వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు) | Weekly Horoscope In Telugu July 7th to 13th 2019 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

Published Sun, Jul 7 2019 10:57 AM | Last Updated on Sun, Jul 7 2019 10:59 AM

Weekly Horoscope In Telugu July 7th to 13th 2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన  వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల అభిప్రాయాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
మీ ఊహలు, అంచనాలు కొంతమేర ఫలిస్తాయి. విద్య, ఉద్యోగావకాశాలు శ్రమానంతరం దక్కుతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువుల ఆదరణ పొందుతారు. ఆర్థిక విషయాలలో ఒత్తిడులు తొలగుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమై చేయూతనందిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
గతంలో మధ్యలో నిలిచిన పనులు సైతం పూర్తి కాగలవు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సోదరులతో వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహనయోగం. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. వ్యాపారాలు క్రమేపీ అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
బంధుమిత్రుల ఒత్తిడులు మరింత పెరుగుతాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. అనుకున్న పనుల్లో ప్రతిష్ఠంభన. కొత్త వ్యక్తుల పరిచయం కొంత ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ కొంతమేర ఫలిస్తుంది. కుటుంబసభ్యుల నిర్ణయాలపై అసంతృప్తి చెందుతారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పాటిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. కుటుంబసభ్యులు సైతం మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీల మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో శ్రమాధిక్యం. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రుణభారాలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి చేకూరుతుంది. వాహనయోగం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరించి లాభాలు అదుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని సమస్యలు పరిష్కారమై ఊపిరిపీల్చుకుంటారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు అ«ధిగమించి ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. బంధువులతో శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉన్నా అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. సంఘంలోనూ, కుటుంబంలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు శుభవర్తమానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్ధిక వ్యవహారాలు కాస్త ఊరటనిస్తాయి. పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. చాకచక్యంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయి. కోర్టు వ్యవహారం ఒకటి పరిష్కారమయ్యే సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఒక ఆహ్వానం మరింత ఉత్సాహాన్నిస్తుంది. సంఘంలోనూ, కుటుంబంలోనూ మీరంటే మరింత ఇష్టపడతారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి పురస్కారాలు దక్కుతాయి. వార ం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement