Panchayati raj engineer
-
పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
విజయనగరం: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. విజయనగరం జిల్లా పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజినీర్ ఎస్. కృష్ణాజీ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేపట్టింది. జిల్లాలోని వుడా కాలనీ ఫోర్త్ ఫేజ్‌లో డీఈ కృష్ణాజీ ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూ. 4 కోట్ల ఆస్తులు, అరకేజీ బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నట్టు ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు. -
పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
-
పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ రాజేంద్రనాథ్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావటంతో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. వారి తనిఖీల్లో రాజేంద్రనాథ్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన ప్రస్తుతం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన షాద్‌నగర్ నుంచి బదిలీపై వెళ్లారు. రవీంద్రనాధ్పై పలు అవినీతి ఆరోపణలు రావటంతో రాజేంద్రనగర్, గాంధీ నగర్లో ఉన్న ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.4 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. రెండు ఇళ్లు, రెండు ఫ్లాట్లు, కారు, 40 కిలోల బంగారం, కిలో వెండిని కూడా అధికారులు గుర్తించారు.