విజయనగరం: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. విజయనగరం జిల్లా పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజినీర్ ఎస్. కృష్ణాజీ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేపట్టింది. జిల్లాలోని వుడా కాలనీ ఫోర్త్ ఫేజ్‌లో డీఈ కృష్ణాజీ ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూ. 4 కోట్ల ఆస్తులు, అరకేజీ బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నట్టు ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు.
పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
Published Fri, Aug 14 2015 1:15 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement