – 1/2 కప్పు; ఏలకుల పొడి – 1/4 టీస్పూన్; పిస్తా – తగినంత. తయారీ విధానం: ∙బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగాక, తురిమిన కొబ్బరి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ∙ పాలు, మిల్క్ మెయిడ్ వేసి బాగా కలిపి దగ్గర పడేవరకు తిప్పుతూ ఉడికించాలి ∙ కొబ్బరి మిశ్రమం దగ్గర పడ్డాక ఏలకుల పొడి వేసి దింపేయాలి ∙ తగినన్ని పిస్తా పప్పులను పైన చల్లి సర్వ్ చేయాలి. ► వాల్నట్ హల్వా కావలసిన పదార్థాలు: వాల్నట్స్ – 1 కప్పు; పాలు – 1/2 కప్పు; పంచదార – 1/2 కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; కుంకుమ పువ్వు – చిటికెడు; సిల్వర్ ఫాయిల్ – గార్నిషింగ్ కోసం. తయారీ విధానం: వాల్నట్స్ని బరకగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పాలు, పంచదార, కుంకుమ పువ్వు వేసి పంచదార కరిగి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసి, దించి పక్కన పెట్టుకోవాలి ∙ఒక మూకుడులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, పొడి చేసుకున్న వాల్నట్స్ని వేసి, తక్కువ మంట మీద బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వేగాక దీనిలో పాల మిశ్రమం పోసి, రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ∙మరో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కొద్దిసేపు బాగా కలుపుతూ అంచులు విడిచే వరకు ఉడికించుకోవాలి ∙నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి చల్లారనివ్వాలి (హల్వా చల్లారాక ఇంకా గట్టి పడుతుంది) ∙పైన సిల్వర్ ఫాయిల్ అద్ది, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ► బ్రెడ్కాజా కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ – 6; పంచదార – 1/2 కప్పు; నీళ్లు – 1/4 కప్పు ; ఏలకుల పొడి – చిటికెడు; తరిగిన పిస్తా, బాదం – తగినంత; నూనె – వేయించటానికి సరిపడా. తయారీ విధానం: ∙బ్రెడ్ స్లైసెస్ అంచులు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ∙వేయించటానికి సరిపడా నూనె బాణలిలో వేసి, వేడి చేసి, కట్ చేసిన బ్రెడ్ ముక్కలను దోరగా వేయించుకోవాలి ∙ వేయించిన ముక్కలను కిచెన్ పేపర్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పంచదార, నీళ్లు వేసి కలియబెట్టి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙ ఏలకుల పొడి జత చేసి, ఒకసారి కలియబెట్టి, స్టౌ మీద నుంచి దించేయాలి ∙ వేయించిన బ్రెడ్ ముక్కలను పాకంలో వేసి, కొన్ని క్షణాల వరకు పాకంలో ముంచి తీసేయాలి ∙పాకంలో ముంచి తీసిన బ్రెడ్ ముక్కలను పళ్లెంలో పరుచుకొని, అవి తడిగా వున్నప్పుడే, తరిగిన పిస్తా పప్పులను, బాదం పప్పులను పైన చల్లుకోవాలి ∙ పూర్తిగా తడి ఆరిన తరవాత సర్వ్ చేయాలి. ► గర్ మఖానా కావలసిన పదార్థాలు: పూల్ మఖానా – 1 కప్పు; బెల్లం – 1/4 కప్పు; నెయ్యి – 2 టీస్పూన్లు. తయారీ విధానం: ∙మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి మఖానాలను తక్కువ మంట మీద కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙నాన్ స్టిక్ పాన్‌లో ఒక స్పూన్ నెయ్యి, బెల్లం వేసి, బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ∙బెల్లం కరిగాక వేయించి పెట్టుకున్న మఖానా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ∙నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెంలోకి తీసుకొని కొద్దిగా చల్లారాక విడివిడిగా అయ్యేలా చేసుకోవాలి. ► మఖ్ఖన్ పేడా కావలసిన పదార్థాలు: పచ్చి కోవా – 1/2 కప్పు; మైదా పిండి – 1 కప్పు; పంచదార – 2 కప్పులు; డ్రై ఫ్రూట్ ముక్కలు – 4 టేబుల్ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; వంట సోడా – 1/4 టీ స్పూను; ఏలకుల పొడి – 1/2 టీ స్పూన్; నూనె – వేయించటానికి సరిపడా. తయారీ విధానం: ∙ఒక గిన్నెలో కోవా, మైదా పిండి, వంట సోడా, నెయ్యి వేసి, బాగా కలిసేలా కలుపుకోవాలి ∙కొద్దిగా నీళ్లు చల్లి పిండి మృదువుగా కలుపుకోవాలి (పిండిని ఎక్కువగా మర్దనా చేయకూడదు) ∙మూతపెట్టి 15 నిమిషాలు నాననివ్వాలి ∙ఒక గిన్నెలో చక్కెర, రెండు కప్పుల నీళ్లు పోసి కరగనివ్వాలి ∙పంచదార కరిగి కొద్దిగా మరిగాక, ఏలకుల పొడి వేసి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి ∙కలిపి పెట్టుకున్న పిండిని ఉండలు చేసి, ఒక్కొక్క ఉండను కొద్దిగా చేతితో ఒత్తి మధ్యలో డ్రై ఫ్రూట్ ముక్కలను స్టఫ్ చేసి, అంచులను మూసి, చేతితో కొద్దిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ∙ఒత్తి పెట్టుకున్న పిండి ముద్దలను వేడి నూనెలో వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి ∙వేగిన వాటిని వేడి పాకంలో వేసి రెండు గంటలు నానిన తరవాత తినాలి. ► బెల్లం గవ్వలు కావలసిన పదార్థాలు: మైదా పిండి – 1 కప్పు; బెల్లం – 1 కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; వంట సోడా – చిటికెడు. తయారీ విధానం: ∙ఒక గిన్నెలో మైదా పిండి, నెయ్యి, వంట సోడా వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల పీట మీద గవ్వల ఆకారంలో వత్తుకోవాలి ∙ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ∙బాణలిలో నూనె పోసి, వేడి చేసి, అందులో గవ్వలను వేసి, దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో బెల్లం వేసి, మునిగే వరకు నీరు పోసి, స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి ∙బెల్లం పాకం వచ్చాక, పొయ్యి కట్టేసి, వేయించి పెట్టుకున్న గవ్వలను పాకంలో వేసి బాగా కలుపుకోవాలి ∙నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చువాలి ∙చల్లారాక గవ్వలు విడివిడిగా వస్తాయి. -
కాస్త వెరైటీగా.. మరికాస్త రుచికరంగా
స్వీట్‌పొటాటో బాల్స్ కావలసినవి: చిలగడదుంపల గుజ్జు – 3 కప్పులు (స్వీట్‌పొటాటోలను ఉడికించుకుని ముద్దలా చేసుకోవాలి), చీజ్ – 4 టేబుల్ స్పూన్లు, టమాటో సాస్ – 3 టేబుల్ స్పూన్లు, మైదాపిండి – పావు కప్పు, గుడ్లు – 2, పాలు – అర టేబుల్ స్పూన్, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చిలగడదుంపల గుజ్జు, చీజ్, టమాటో సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదాపిండి ఒక బౌల్లో.. పాలు, గుడ్లు మరో బౌల్లో.. బ్రెడ్ పౌడర్ ఇంకో బౌల్లో వేసుకుని బాల్స్‌ని మైదాపిండిలో ముంచి, గుడ్డు మిశ్రమాన్ని పట్టించి, బ్రెడ్ పౌడర్‌లో అటు ఇటూ తిప్పి.. నూనెలో డీప్‌ఫ్రై చేసుకుని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. ఎగ్ ఆనియన్ రింగ్స్ కావలసినవి: ఆనియన్ రింగ్స్ – 4(ఉల్లిపాయను రింగ్స్‌లా కట్ చేసుకోవాలి), గుడ్లు – 4, నూనె – సరిపడా, బ్రెడ్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లు, బటర్ – 3 టేబుల్ స్పూన్లు(కరిగించి), ఉప్పు – తగినంత, మిరియాల పొడి – కొద్దిగా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బ్రెడ్ పౌడర్, బటర్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని ఆనియన్ రింగ్స్‌కి బాగా పట్టించి, నూనెలో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో లైట్‌గా నూనె వేసి, ఒక డీప్‌ఫ్రై చేసుకున్న ఆనియన్ రింగ్ పెట్టుకుని.. దానిలో గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత బోర్లించి ఉడకనివ్వాలి. మిగిలిన రింగ్స్‌లో కూడా గుడ్లను అలానే వేసుకుని ఉడికించుకుని పైన మిరియాల పొడి వేసుకుంటే అదిరే రుచి మీ సొంతమవుతుంది. కొబ్బరి గారెలు కావలసినవి: అన్నం – 2 కప్పులు, కొబ్బరి కోరు – అర కప్పు, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు – అభిరుచిని బట్టి తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అన్నం, కొబ్బరి కోరు, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మరోసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారెల్లా చేసుకుని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సేకరణ: సంహిత నిమ్మన -
స్పైసీ.. టేస్టీ.. విదేశీ!
దేశీయ వంటకాల రుచులు బోరుకొట్టేశాయా.. విభిన్న విదేశీ ఫుడ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం. సిటీలో ప్రస్తుతం రుచుల మేళవింపుతో పలు రెస్టారెంట్లు స్వాగతం పలుకుతున్నాయి. రెస్టారెంట్లలో ఇటాలియన్, మెక్సికో, చైనా, ఫ్రాన్స్, అఫ్గానిస్థాన్ తదితర దేశాల వంటకాలు నోరూరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి తమకు నచ్చిన వంటకాలను రుచి చూడాలంటే రూ.1000 నుంచి రూ.2,000 ఖర్చు చేస్తే చాలు. జిహ్వ తహతహ తీరుతుంది. ఫుడ్లవర్స్ను ఆకట్టుకునే వంటకాల సమాహారమే ఈ కథనం. – హిమాయత్‌నగర్ ఇరగదీసే ఇటలీ వంటకాలు.. ఒకప్పుడు ఇటలీకే పరిమితమైన ఫిష్, పొటాటోస్, రైస్, కార్న్, సాసేజెస్, ఫోర్క్, విభిన్న రకాల ఛీజ్‌లు.. తదితర వంటకాలు చవులూరిస్తున్నాయి. కార్న్ (మొక్కజొన్న)తో చేసే ‘పొలెంటా’ సిటీలో కూడా లభిస్తోంది. మా రుసి ఐడొని రెస్టారెంట్లో విభిన్న రకాల మాంసాహారం, పాస్తాలు అందుబాటులో ఉన్నాయి. ఇటాలియన్ వంటకాలను రుచి చూడాలంటే ఫిల్మ్‌నగర్‌లోని ‘థియా’ కిచెన్, బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌కు వెళ్లాల్సిందే. ఇద్దరు వ్యక్తులు ఇటాలియన్ రుచులను టేస్ట్ చేయాలంటే కనీసం రూ.1000– రూ.2వేలు వెచ్చిస్తే సరి. మెక్సికన్.. మైండ్‌బ్లోయింగ్ సిటీలో మెక్సికన్ వంటకాలు మైండ్‌బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. స్పైసీగా ఉండాలి అంటే మాత్రం మెక్సికో వంటకాలను ఎంచుకోవాల్సిందే. భారతీయ వంటకాల శైలికి దగ్గరగా ఉండడం కూడా మెక్సికన్ క్యుజిన్ని సిటిజనులకు చేరువ చేసింది. వ్రోప్స్, నాథూస్, కేజూన్స్పైస్ వంటివి నగరంలో బాగా ఫేమస్. చిప్టోల్ చికెన్ నగర భోజనప్రియులు మెచ్చే స్టార్టర్‌గా పేరొందింది. టామ్రండ్ ప్రాన్స్ కూడా. ఇక మెక్సికన్ వంటకాలలో నగరవాసులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సూప్స్. టమాటో, కార్న్లతో పాటు తులసి ఆకుల్ని కూడా దీనిలో విరివిగా వినియోగిస్తుండడం ఈ వంటకాల ప్రాధాన్యాన్ని పెంచుతోంది. ఫ్యామిలీతో వెళ్లి మెక్సికన్ రుచులను ఆరగించాలంటే రూ.750 నుంచి రూ.2వేలు ఉండాల్సిందే. థాయ్.. సూపరోయ్ విభిన్న రకాల సముద్రపు జీవులను వేటాడి మరీ వంటకాలుగా మార్చే ఈ క్యుజిన్ నగరవాసుల సీఫుడ్ సరదాను తీరుస్తోంది. ఉడికించిన, కాస్త కఠినంగా ఉండే రైస్, లెమన్‌గ్రాస్, స్వీట్ జింజర్, నూనెలు తక్కువగా ఉపయోగించే ఆరోగ్యకరమైన ఆహారశైలిగా దీనికి పేరు. నగరంలో తోఫూ, బేసిల్–లెమన్ సూప్, పహాడ్ క్రాపావొ వంటివి బాగా ఆదరణ పొందిన వంటకాలు. ఇక రొయ్యల వంటకాలంటే లొట్టలేసే ప్రియులకైతే థాయ్... సూపర్. థాయ్ వంటకాల కోసం తాజ్డెక్కన్లోని సిన్, జూబ్లీహిల్స్‌లోని అర్బన్ ఏసియా, రాడిసన్ బ్లూలోని హోలీ బేసిల్, బేగంపేట తాజ్ వివంతాలోని థాయ్ పెవిలియన్ రెస్టారెంట్లు బెస్ట్. ఇద్దరు కలిసి రుచులను టేస్ట్ చేయాలంటే రూ.500 నుంచి రూ.2వేలు ఖర్చు అవుతాయి. అరేబియన్.. అదిరెన్... అమెరికా క్యుజిన్‌ను పోలి ఉండే అరేబియన్ శైలి వంటకాలు నగరంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. కబ్సా, మురమురాలతో పాటు బఖాదరా వంటి డిసర్ట్‌లు కూడా నగరంలో ఫేమస్. అరేబియన్ వంటకాల్లో డ్రైఫ్రూట్స్ బాగా వినియోగించడం సిటీలో మరింత ఆదరణకు కారణమైంది. అరేబియన్ వంటకాల కోసం టోలిచౌకిలోని ఫోర్‌సీజన్స్ మంచి ఎంపిక. అరేబియన్ని ఆరగించాలి అంటే రూ.300నుంచి రూ.1000 వరకు అవుతాయి. లెబనీస్.. యమ టేస్టీ బాస్.. డ్రైఫ్రూట్స్‌ను అధికంగా ఉపయోగించే లెబనీస్ శైలి వంటకాలు కూడా నగరంలో ఆదరణకు నోచుకుంటున్నాయి. శనగలు ఎక్కువగా వాడే వీరి వంటకాల్లో... ఆల్ షీమీ కోఫ్తాడజాజ్, ఖబ్సాలాహమ్ వంటివి నగరంలో రుచుల ప్రియులకు చేరువయ్యాయి. ఆలివ్ ఆయిల్తోఈ వంటకాలు చేయడం కూడా ఆరోగ్యప్రియుల ఆదరణకు కారణం. లెబనీస్ టేస్ట్ కోసం మాదాపూర్‌లోని ఆల్‌సీజన్స్ రెస్టారెంట్ బెస్ట్. రూ.500– రూ.1000 బిల్లు అవుతుంది. గ్రీక్.. క్లిక్ లేట్‌గా వచ్చినా లే‘టేస్ట్’ అనిపించుకుంటున్నాయి గ్రీక్ వంటకాలు. రోజ్మేరీ, థైమ్, బేసిల్ (తులసి) వంటి హెర్బ్స్ (వివిధ రకాల ఆకులు) అధికంగా మేళవించే ఈ వంటకాలు ఇటీవలే నగరానికి పరిచయమయ్యాయి. వెరైటీ బ్రెడ్స్ కూడా ఈ క్యుజిన్కు స్పెషల్. ప్రస్తుతానికి వెజ్ ముసాకా, ఎమిస్టా వంటి వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. జూబ్లీహిల్స్‌లోని బ్లూడోర్ రెస్టారెంట్ గ్రీక్ వంటకాల ప్రత్యేకం. దీనిలో టేస్ట్ చేయాలి అంటే ఇద్దరికి కనీసం రూ.1500 ఉండాల్సిందే. అఫ్గాన్ వంటకాల.. అరియానా ఆఫ్ఘనిస్తాన్ వంటకాలు సైతం ఇక్కడ ఆకట్టుకోవడం విశేషం. అక్కడి ప్రజల అభిరుచుల మేరకు తయారు చేసే వంటకాలన్నీ ఇప్పుడు నగరంలోని ఫుడ్డీలకు అందించడం హాట్‌టాపిక్. శుక్ర, శని, ఆదివారాల్లో నగరంలోని పలు రెస్టారెంట్లలో లభిస్తున్న విదేశీ వంటకాలను టెక్కీలు టేస్ట్ చేస్తున్నారు. ‘కుబిలీపులావ్’ భోజన ప్రియుల్ని లొట్టలేపిస్తుంది. బంజారాహిల్స్‌లోని ‘అరియానా బై సఫీ’ రెస్టారెంట్లో లభిస్తాయి. ఇద్దరికి కనీసం రూ.1000 ఉండాల్సిందే. సిటీలో విదేశీ వంటకాలు అందుబాటులో ఉండటం చాలా ఆనందంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏసియన్, మెక్సికన్, ఇటలీ, థాయ్ వంటకాల్లో లభించే ఐటెమ్స్ నోరూరిస్తున్నాయి. – నేహా ఝా మెక్సికో ఐటెమ్స్ అంటే చాలా ఇష్టం. వీకెండ్స్‌లో మమ్మీ, సిస్టర్‌తో లేదా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తుంటా. మెక్సికో ఐటెమ్స్‌లో ఎక్కువగా నాథూస్, వ్రోప్స్ వంటివి చాలా టేస్టీగా ఉంటాయి. – దివ్య పసుమర్తి -
వర్షాకాలంలో.. చక్కటి ఆహారం
సాక్షి: వేసవి వెళ్లింది. తొలకరి పలకరింపుతో వర్షాకాలం వచ్చేసింది. వస్తూవస్తూ అనేక వ్యాధులను వెంటబెట్టుకొచ్చే ఈ కాలంలో క్లిష్టమైన వాతావరణ పరిస్థితులుంటాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లతో వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని శక్తిమంతంగా, హైడ్రేషన్లో ఉంచే పోషకాహారాన్ని ఎక్కుగా తీసుకుంటూ.. జీవక్రియను సక్రమంగా, చురుగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచి, ఆరోగ్యంగా ఉంచే మాన్సూన్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. మంచి నీరు చలికాలంలో దాహం వేయలేదని మంచినీళ్లు తాగడం తగ్గిస్తారు కొంతమంది. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలా జరగకుండా శరీరాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవటానికి, ఇన్ఫెక్షన్స్ బారి నుంచి తప్పించుకునేందుకు ఈ సీజన్లో కూడా నీరు ఎక్కువగా తాగాలి. బాగా మరిగించి, వడపోసిన నీటిని తాగితే మరింత శ్రేయస్కరం. తాజా ఫలాలు వర్షాకాలంలో.. వ్యాధినిరోధకతను పెంపొందించే విటమిన్-సి అధికంగా ఉండే ఫలాలను తినాలి. అలాంటి వాటిల్లో దానిమ్మ, కివి,ఆరెంజ్ వంటివి ఉత్తమం. జలుబు, దగ్గుతో వంటి రోగాలతో బాధపడుతున్నట్లయితే నీటిశాతం అధికంగా ఉన్న ఫ్రూట్స్‌ను తినడం ఉత్తమం. వెచ్చని పానీయాలు వర్షాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. అందుకు గోరువెచ్చని సూపులు, పానీయాలు తరచూ తాగుతూ ఉండాలి. వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో సూపులు బాగా ఉపయోగపడుతాయి. అల్లం, లెమన్, గ్రీన్ టీలను తీసుకుంటే శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. కూరగాయలు వర్షాకాలంలో తాజా కూరగాయలను తినటం ఆరోగ్యానికి మంచిది. కూరగాయలు వండే ముందు శుభ్రంగా కడగాలి. ఈ కాలంలో బ్యాక్టీరియా, ఇతర క్రిములు వాటిపై ఉండే అవకాశం ఉంది. కూరగాయలను ఉడికించి తింటే ఆరోగ్యానికి మరింత మంచిది. వండిన ఆహారాలు ఈ సీజన్లో తీసుకునే ఆహారాలు బాగా ఉడికించినవై ఉండాలి. పచ్చి కూరలు తినటం పూర్తిగా నివారించాలి. డైరీ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసపు ఉత్పత్తులను ఉడికించి మాత్రమే తీసుకోవటం శ్రేయస్కరం. మాంసం ఈ కాలంలో బాగా ఉడికించిన మాంసాహారాలను మాత్రమే తీసుకోవాలి. కూరల్లో నూనె తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఫ్రై చేసిన వాటికంటే గ్రిల్ చేసిన లేదా ఉడికించిన మాంసాహారాలు తీసుకోవటం ఉత్తమం. ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు వర్షాకాలంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఆయిల్ లేదా ప్రైడ్ ఫుడ్స్‌ను తినడం నివారించాలి. గ్రిల్డ్ చేసిన ఆహారాలను మితంగా తీసుకోవటం మంచిది. జీర్ణక్రియను మెరుగుపరచటంలో ఇవి దోహదపడుతాయి. యాంటీఆక్సిడెంట్స్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, శరీరానికి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనిటీ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి వాటిల్లో కాప్సికమ్, బెర్రీస్, గుమ్మడి వంటివి ఉత్తమమైనవి. అందువల్ల వీటిని తరచూ మీ డైట్లో ఉండేటట్లు చూసుకోవాలి. జ్యూస్‌లు వేసవి మాత్రమే కాకుండా అన్నికాలాల్లోనూ పళ్లరసాలు ఆరోగ్యానికి ప్రయోజనం. శరీరానికి తగిన హైడ్రేషన్‌ను అందివ్వటానికి తాజా పండ్లు, కూరగాయలతో చేసిన జ్యూస్‌లను అధికంగా తీసుకుంటే మంచిది. తినకూడని పదార్థాలు.. వర్షాకాలంలో సాధారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. అందువల్ల జీర్ణమయ్యేందుకు ఎక్కవ సమయం తీసుకునే ఆహారం తీసుకోవటాన్ని నివారించాలి. పకోడాలు, రోడ్డుపక్కన దొరికే చాట్స్, కచోరిలు, సమోసాలు, ైఫాస్ట్ఫుడ్స్, ఆకుకూరలు, సీఫుడ్స్ తినడం తగ్గించాలి. ప్రధానంగా ఆకుకూరలు వండేటప్పుడు సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఎక్కువ. -
Devil's food Cake మీకూ ఇష్టమేనా?
భాషణం రుచికరమైన ఆహార పదార్థాలను భుజిస్తున్నప్పుడు కలిగే సంతృప్తిని మాటల్లో చెప్పలేం. అందుకేనేమో చేతల్లో చూపిస్తుంటాం! అయితే ఆ చేతల్ని ఫుడ్డును తగ్గించాల్సి వచ్చినప్పుడు మాత్రం చూపించలేం. మాటలకే పరిమితం అవుతాం. మనుషులకు గానీ, ఇతర ప్రాణులకు గానీ అంత ప్రీతికరమైనది food! అందుకే ఏటా మనం తీసుకునే కొత్త సంవత్సర తీర్మానాలలో డైటింగ్ చేసి బరువు తగ్గాలన్నది కూడా ఒక తప్పనిసరి అంశంగా ఉంటోంది. ఈ సందర్భంగా మనం food అనే మాటతో వచ్చే కొన్ని పదాల గురించి మాట్లాడుకుందాం. Comfort food అంటే సేద తీచ్చే ఆహారం. ఒంటరిగా, ఇంటికి దూరంగా ఉన్నప్పుడు; మనసు ఆందోళనగా ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఆహార పదార్థాలు సాంత్వన చేకూరుస్తాయి. అవే కంఫర్ట్ ఫుడ్స్. సాధారణంగా అవి మన బాల్యానికి సంబంధించినవై ఉంటాయి. ఉదా: చాక్లెట్లు మిఠాయిలు వగైరా. Convenience food అంటే... తినడానికి దాదాపు తయారుగా ఉన్న ఆహారం. మార్కెట్లో దొరికే రెడీమేడ్ దోసెలపిండి ఇలాంటిదే. కొని తెచ్చాక ఇలా కలిపి అలా పెనంపై వేసుకోవచ్చు. Devil's food cake అంటే గాఢమైన రుచిగల నల్లటి చాక్లెట్ కేక్. (బహుశా నలుపును, గాఢతను దెయ్యానికి ప్రతీకాత్మంగా తీసుకోవడం వల్ల ఇలా అంటుండవచ్చు. మొదట్లో ఈ కేకు లోపల ఎర్రగా, పైన తెల్లగా ఉండేదట).Finger food అంటే ఫోర్కులు, చెంచాలతో పని లేకుండా తినగలిగిన ఆహారం. మన దగ్గరంతా ఫింగర్ ఫుడ్డే. అన్నం మొదలు దాదాపు ప్రతి పదార్థాన్నీ చేత్తోనే తినేస్తాం. పాశ్చాత్యదేశాలలో ఇలా చేత్తో తినే అలవాటు లేదు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఫింగర్ ఫుడ్ అనే మాట పుట్టుకొచ్చింది. Food additive (యాడిటివ్) అంటే ఆహారానికి రుచి కోసం, రంగు కోసం కలిపే పదార్థం. Addictive (అడిక్టివ్) అంటే మళ్లీ వేరు. మనిషిని బానిసను చేసుకునే పదార్థాన్ని అడిక్టివ్ అంటారు. Tobacco is highly addictive. Food chain అంటే... తమ కింది వాటిని భుజించే ప్రాణుల శ్రేణి. ఉదా: పూలను గొంగళి పురుగు తింటుంది. గొంగళి పురుగును కప్ప తింటుంది. కప్పను పాము తింటుంది. పామును డేగ తింటుంది. ఇదంతా ఒక ఫుడ్ చైన్. Food poisoning అంటే ఆహారం వల్ల కలిగే అస్వస్థత. ప్రమాదకరమైన బ్యాక్టీరియా కారణంగా ఆహారం విషమించడాన్నే ఫుడ్ పాయిజనింగ్ అంటారు. Food stamp అంటే తిండి గింజలను, ఇతర దినుసులను చవకగా కొనుక్కునేందుకు ప్రభుత్వ ఇచ్చే రేషన్ కూపన్. Functional food అంటే విటమిన్లు, ఖనిజాలు, ఔషధాలు కలిపి బలవర్థకంగా తయారు చేసిన పదార్థం. దేహానికి సరిపాళల్లో పోషకాలు అందనప్పుడు వైద్యులు ఇలాంటి ఫంక్షనల్ ఫుడ్‌ని సిఫారసు చేస్తారు. Nutraceutical అన్నా కూడా ఇదే అర్థం. దీనిని న్యూట్రిసూటికల్ అని పలకాలి. Health food అంటే ఆరోగ్యకరమైన ఆహారం. దీనికి విరుద్ధం ఒఠజు జౌౌఛీ. హెల్త్ ఫుడ్‌లో కొవ్వులు, అధిక చక్కెర నిల్వలు, కృత్రిమ రసాయనాలు ఉండవు. జంక్‌ఫుడ్‌లో ఇవన్నీ ఉంటాయి. అయితే రెడీమేడ్‌గా దొరుకుతుంది కాబట్టి జనం వీటికి బాగా అలవాటు పడిపోతారు. చివరిగా Food for thought అంటే to make someone think seriously about something. మెదడుకు మేత అనుకోండి. Dogfooding Dogfooding అనేది ఒకే మాట. Eating your own dog food అనే ఆంగ్ల మాండలికం నుంచి వచ్చిన పదం. కంపెనీలు (ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు) తమ ఉత్పత్తులను మార్కెట్ చేయబోయే ముందు వాటి పని తీరు తెలుసుకోవడం కోసం తమ సిబ్బందికి వాడకానికి ఇస్తాయి. అలా ఇవ్వడాన్నే dogfooding అంటారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ తను కొత్తగా కనిపెట్టిన ‘గార్డియన్’ అనే అప్లికేషన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి ముందు ఇలాగే ఛీౌజజౌౌఛీజీజ చేసింది.