కలీ... కటింగ్ | Ladies Tailor of Kali Cutting | Sakshi
Sakshi News home page

కలీ... కటింగ్

Published Sun, May 15 2016 4:53 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

కలీ... కటింగ్

కలీ... కటింగ్

లేడీస్ టైలర్
అమ్మాయిలు బుట్టబొమ్మల్లా కనిపించడానికి అమితంగా ఇష్టపడే డ్రెస్ జాబితాల్లో కలీ ఎప్పుడో చేరిపోయింది. కరెక్ట్ ఫిటింగ్, కంఫర్ట్, కలర్‌ఫుల్‌గా కనిపించే ఈ డ్రెస్‌లను అతివలు ముచ్చటపడి మరీ ఎంచుకుంటుంటారు. కలీ కుర్తీలోనే షార్ట్-లాంగ్ లెంగ్త్‌వి ఉంటాయి. కలీని ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసుకుందాం.  కలీ అందం అంతా ప్యానెల్స్‌లో ఉంటుంది. ఎన్ని ఎక్కువ ప్యానెల్స్ వస్తే కలీ అంత విప్పార్చుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఇస్తున్న కలీ కటింగ్‌లో ప్యానెల్స్ సంఖ్య 16 తీసుకున్నాం. చార్ట్ లేదా ఎంచుకున్న క్లాత్ మీద డ్రాఫ్టింగ్ తీసుకొని, తర్వాత కట్ చేయాలి.
 
క్లాత్ ఇంచులలో...
1 మీటర్ క్లాత్ కొలత తీసుకుంటే = 40 ఇంచులు
4 మీటర్ల క్లాత్ అయితే 40గీ4 = 160 ఇంచులు
 
కింద ఇచ్చిన చార్ట్ డ్రాప్ట్‌ను పరిశీలించండి....
ప్యానెల్స్ సంఖ్య - 16 (ప్రతీ ప్యానెల్ 1/2 ఇంచు కుట్టు భాగాన్ని వదిలి కట్ చేసుకోవాలి)
AB = ఫుల్ లెంగ్త్ (మొత్తం పొడవు)
AE = ఆర్మ్ హోల్ /2 - 1/2 అంగుళం కుట్టు (చంకభాగం రెండువైపులా)
AF= వెయిస్ట్ లెంగ్త్ (నడుము కొలత)
AG = హిప్ లెంగ్త్ (పిరుదుల భాగం)
AA1=EE1 = (ఛాతీ చుట్టుకొలత / ప్యానెల్స్) /2 (రెండువైపులా)
FF1 = (వెయిస్ట్ రౌండ్ (నడుము చుట్టుకొలత / ప్యానెల్స్ సంఖ్య) /2 (రెండువైపులా)
GG1 = (హిప్ రౌండ్ (పిరుదుల భాగం)/ ప్యానెల్స్ సంఖ్య ) / 2 వైపులా
BB= వాల్యూమ్ ఇంచెస్ (కలీ కింది భాగం అంగుళాలలో)/ ప్యానెల్స్ సంఖ్య)/ 2 వైపులా
BB1 = (160 ఇంచులను 16 ప్యానెల్స్‌గా విభజించుకోవాలి)2 వైపులకు = ఒక్కో ప్యానెల్‌కు 5 ఇంచులు తీసుకోవాలి. ఆ1  ఆ2 = 1/2 ఇంచు కర్వ్ షేప్ గీసి, వంపు వచ్చేలా కట్ చేయాలి.నోట్: ఇలా డిజైన్ చేసుకున్న కలీ అంచు భాగం మొత్తం 360 డిగ్రీల కోణం ఉండాలి.

కలీ కుట్టు... ప్యానెల్స్ అన్నీ జతచేసి కుట్టాలి. తర్వాత కుర్తీ ఛాతీ భాగాన్ని ఛాతీ కొలతల ప్రకారం కట్ చేసి కుట్టాలి. అలాగే నెక్, స్లీవ్స్ కట్ చేసుకొని కుట్టాలి.
 
వివిధ పరిమాణాలఆర్తి
ఫ్యాషన్ డిజైనర్
ఇన్‌స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ (ఐడిఐ) హిమాయత్‌నగర్, హైదరాబాద్ . www.idi.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement