తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనం కోసం 13 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 75,374 మంది భక్తులు దర్శించుకున్నారు.
కాగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు సింహవాహన సేవ జరగనుంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అనంతరం ముత్యపు పందిరి వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Published Fri, Oct 16 2015 8:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM
Advertisement
Advertisement