వారఫలాలు : 9 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2016 వరకు | vaara phalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 9 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2016 వరకు

Published Sun, Oct 9 2016 2:50 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

వారఫలాలు : 9 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2016 వరకు

వారఫలాలు : 9 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనూకూలం. గణపతికి అర్చన మంచిది.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. గొంతు సంబంధిత రుగ్మతలు. రాబడి కొంత పెరిగే సూచనలు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణయత్నాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఆకుపచ్చ, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కార్యకమాలలో విజయం. సోదరులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాల సాధనలో బంధువుల తోడ్పాటు . భూములు, భవనాలు కొంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారుల యత్నాలు సఫలం. పసుపు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కార్యజయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. నేరేడు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు  ఇంటర్వ్యూలు రాగలవు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విందువినోదాలు. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. లేత ఎరుపు, గులాబీ, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. భూవివాదాలు పరిష్కారం. వాహనాలు,ఆభరణాలు కొంటారు. రావ లసిన డబ్బు అందుతుంది. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామ రక్షాస్తోత్రం పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు చే స్తారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కార్యక్రమాలు కొన్ని శ్రమానంతరం పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.పెట్టుబడుల్లో నిదానం అవసరం. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. గులాబీ, లేత పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
నిరుద్యోగులు విజయాలు సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. భూములు, ఇళ్లు కొంటారు. స్వల్ప అనారోగ్యం. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణాలు తీరతాయి. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.  సభలు,సమావేశాల్లో పాల్గొంటారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయాలు సంద ర్శిస్తారు. గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. పసుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.  దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త ఆశలు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో 11 ప్రదక్షణలు చేయండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement