తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివద్ధి పథకాలు కేంద్రం ఇస్తున్న నిధులతోనే కొనసాగుతున్నాయి. కానీ ఈ పథ కాల అమలులో కేంద్రం ప్రస్తావన కూడా చేయ కుండా మొత్తం తమ ఘనతగా కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంటూండటం విచారకరం. మిషన్ భగీ రథ, రూపాయికి కిలో బియ్యం, మిషన్ కాక తీయ, పెన్షన్లు, ఆరోగ్య పథకం వంటి పలు తెలం గాణ ప్రభుత్వ పథకాలు కేంద్రం చేయూత
తోనే కొనసాగుతుండటం వాస్తవం. అందుకే ఈ అంశంపై నిజాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల కోసమని కాకుండా, కేంద్రం సహాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ సాధించలేవనే వాస్త వంపై బీజేపీ నాయకులు, కార్య కర్తలు తెలంగాణలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తూ ఓటర్లకు నిజాన్ని వివరించి చెబుతున్నారు. అధికార, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తెలంగాణలో బలమైన ప్రత్యా మ్నాయం దిశగా బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
మొత్తం మీద చూస్తే తెలం గాణలో 2019లో జరుగనున్న శాసనసభ ఎన్ని కల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలు బలపడే అవ కాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ధనబలం, కులబలం, అధికార దాహం ఆధారంగా 2019లో తెలంగాణలో మళ్లీ అధికారం చేపట్టాలని అటు తెరాస ఇటు కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయగలిగానని గొప్పలు చెప్పుకుంటున్న తెరాసకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకుని ఒడ్డెక్కేందుకు వివిధ పార్టీలనుంచి నేతలను చేర్చుకోవడంపై కాంగ్రెస్ దష్టి సారించింది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అంతర్గత కుమ్ము లాటలు ఎక్కువయ్యాయి. దీంతో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు బలపడే అవకా శాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీన్ని అవకా శంగా తీసుకుని తెలంగాణలో ఏర్పడిన రాజకీయ శూన్యతను ఛేదించాలన్న పట్టుదలతో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చర్యలతో దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరగడం, దీంతోపాటు మోదీ ఇమేజ్ వ్యక్తిగతంగా మెరుగవడం అనేవి వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశా లను మరింతగా మెరుగుపర్చనున్నాయి. పైగా, తెలంగాణలోనూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు బీజేపీ పట్ల ఆదరణ పెరిగింది.
2019లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 350 స్థానాలు సాధించే లక్ష్యంతో పాటు, తెలంగాణ రాష్ట్రంపై కూడా బీజేపీ ప్రత్యేక దష్టి సారిస్తోంది. తెలంగాణలో గెలుపు లక్ష్యంగా బీజేపీ అధినాయ కత్వం వ్యూహాత్మక కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడతగా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దేశవ్యాప్తంగా మూడు మాసాలపాటు ప్రతి రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించి క్షేత్రస్థాయి పని వేగ వంతం అయ్యేలా పురమాయించారు. దీంట్లో భాగంగానే తెలంగాణలో పార్టీకి వ్యూహాలను, కార్యాచరణ, లక్ష్యాలను నిర్దేశించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రబలుతుండటం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ క్షీణదశకు చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల ప్రభావాన్ని తగ్గించే వ్యూహాత్మక, ఆచరణాత్మక కార్యాచరణను బీజేపీ తెలంగాణ పార్టీ సిద్ధం చేసుకుంది.
తెలంగాణలో బీజేపీని బూత్ స్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది వచ్చే ఎన్నికలలో సత్ఫలితాలను సాధిస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయాలని అసెంబ్లీ ముట్టడి, నిరుద్యోగ సమరభేరి పేరుతో సభ నిర్వహించాం. రైతు పంచాయితీ పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తూ రైతులను సంఘటిత పరుస్తున్నాం. రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించడం ఖాయం.
కొట్టె మురళీకృష్ణ , (వ్యాసకర్త బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్)
Comments
Please login to add a commentAdd a comment