వారఫలాలు : 21 ఆగస్టు నుంచి 27ఆగస్టు, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆదాయం అనుకున్నంతగా సమకూరుతుంది. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో సమస్యలు అధిగమిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తుల సేవలకు గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. లేత ఎరుపు, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
వారాంతంలో ఊహించని సమాచారం అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కివస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకమే. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఒక కోర్టు వ్యవహారంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. నలుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
బంధువుల తోడ్పాటుతో పనులు చక్కదిద్దుతారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. గులాబీ, లేత ఎరుపు రంగులు, ద క్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. ఆప్తులు, బంధువుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలకు సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. రాబడి పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు,మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరిగే సూచనలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. గులాబీ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా నేర్పుగా పరిష్కరించు కుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు సన్మానాలు, అవార్డులు. పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన పనులు కొన్ని నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ఆరోగ్యం కొంత చికాకు పెట్టవచ్చు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు కొన్ని మార్పులు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు కాస్త తొలగుతాయి. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.సన్నిహితులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులకు నిరుత్సాహమే. నలుపు, లేత ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు ప్రారంభిస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఒక ముఖ్యసమాచారం అందుతుంది. ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది. తెలుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు