తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ శుద్ధి కార్యక్రమం ఉదయం ప్రారంభమై 11 గంటల వరకూ ఇది కొనసాగింది. పసుపు, చందనం, కుంకుమ, తిరునామం, పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ప్రత్యేక లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేశారు.
ఆలయశుద్ధి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, టీటీడీ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొంటున్నారు. ఏటా నాలుగు సార్లు తిరుమంజనం కార్యక్రమం జరుగుతుంది. 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభం కానుంది.