16 డిసెంబర్ నుంచి 22 డిసెంబర్ 2018 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పరపతి మరింత పెరుగుతుంది. అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా ముగిస్తారు. అందరిలోనూ మీకు ఎదురుండదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కుతాయి. వాహన, గృహయోగ సూచనలు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని పదోన్నతులు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
రుణబాధలు చాలావరకూ తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేసి సత్తా నిరూపించుకుంటారు. మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. కుటుంబంలో శుభకార్యాల హడావిడి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. ఒత్తిడులు. పసుపు, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకోండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మిత్రులతో వివాదాలు పరిష్కరించకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. కోర్టు వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. మీమాటే కుటుంబంలో శిరోధార్యంగా భావిస్తారు. వేడుకలు నిర్వహిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ, వాహనయోగం. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో స్థాయి పెరుగుతుంది. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో సోదరులతో కలహాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకర్షిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తుల వివాదాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో కదలికలు వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. మీపై మోపిన అభాండాలు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, లేతనీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ ఆశయాలు నెరవేరేందుకు మార్గం ఏర్పడుతుంది. ఒక సమాచార ం సంతోషం కలిగిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు ఎదురుకావచ్చు. గులాబీ, ఎరుపురంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగినా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారంతో భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రోత్సాహం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త çపనులు చేపట్టడమే కాకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు అమలు చేస్తారు. మీ విజ్ఞానాన్ని అందరితో పంచుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు.స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు మరింత సానుకూలం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉండడమే కాకుండా రుణబాధలు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మీ సత్తా నిరూపించుకుంటారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు కొంత మందగించినా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ఆప్తులు, బంధువుల సూచనలు పాటిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. చిరకాల మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఎంత శ్రమకోర్చినా అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు సైతం ఒత్తిడులు పెంచుతారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కాస్త ఊరటనిస్తుంది. విద్యార్థులు అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వాహనాల విషయంలో అప్రమత్తంగా మెలగండి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. కళారంగం వారికి గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అందరిలోనూ విశేష గుర్తింపు రాగలదు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు తథ్యం. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
Comments
Please login to add a commentAdd a comment